Vaishnavi Chaitanya (Source/Instagram)
వైష్ణవి చైతన్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Vaishnavi Chaitanya (Source/Instagram)
ఒక సాధారణ యూట్యూబర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన వైష్ణవి.. అల వైకుంఠపురంలో చిత్రంలో బన్నీకి చెల్లిగా నటించి మెప్పించింది.
Vaishnavi Chaitanya (Source/Instagram)
ఇక ఈ సినిమా తరువాత వైష్ణవి సోలో హీరోయిన్ గా బేబీ సినిమాలో నటించింది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది.
Vaishnavi Chaitanya (Source/Instagram)
బేబీ సినిమా తరువాత వైష్ణవికి టాలీవుడ్ లో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. దిల్ రాజు ప్రొడక్షన్ లో ఈ చిన్నది లవ్ మీ అనే సినిమా చేసింది.
Vaishnavi Chaitanya (Source/Instagram)
లవ్ మీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా.. వైష్ణవికి మాత్రం ఆఫర్లు తగ్గలేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా మారింది.
Vaishnavi Chaitanya(Source/Instagram)
వైష్ణవి చేతిలో ఒకటి కాదు రెండు కాదు దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే సిద్దు జొన్నలగడ్డ సరసన ఈ భామ జాక్ అనే సినిమాలో నటిస్తోంది.
Vaishnavi Chaitanya(Source/Instagram)
జాక్ సినిమా కాకుండా తమిళ్ లో ఒక రెండు సినిమాలు.. కన్నడలో మరో రెండు సినిమాలను లైన్లో పెట్టిందని టాక్.
Vaishnavi Chaitanya(Source/Instagram)
ఇక సినిమాల విషయం పక్కనపెడితే ఈ చిన్నది సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఆమె సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.
Vaishnavi Chaitanya(Source/Instagram)
పర్పుల్ కలర్ డిజైనర్ చీరలో అచ్చ తెలుగు ఆడపడుచులా వైష్ణవి దర్శనమిచ్చింది. ఇక ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాలతో ఈ చిన్నది ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.