BigTV English
Advertisement

Boyapati – NBK : అఖండ రిలీజ్ డేట్ ఫిక్స్, అది మిస్ అయితే మరో డేట్

Boyapati – NBK : అఖండ రిలీజ్ డేట్ ఫిక్స్, అది మిస్ అయితే మరో డేట్

Boyapati – NBK : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ కాంబినేషన్స్ లో బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ ఒకటి. బోయపాటి శ్రీను ఎంతమందితో సినిమాలు చేసినా కూడా బాలకృష్ణతో సినిమా అంటేనే ఒక హై ఉంటుంది. ఎందుకంటే బాలకృష్ణని ఎలా చూపించాలో ఎలా చూపిస్తే ప్రేక్షకులు ఇష్టపడతారు అనేదాంట్లో పిహెచ్డి చేశాడు అనే విధంగా సినిమాను తెరకెక్కిస్తుంటాడు. భద్ర సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన బోయపాటి శ్రీను తన కెరీర్ లో ఎన్నో హిట్స్ సినిమాలు చేశాడు. అయితే బాలకృష్ణ తో చేసిన సినిమాలు మాత్రం మంచి పేరును తీసుకొచ్చాయి.


సింహా సినిమాతో మొదలైన కాంబినేషన్

ఆల్మోస్ట్ బాలకృష్ణ కెరియర్ ముగిసిపోతుంది అనుకున్న టైంలో శ్రీను దర్శకత్వంలో సింహా అనే సినిమాను చేశాడు బాలయ్య. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత బాలయ్య వరుస సినిమాలకు సైన్ చేసాడు. మరోవైపు బోయపాటి శ్రీను కూడా ఫుల్ బిజీ అయిపోయాడు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి లెజెండ్ అనే మరో సినిమా చేశారు. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. బాలకృష్ణను రెండు పాత్రలలో చూపించి బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకున్నాడు. లాస్ట్ గా వచ్చిన అఖండ సినిమా గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ఆ సినిమాలో బయటపెట్టాడు బోయపాటి. అలానే థమన్ అందించిన మ్యూజిక్ కూడా సినిమాకి మంచి ప్లస్ అయింది.


అఖండ రిలీజ్ అప్డేట్

ప్రస్తుతం అఖండ 2 సినిమాకి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ సినిమా రిలీజ్ దసరాకే ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ మిస్ అయితే డిసెంబర్ లో ఉండొచ్చు. దీని గురించి అధికారక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. అప్పట్లో బాలకృష్ణ వరుసగా సినిమాలు చేస్తున్న కూడా అవి బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవుతూ వచ్చాయి. అయితే బాలకృష్ణకి అన్ స్టాపబుల్ అనే షో కూడా చాలా పెద్ద ప్లస్ అయింది. అంతకు ముందు బాలయ్య తీరు చాలామందికి నెగిటివ్ ఇంప్రెషన్ తీసుకొస్తే, ఈ షో మాత్రం బాలయ్య లోని అసలైన వ్యక్తిత్వాన్ని బయటపెట్టింది. వ్యక్తులతో మాట్లాడే విధానం. వాళ్లతో మాట్లాడే తీరు ఇవన్నీ కూడా బాలకృష్ణకి ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని తీసుకొచ్చి పెట్టాయి. అదే అఖండ సినిమాకి కూడా ఒక రకంగా ప్లస్ అయిందని చెప్పొచ్చు.

Also Read : Vijay Kanakamedala: మెగా అభిమానులకు సారీ చెప్పిన భైరవం దర్శకుడు

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×