Vedhika:అందాల ముద్దుగుమ్మ వేదిక గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన విజయదశమి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
వేదిక అందం, అభినయం చూసి కుర్రకారు ఫిదా అయ్యారు. ఈ సినిమా హిట్ అవ్వకపోయినా అమ్మడికి మంచి మార్కులే పడ్డాయి.
ఇక విజయదశమి తరువాత వేదిక నారా వారి అబ్బాయి నారారోహిత్ హీరోగా పరిచయమైన బాణం సినిమాలో నటించింది.
ఆ తరువాత చేసిన దగ్గరగా దూరంగా కూడా వేదికకు హిట్ అందించలేకపోయింది. దీంతో తెలుగుకు దూరమై మిగతా భాషలకు దగ్గరయింది.
ఇక మధ్య మధ్యలో సాంగ్స్ లోనూ.. క్యామియోలోనూ కనిపించినా ఫలితం దక్కలేదు.
అయితే చాలా గ్యాప్ తరువాత వేదికగా .. ఈ ఏడాది యక్షిణి అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
నిత్యం హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు కునుకు లేకుండా చేసే వేదిక.. తాజాగా బికినీ ట్రీట్ తో పిచ్చెక్కించింది.
బీచ్ ఒడ్డున బికినీలో ఇసుక తిన్నెలపై కూర్చొని చేత్తో బొమ్మలు గీస్తూ కనిపించింది.
వేదికను అలా చూసిన ఫ్యాన్స్.. ఆ ఫిగర్ భలే ఉందే.. నిజంగా యక్షిణి కూడా ఇంత అందంగా ఉండదేమో అని కామెంట్స్ పెడుతున్నారు.