Shraddha Das: టాలీవుడ్ ఇండస్ట్రీలో గుంటూరు టాకీస్ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమై అనంతరం తెలుగులో సిద్దు ఫ్రం శ్రీకాకుళం, ఆర్య 2, డార్లింగ్, డిక్టేటర్, నాగవల్లి వంటి తదితర సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు నటి శ్రద్ధాదాస్(Shraddha Das:). ఇలా ఈమె తెలుగులో ఎన్నో సినిమాలలో నటించిన ఏ ఒక్క సినిమాలో కూడా ప్రధాన పాత్రలో నటించలేదు. ఈమె సెకండ్ హీరోయిన్ గానే సినిమాలలో నటించినప్పటికీ తెలుగులో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో శ్రద్ధాదాస్ తెలుగు సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధాదాస్ అల్లు అర్జున్(Allu Arjun) గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్(Sukumar) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్య 2 (Aarya 2)సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో శ్రద్ధ దాస్ కూడా అల్లు అర్జున్ కు గర్ల్ ఫ్రెండ్ గా కొన్ని నిమిషాల పాటు కనిపించి సందడి చేశారు. అయితే ఈ సినిమా ద్వారా తన సినీ ప్రపంచమే మారిపోయిందని శ్రద్ధాదాస్ వెల్లడించారు అల్లుఅర్జున్ కు మలయాళ ఇండస్ట్రీలో ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అయితే నేను అక్కడికి వెళ్లినా నన్ను కూడా ఈజీగా గుర్తుపట్టారని శ్రద్ధ దాస్ తెలిపారు. ఇలా ఆర్య 2 సినిమా నా ప్రపంచం మొత్తం మార్చేసిందని వెల్లడించారు.
అల్లు అర్జున్ టాలీవుడ్ షారుక్ ఖాన్ అంటూ శ్రద్ధా దాస్ బన్నీని షారుఖ్ ఖాన్ తో పోల్చి మాట్లాడారు. అల్లు అర్జున్ కేవలం సౌత్ లో మాత్రమే కాదు బాంబే అలాగే ఇతర దేశాలలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ఈమె తెలిపారు.ఇలా అల్లు అర్జున్ గురించి శ్రద్ధాదాస్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో బన్నీ ఫాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే.
అట్లీ డైరెక్షన్ లో బిజీగా బన్నీ..
పుష్ప 2సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుత ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా 2027వ సంవత్సరంలో విడుదల కాబోతుందని ఈ సినిమాని ఫాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ప్రస్తుతం ముంబైలోనే సెటిల్ అయ్యారు.. సినిమాలో అల్లు అర్జున్ కు జోడిగా దీపికా పదుకొనేను, మృణాళ్ ఠాకూర్ నటించబోతున్నారు. అదే విధంగా జాన్వీ కపూర్, రష్మిక వంటి సెలెబ్రిటీలు కూడా ఈ సినిమాలో భాగం అయ్యారని తెలుస్తోంది.
Also Read: Jana Nayagan First Single: జననాయగన్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. థళపతి కచేరి అంటూ!