Urvashi Rautela (Source: Instragram)
ఊర్వశీ రౌతేలా.. ఇండియన్ మోడల్ గా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత నటిగా మారి బాలీవుడ్లో పలు చిత్రాలలో నటిస్తూ తనకంటూ ఒక పేరు సొంతం చేసుకుంది.
Urvashi Rautela (Source: Instragram)
తన సినిమాల ద్వారానే కాకుండా పెట్టుబడుల రంగంలో కూడా పెట్టుబడులు పెడుతూ.. సుమారుగా రూ.300 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించింది ఈ ముద్దుగుమ్మ.
Urvashi Rautela (Source: Instragram)
ఇకపోతే ప్రస్తుతం ఊర్వశీ ఫ్యాషన్ ఐకాన్ గా మారిపోయింది. తాజాగా 78వ కేన్స్ చలనచిత్రోత్సవంలో రోజుకొక ట్రెండీ దుస్తులలో ప్రపంచ ఫ్యాషన్ అభిమానులను ఆకట్టుకుంటుంది.
Urvashi Rautela (Source: Instragram)
నిన్న మొన్నటి వరకు వివిధ రకాల దుస్తులతో ఆకట్టుకున్న ఈమె ఈరోజు హెవీ ఎంబ్రాయిడరీ డిజైన్ తో తయారు చేసిన బాడీ కాన్ డ్రెస్ ధరించి తన అందాన్ని మరొకసారి విస్తృతం చేసింది.
Urvashi Rautela (Source: Instragram)
ఇక ఇక్కడ ఈమె తన చేతిలో పట్టుకున్న హ్యాండ్ క్లచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పవచ్చు.
Urvashi Rautela (Source: Instragram)
మొన్న ప్యారెట్ ఆకారపు క్లచ్ తో వచ్చిన ఈమె ఈసారి.. మరో డిఫరెంట్ ప్యాట్రన్ తో చేసిన క్లచ్ ను తన వెంట తీసుకొచ్చి మరింత ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో రోజుకొక ట్రెండీ దుస్తులతో ఫ్యాషన్ ప్రియులను అలరిస్తోంది ఊర్వశీ.