Microsoft : మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలో నడిచే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్… ఎప్పటికప్పుడు కొత్త అప్ గ్రేడ్స్ ను సంతరించుకుంటుంది. ఇక ఇప్పటికి Windows 10 హావా నడుస్తున్నప్పటికీ అక్టోబర్ 2025నాటికి ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో యూజర్స్ ను Microsoft Windows 11కి అప్‌గ్రేడ్ చేయడానికి ఈ సంస్థ తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కాగా ఈ నేపథ్యంలో విండోస్ 11 ఉపయోగించే యూజర్స్ కు కొన్ని హెచ్చరికలు జారీ చేసింది.
ప్రపంచంలోనే ఎక్కువ కంప్యూటర్లలో వాడబడే ఆపరేటింగు సిస్టమ్ విండోస్. 1985 నవంబరు 20న మైక్రోసాఫ్ట్ అప్పటి మార్కెట్ డిమాండ్ కి అనుగుణంగా విండోస్ ను పరిచయం చేసింది. అనంతరం మైక్రోసాఫ్ట్ తరువాత ఆయా రంగాలు, పరిశ్రమలకు తగ్గటుగా విండోస్ లో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ప్రస్తుతానికి స్మార్ట్ ఫోన్లు వినియోగించే వాళ్ళు ఎక్కువగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను వినియోగించగా, కంపూటర్లు వాడే యూజర్స్ ఎక్కువగా విండోస్ ని ఉపయోగిస్తున్నారు. ఇక విండోస్ 11 మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన పన్నెండో ఆపరేటింగ్ సిస్టమ్. ఇంతకు ముందు విండోస్ 10తో సిస్టమ్స్ పనిచేసేవి. వీటికి ముందు విండోస్ 8.1 ఉండేది.
మైక్రోసాఫ్ట్ హెచ్చరికలు ఇవే –
మైక్రోసాఫ్ట్.. విండోస్ 11 ఉపయోగించే యూజర్స్ కు హెచ్చరికలు జారీ చేసింది. Windows 10 ముగింపు తేదీ దగ్గర పుడుతున్న నేపథ్యంలో Windows 11కు అప్ గ్రేడ్ అవుతున్నప్పటికీ సపోర్ట్ చేయలేని సిస్టమ్స్ లో ఉపయోగించటంతో సమస్యలు తప్పవని హెచ్చరించింది.
యూజర్స్ ఈ అప్ గ్రేడ్ కు సపోర్ట్ చేయని హార్డ్‌వేర్‌తో ఉన్న పరికరాలలో Windows 11ని అమలు చేస్తున్నారని.. మైక్రోసాఫ్ట్ అధికారికంగా మద్దతు లేని PCలలో Windows 11ని అమలు చేస్తున్నారని దీంతో ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. మైక్రోసాఫ్ట్ తన అధికార పేజీలో యూజర్స్ ను హెచ్చరిస్తూ.. ఆపరేటింగ్ సిస్టంకు అనుగుణంగా లేని హార్డ్వేర్ లో విండోస్ 11 అమలు చేయడంతో ఇబ్బందులు తప్పవని తెలిపింది. ఇలాంటి వినియోగదారులపై కచ్చితంగా నిరాకరణ ఉంటుందని తెలిపింది.
మద్దతు లేని పరికరాల్లో Windows 11ని ఇన్‌స్టాల్ చేస్తే ఇకపై Microsoft నుండి అప్‌డేట్‌లు రావని సైతం తెలిపింది. హార్డ్ వేర్స్ సైతం దెబ్బతింటాయని.. దీని వల్ల కలిగే నష్టాలు తయారీదారుల వారంటీ కింద కవర్ చేయలేమని సైతం తెలపింది.
“యూజర్స్ వాడుతున్న ఈ PC Windows 11 ను అమలు చేయడానికి సరిపోలదు. ఇంకా ఈ PC లో Windows 11 ను ఇన్‌స్టాల్ చేయడం సిఫారసు చేయలేదు. అందుకే అనుకూలత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ హెచ్చరికల అనతరం కూడా Windows 11ని సపోర్ట్ చేయని సిస్టమ్స్ లో ఇన్‌స్టాల్ చేస్తే.. PCకి ఇకపై మద్దతు ఉండదు. ఇక అప్‌డేట్‌లను తీసుకోటానికి అర్హత ఉండదు. అనుకూలత లేకపోవడం వల్ల PCకి జరిగే నష్టాలు సైతం వారంటీ కింద కవర్ చేయలేము..” అంటూ మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఇక Windows 11కి అనుకూలంగా ఉండేలా వినియోగదారులు కొత్త సిస్టమ్స్ కొనుగోలు చేయాలని లేదా హార్డ్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేయాలని Microsoft కోరింది.
ALSO READ : ఎయిర్ టెల్ బాటలోనే వొడాఫోన్… అదిరే అప్డేట్ తెచ్చేసిన టెలికాం!