AP Govt Housing Scheme: ప్రతి ఒక్కరికీ సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఉండడం సహజం. ఆ కల నెరవేర్చుకొనేందుకు పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం మధ్య తరగతి కుటుంబాల ఆదాయం కూడ అంతంత మాత్రమే. అందుకే అటువంటి వారి సొంతింటి కలను త్వరలో నెరవేరుస్తాం అంటోంది ప్రభుత్వం. ఇదొక గొప్ప నిర్ణయం అయినప్పటికీ, స్థలం మాత్రమే ప్రభుత్వం ఇస్తుందని కొన్ని ప్రకటనలు వచ్చాయి. తాజాగా ఇదే విషయానికి సంబంధించి మరో కీలక ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు.
ఏపీలో కూటమి ప్రభుత్వం పేదవారి సొంతింటి కలను నెరవేర్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం, త్వరలోనే ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే దీపం 2.o పథాకాన్ని విజయవంతంగా సాగిస్తుండగా, త్వరలోనే మహిళల ఫ్రీ బస్సు పథకానికి శ్రీకారం చుట్టనుంది. అలాగే రాష్ట్రంలో అధ్వాన్నంగా ఉన్న రహదారుల అభివృద్దికి చర్యలు తీసుకున్న ప్రభుత్వం, రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు సాధించేందుకు అడుగులు వేసి సక్సెస్ సాధించింది.
ఇలా ఓ వైపు పథకాలు అమలు చేస్తూ, నిరుద్యోగులకు ఉపాధికి కొదువ లేకుండ ముందస్తు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఈ సంధర్భంలో పేదవారి సొంతింటి కలను నెరవేర్చాలని సీఎం చంద్రబాబు నిర్ణయించింది. అందులో భాగంగా ఇల్లు లేని వారికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. అయితే స్థలాలు ఇస్తే ఇంటిని నిర్మించుకోలేని వారి పరిస్థితి ఏమిటని ప్రభుత్వం ఆలోచించింది. గత వైసీపీ పాలనలో స్థలాలు ఇచ్చి, గృహాలు నిర్మిస్తామని మాటిచ్చారు.
Also Read: TDP on Deputy CM post: డిప్యూటీ సీఎంగా లోకేష్? టీడీపీ రహస్య అజెండా ఇదేనా?
కానీ నిర్మించే స్థితి లేదని, ఎవరికి వారు నిర్మించుకోవాలని అధికారులు ప్రకటించారు. ఆ స్థలాలు ఇంకా అక్కడక్కడా అసలు నిర్మాణపనులకు నోచుకొక అలాగే ఉన్నాయి. అందుకే సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటి స్థలం మంజూరుతో పాటు, స్వయంగా ప్రభుత్వం నిర్మించి ఇస్తుందని మైదుకూరు పర్యటనలో చంద్రబాబు చెప్పారు. ఇదే అమలులోకి వస్తే, పేదవారి సొంతింటి కలను కూటమి ప్రభుత్వం నెరవేర్చినట్లే అంటున్నారు ఏపీ ప్రజలు.