Varun Tej (Image Source Instagram)
మెగా కుటుంబం నుంచి మెగా ప్రిన్స్ గా ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు వరుణ్ తేజ్ కొణిదెల
Varun Tej (Image Source Instagram)
అవ్వడానికి నాగబాబు కొడుకే అయినా చిరంజీవి తన కొడుకులానే ఇండస్ట్రీకి ముకుంద సినిమాతో పరిచయం చేశాడు.
Varun Tej (Image Source Instagram)
ఆరడుగుల అందంతో మొదటి సినిమాతో ప్రేక్షకుల కళ్లలో పడ్డాడు వరుణ్ తేజ్. ఎంత నెపో కిడ్ గా వచ్చినా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి వరుణ్ చాలా కష్టపడ్డాడు.
Varun Tej (Image Source Instagram)
రొట్ట సినిమాలు కాకుండా విభిన్నమైన కథలను ఎంచుకున్నాడు. కంచె, ఫిదా, తొలిప్రేమ, వాల్మీకి, ఆపరేషన్ వాలెంటైన్ ఇలా ఎన్నో మంచికథల్లో నటించాడు.
Varun Tej (Image Source Instagram)
విజయాపజయాలను పక్కన పెట్టి వరుస సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు. ఇక గత కొన్నేళ్లుగా వరుణ్ కు మంచి హిట్ పడింది లేదు. గని, ఆపరేషన్ వాలెంటైన్, గాండీవధారి అర్జున లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని అందుకున్నాయి.
Varun Tej (Image Source Instagram)
2023 లో వరుణ్.. నటి లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తరువాత అయినా మెగా ప్రిన్స్ కు హిట్ పడుతుంది అనుకున్నారు. లావణ్యతో పెళ్లి తరువాత రిలీజైన సినిమా మట్కా. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.
Varun Tej (Image Source Instagram)
తాజాగా వరుణ్ కొత్త లుక్ లో కనిపించి కనువిందు చేశాడు. మట్కా కోసం జుట్టు పెంచిన వరుణ్.. దాన్ని చాలా స్టైలిష్ గా మలుచుకున్నాడు. బ్లాక్ కలర్ షర్ట్, మంచి హెయిర్ కట్ తో అదరగొట్టాడు.
Varun Tej (Image Source Instagram)
ఇకపోతే ప్రస్తుతం వరుణ్ మంచి కథలను వింటున్నట్లు సమాచారం. మరి ఈ ఏడాదిలోనైనా వరుణ్ కు లక్ కలిసి వస్తుందేమో చూడాలి.