OTT Movie : భారతదేశంలో దసరా, సంక్రాంతి, దీపావళి వంటి పండగలు ఎంత గ్రాండ్ గా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఒక్కో పండగను ఒక్కో స్టేట్ లో తమ స్టైల్ లో భక్తి సంబరాలతో చేసుకుంటారు ప్రజలు. ఇక దసరా దేశవ్యాప్తంగా జనాలు జరుపుకునే అతిపెద్ద పండగ అన్న విషయం చెప్పక్కర్లేదు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఈ పండగకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతను దృశ్యం రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే… అదే ప్రయత్నం చేశారు డైరెక్టర్ మురళీకృష్ణ తుమ్మ. డాక్యుమెంటరీ రూపంలో ఆయన చేసిన ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ అనంతరం ఓటీటీలోకి అడుగు పెట్టింది. ఇంతకీ ఈ డాక్యుమెంటరీలో ఏముంది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
బాల్కనీ ఒరిజినల్స్ బ్యానర్ పై ప్రేమ్ కుమార్ వలపల నిర్మించిన డాక్యుమెంటరీ మూవీ ‘ప్రొద్దుటూరు దసరా’. 40 నిమిషాలు మాత్రమే ఉన్న ఈ డాక్యుమెంటరీలో ప్రొద్దుటూరులో జరిగే దసరా వైభవాన్ని సినిమా రూపంలో తెరకెక్కించారు. ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. అందుకే ఈ ప్రాంతాన్ని “రెండవ మైసూరు” అని కూడా అంటారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రొద్దుటూరులో ఉన్న వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవాలయం, అక్కడ జరిగే దసరా ఉత్సవాల వైభవాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే విజువల్ హిస్టరీ ఈ డాక్యుమెంటరీ. 1895 నుంచి స్టార్ట్ అయిన ఈ ఉత్సవాలు మైసూరు తర్వాత దేశంలో జరిగే అతి పెద్ద ఉత్సవాలుగా ప్రసిద్ధి చెందాయి.
ఈ డాక్యుమెంటరీలో ‘ప్రొద్దుటూరు దసరా’ చరిత్ర, 1890లో ఆలయ నిర్మాణం, ఆర్య వైశ్య సమాజం ఆచారాలు, 130 ఏళ్ల సంప్రదాయాలు, ఉత్సవ వైభవం: 9 రోజుల నవరాత్రులు, అమ్మవారి అలంకారాలు, 108 కలశాల ఊరేగింపు, భస్మాసురుడు, కోలాటం వంటివి చూపించారు. అలాగే ప్రజల భక్తి, సంతోషం, సంప్రదాయ డాన్స్‌లు, రంగవల్లి, భోజనాలు, లక్షల మంది భక్తుల రాక వంటి సాంస్కృతిక ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉన్నాయి. మహేష్ విట్టా నేరేషన్, లోకల్ ప్రజల స్టోరీలు, రాయలసీమ కల్చర్ ఇందులో హైలైట్. ఇవన్నీ కలగలిపి ఇదొక డాక్యుమెంటరీ అని అనిపించకుండా ఎంగేజింగ్‌గా, సినిమా లాగా తెరకెక్కించారు.
OTT Movie : IMDb లో 9.7 రేటింగ్… స్కూల్ పుస్తకాల్లో స్కామ్… ఈ తండ్రి గట్స్ కు దండం పెట్టాల్సిందే భయ్యా
అక్టోబర్ 31న ఈ షార్ట్ మూవీ థియేటర్లలోకి వచ్చి, ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ఇప్పుడు ETV win ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. నవంబర్ 7 నుంచి ఈ మూవీ ఈటీవి విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకా చూడకపోతే వెంటనే ఈ డాక్యుమెంటరీ మూవీపై ఓ లుక్కేయండి మరి.