Actress Anshu : ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు త్రినాధరావు నక్కిన మజాకా సినిమా ఈవెంట్లో మన్మధుడు ఫేమ్ అన్షు పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో మహిళా కమిషన్ దృష్టికి వెళ్లడంతో ట్విట్టర్ వేదికగా క్షమాపణలు తెలిపారు. అయినప్పటికీ వివాదం సద్దుమనగపోవటంతో అన్షు ఓ వీడియోను విడుదల చేస్తూ ఈ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.
దర్శకుడు త్రినాథరావు నక్కిన తనపై చేసిన కామెంట్స్ పై నటి అన్షు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసిన ఆమె.. త్రినాథరావు చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతున్నట్టు నాకు ఆలస్యంగా తెలిసిందని తెలిపారు. ఆయన ఎంత మంచివారో చెప్పేందుకే ఈ వీడియో రిలీజ్ చేస్తున్నానని.. నాతో ఎంతో స్నేహంగా ఉంటూ తన కుటుంబ సభ్యురాలిగానే భావిస్తారని తెలిపారు. ఆయన పై నాకు మంచి గౌరవం ఉందని.. టాలీవుడ్ లో నా సెకండ్ ఇన్నింగ్స్ కు ఇంతకంటే మంచి దర్శకుడు ఉండరేమో అనిపించింది అంటూ తెలిపారు. అంతేకాకుండా తాను రిలీజ్ చేసిన ఈ వీడియోతో ఈ వ్యాఖ్యలపై జరుగుతున్న డిబేట్స్ కు పుల్ స్టాప్ పెట్టాలని కోరారు. తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ.. మజాకా సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానన్నారు.
ఇక సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న మజాకా సినిమాను త్రినాథరావు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అన్షూ కీలక పాత్ర పోషించారు. ఆదివారం హైదరాబాద్లో టీజర్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా అన్షూ శరీరాకృతి గురించి త్రినాథరావు మాట్లాడిన మాటలు చర్చనీయంశంగా మారాయి. స్టేజ్ పై మాట్లాడుతూ మన్మధుడు సినిమా తర్వాత అన్షూ ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఆమె ఫారిన్ నుంచి వచ్చాక సన్నగా ఉందని.. ఇలా కాదమ్మా తెలుగు ప్రేక్షకులు ఇలా ఉంటే ఆదరించరు అంటూ చెప్పానని తెలిపారు. ఇక ఈ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరానికి తెరతీశాయి. మహిళా కమిషన్ దృష్టికి సైతం వెళ్ళాయి.
ALSO READ : ప్రభాస్ పెళ్లి.. ఇంత మోసం చేస్తావనుకోలేదు చరణ్ మావా.. ?
ఇక త్రినాధరావు వ్యాఖ్యలను సుమోటాగా స్వీకరించిన మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద.. ఆయనకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. దీంతో త్రినాధరావు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు. మహిళలకి, అన్షూగారికి క్షమాపణలు తెలుపుతున్నా అంటూ తెలిపారు. “అందరికీ నమస్కారం ముఖ్యంగా మహిళలకి, అన్షు గారికి, మరియు నా మాటలు వల్ల బాధపడ్డ ఆడవాళ్ళందరికీ నా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను, నా ఉద్దేశ్యం ఎవరిని బాధ కలిగించడం కాదు తెలిసి చేసినా తెలియకుండా చేసిన తప్పు తప్పే మీరందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చారు.
ఇక మజాకా చిత్రం ఫిబ్రవరి 21న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమాలో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. రీతు వర్మ కథానాయకగా కనిపిస్తుంది. రావు రమేష్, అన్షు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాజేష్ తండా, ఉమేష్ బన్సాల్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.