BigTV English
Advertisement

The Bengal Files: ఓటీటీకి వివాదస్పద చిత్రం.. ‘ది బెంగాల్‌ ఫైల్స్‌’, ఎక్కడ చూడాలంటే!

The Bengal Files: ఓటీటీకి వివాదస్పద చిత్రం.. ‘ది బెంగాల్‌ ఫైల్స్‌’, ఎక్కడ చూడాలంటే!

The Bengal Files OTT: బాలీవుడ్‌ డైరెక్టర్‌ వివేక్‌ అగ్నీహోత్రి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లాక్‌ డౌన్‌ టైంలో ది కశ్మీర్‌ ఫైల్స్ చిత్రం విడుదల చేసి సంచలనంగా మారాడు. యాథార్థ సంఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కించడంలో వివేక్‌ అగ్నిహోత్రి దిట్ట. నిజ జీవితంలో సంచలనమైన క్రైం కథనాలే తన సినిమాలకు ప్రధాన బలం. అలా రూపుదిద్దుకున్న సినిమాలే తాష్కేంట్ ఫైల్స్‌, ది కశ్మీర్‌ ఫైల్స్‌. ఈ ఫ్రాంచైజ్‌లో వచ్చిన చివరి చిత్రమే ది బెంగాల్‌ ఫైల్స్‌. టెర్రరిస్టుల బ్యాక్‌ డ్రాప్‌లో తాష్కేంట్‌ ఫైల్స్‌ చిత్రాన్ని తెరకెక్కించారు.


ఇండో-పాక్‌ విభజన నేపథ్యం..

కశ్మీర్‌లోని బ్రాహ్మణ పండితులపై జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో ది కశ్మీర్‌ ఫైల్స్‌ తెరకెక్కింది. ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేయాలంటూ ఎన్నో వ్యతిరేకతలు వచ్చాయి. అయినా ఈ సినిమా థియేటర్లలో విడుదల చేసి సంచలనం సృష్టించాడు అగ్నిహోత్రి. ద బెంగాల్‌ ఫైల్స్‌ కోసం పొలిటిక్‌ పాయింట్‌ తీసుకున్నాడు. 1947లో ఇండియా-పాక్ విభజన సమయంలో జరిగిన రాజకీయ కుట్ర నేపథ్యంలో హిస్టారికల్‌ థ్రిల్లర్‌ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఎన్నో వివాదాల మధ్య గత సెప్టెంబర్‌ 5న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. రిలీజ్‌ కు ముందు ఈ చిత్రాన్ని నిలిపివేసేందుకు రాజకీయ కుట్ర జరిగింది.

రెండు నెలల తర్వాత ఓటీటీకి

వాటిన్నింటిని దాటి ఎట్టకేలకు ఈ మూవీ సెప్టెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ తర్వాత కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్దమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5 (Zee5)లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ రానుంది. దీనిపై తాజాగా సదరు సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చింది. నవంబర్‌ 21 నుంచి ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. అయితే ప్రస్తుతం కేవలం హిందీ భాషలోనే ఇది అందుబాటులోకి రానుంది. మిగతా భాషల్లో ఎప్పుడు వస్తుందనేది క్లారిటీ లేదు. కాగా హిందీతో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు అదే భాషలో ఓటీటీకి రానుంది. దీంతో థియేటర్లలో మిస్‌ అయిన వారు ఓటీటీలో ఈ సినిమా చూసి ఎంజాయ్‌ చేయండి.


కథేంటంటే

ద బెంగాల్‌ ఫైల్స్‌ మూవీ విషయానికి వస్తే.. 1947వ సంవత్సరంలో భారత్‌ -పాక్‌ విభజన ఎలా జరిగింది. ఆ విషయంలో గాంధీ, నెహ్రులు ఎలాంటి పాత్ర పోషించారు. హిందువులు, ముస్లింల మధ్య ఘర్షణ తీవ్రత ఏ స్థాయిలో ఉన్నాయో.. అసలు ఈ అనర్థాలన్నింటి వెనుకు ఉన్న కుట్ర ఏంటన్నది ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్టు చూపించాడు వివేక్‌ అగ్నీహోత్రి. భారత్‌ నుంచి పాకిస్తాన్‌ విడిపోయే సమయంలో గాంధీ, మహమ్ముద్‌ అలీ జిన్నాని ఇదంత వద్దని అంటారు. కానీ, జిన్నా మాత్రం ప్రత్యేకమైన ముస్లిం రాష్ట్రం కావాల్సిందే అని పట్టుబడతాడు. ఈ విషయంలో చర్చలు జరుగుతున్న సమయంలోనే జిన్నా మనుషులు అప్పటి దేశ రాజధాని కలకత్తాలో కలహాలు సృష్టించి మారణహోమం చేశారు. ఈ గొడవలో ఎంతోమంది ముస్లింలు, హిందువుల ప్రాణాలు కోల్పోయారు. చిన్న పిల్లలు, మహిళలని చూడకుండ వారిని దారుణంగా కాల్చి చంపారు. ఇలాంటి సమయంలో నెహ్రు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? మన దేశాన్ని పాలిస్తున్న బ్రిటిషర్లు ఏం చేశారు? ముస్లింలపై భారతీయులు ఎలా తిరుగుబాటు చేశారు? అనేది ద బెంగాల్‌ ఫైల్స్‌ స్టోరీ.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

Baramulla OTT : పట్టపగలే పిల్లలు అదృశ్యం… కుమార్తె రూమ్ లో కుక్క వాసన… ఇంటెన్స్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : కళ్ళతో చూస్తే ఆత్మహత్య… ప్రపంచాన్ని తుడిచి పెట్టే మిస్టీరియస్ శక్తి… గ్రిప్పింగ్ థ్రిల్లర్… ఊహించని ట్విస్టులు

OTT Movie : దసరా ఉత్సవాలపై 40 నిమిషాల మూవీ…. ‘ప్రొద్దుటూరు దసరా’ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

OTT Movie : స్నేహితుడిని ఇంటికి ఆహ్వానిస్తే… ఒక్కొక్కరిని మట్టుబెడుతూ పని కానిచ్చే సైకో… గూస్ బంప్స్ తెప్పించే థ్రిల్లర్

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

K Ramp OTT : ఓటీటీ డేట్ ను లాక్ చేసుకున్న ‘కే ర్యాంప్’.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..?

OTT Movie : ఒంటిపై నూలు పోగు లేకుండా భగభగ మండే మంటల్లోకి పరుగు… ఇదెక్కడి దిక్కుమాలిన పని సామీ

Big Stories

×