BigTV English
Advertisement

OTT Movie : కళ్ళతో చూస్తే ఆత్మహత్య… ప్రపంచాన్ని తుడిచి పెట్టే మిస్టీరియస్ శక్తి… గ్రిప్పింగ్ థ్రిల్లర్… ఊహించని ట్విస్టులు

OTT Movie : కళ్ళతో చూస్తే ఆత్మహత్య… ప్రపంచాన్ని తుడిచి పెట్టే మిస్టీరియస్ శక్తి… గ్రిప్పింగ్ థ్రిల్లర్… ఊహించని ట్విస్టులు

OTT Movie : భూమిపై భారీ విపత్తులు జరిగే సన్నివేశాలతో వచ్చే సినిమాలను హారర్ ఫ్యాన్స్‌ ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు. చూస్తూ టెన్షన్ కూడా పడుతుంటారు. రియల్ గా ఇలా జరిగితే ఏంటి పరిస్థితి అని ఆలోచనలో కూడా పడుతుంటారు. కొంతమందే బతికి ప్రాణాలను కాపాడుకునే ఇలాంటి సినిమాలు చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తుంటాయి. ఇలాంటి మూవీ ఒకటి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ అందరినీ టెన్షన్ పెడుతోంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ 

‘Bird Box Barcelona’ 2023లో వచ్చిన స్పానిష్ అపోకలిప్టిక్ హారర్ థ్రిల్లర్ మూవీ. ఆలెక్స్ & డేవిడ్ అనే దర్శకులు దీనిని రూపొందించారు. ఇందులో మారియో కాసాస్ (సెబాస్టియన్), జార్జినా క్యాంప్‌బెల్ (క్లైర్), డియెగో కాల్వా, నైలా షుబర్త్ (అన్నా) మెయిన్ రోల్స్ లో నటించారు. 112 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 5.3/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

బార్సిలోనా సిటీలో ఒక విపత్తు జరిగిపోతుంటుంది. ఒక మిస్టీరియస్ అదృశ్య శక్తి వల్ల కళ్లు తెరిచి చూస్తే మనుషులు తమను తాము సూసైడ్ చేసుకుని చంపేసుకుంటూ ఉంటారు. సెబాస్టియన్ అనే వ్యక్తి ఈ విషయం గ్రహించి, తన 11 ఏళ్ల కూతురు అన్నాతో కలిసి కళ్లకు గంతలు కట్టి రోడ్లపై తిరుగుతూ సేఫ్ ప్లేస్ కోసం వెతుకుతాడు. మొదట అతడు ఒంటరిగా సర్వైవ్ అవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ మార్గంలో కొంత మంది గ్రూప్‌ జాయిన్ అవుతారు. వాళ్లు ఒక పర్వతం మీద సేఫ్ జోన్ కోసం జర్నీ చేస్తారు. మార్గం మధ్యలో అదృశ్య శక్తి అటాక్స్ ఎదుర్కొంటారు. సెబాస్టియన్ భార్య, ఫ్రెండ్స్ దీని వల్లే చనిపోయారు. ఇక్కడ ఒక కొత్త ట్విస్ట్ వస్తుంది.


Read Also : అడవిలో వేలాడే తల లేని శవం… తవ్వుతున్న కొద్దీ బయటపడే నేరాల చిట్టా… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

సీయర్స్ అనే వ్యక్తి ఆ అదృశ్య శక్తులను చూసి కూడా చావకుండా సర్వైవ్ అవుతాడు. దాన్ని దేవుడు పనిగా భావించి ఇతరుల కళ్లు ఓపెన్ చేయించే పనిలో ఉంటాడు. క్లైమాక్స్ వరకు ఊహించని మలుపులతో ఈ స్టోరీ ఉత్కంఠంగా సాగుతుంది. చివరికి సెబాస్టియన్ ఈ అటాక్స్ నుంచి తప్పించుకుంటాడా ? తన కూతుర్ని కాపాడుకుంటాడా ? ఆ అదృశ్య శక్తులు ఎక్కడినుంచి వచ్చాయి ? ఈ క్లైమాక్స్ ఎలా ఉంటుంది ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

 

Related News

Baramulla OTT : పట్టపగలే పిల్లలు అదృశ్యం… కుమార్తె రూమ్ లో కుక్క వాసన… ఇంటెన్స్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్

The Bengal Files: ఓటీటీకి వివాదస్పద చిత్రం.. ‘ది బెంగాల్‌ ఫైల్స్‌’, ఎక్కడ చూడాలంటే!

OTT Movie : దసరా ఉత్సవాలపై 40 నిమిషాల మూవీ…. ‘ప్రొద్దుటూరు దసరా’ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

OTT Movie : స్నేహితుడిని ఇంటికి ఆహ్వానిస్తే… ఒక్కొక్కరిని మట్టుబెడుతూ పని కానిచ్చే సైకో… గూస్ బంప్స్ తెప్పించే థ్రిల్లర్

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

K Ramp OTT : ఓటీటీ డేట్ ను లాక్ చేసుకున్న ‘కే ర్యాంప్’.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..?

OTT Movie : ఒంటిపై నూలు పోగు లేకుండా భగభగ మండే మంటల్లోకి పరుగు… ఇదెక్కడి దిక్కుమాలిన పని సామీ

Big Stories

×