E-Paper
Advertisement

Vivo 16GB RAM Phone Discount: వివో 16GB ర్యామ్, ట్రిపుల్ కెమెరా గల పవర్‌ఫుల్ ఫోన్‌పై షాకింగ్ రూ.34,000 డిస్కౌంట్.. ఎలా పొందాలంటే..

Vivo 16GB RAM Phone Discount: వివో 16GB ర్యామ్, ట్రిపుల్ కెమెరా గల పవర్‌ఫుల్ ఫోన్‌పై షాకింగ్ రూ.34,000 డిస్కౌంట్.. ఎలా పొందాలంటే..
Advertisement

Vivo X100 Pro 5G Discount| వివో బ్రాండ్ సిరీస్‌లో టాప్ మోడల్ అయిన X100 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు చాలా తక్కువ ధరలో లభిస్తోంది. ఈ ఫోన్ మార్కెట్లోకి లాంచ్ ధర రూ.89,999తో ఎంట్రీ ఇచ్చింది. కానీ అమెజాన్ వెబ్‌సైట్‌లో ఇప్పుడు ఊహించని భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. అమెజాన్ ఆఫర్‌తో మీరు ఏకంగా రూ.34,000 కంటే ఎక్కువ మొత్తం ఆదా చేయవచ్చు. మీ ఫోన్‌ని మార్చుకోవడానికి ఈ ఆఫర్ బెస్ట్ డీల్. ఈ ఆఫర్‌ను అస్సలు మిస్ చేయకండి.

అదిరిపోయే ధర, ఆఫర్లు

అమెజాన్‌లో ఈ ఫోన్‌కు నేరుగా 38 శాతం డిస్కౌంట్ ఉంది. అంటే ధర రూ.59,999కి తగ్గుతుంది. దీంతో మీరు రూ.30,000 ఆదా చేయగలరు. ఇంకా బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. అమెజాన్ పే ICICI క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే మీకు అదనంగా రూ.3,000 క్యాష్‌బ్యాక్ వస్తుంది. మిగతా బ్యాంక్ క్రెడిట్ కార్డులతో EMI చెల్లింపులపై రూ.1,500 తగ్గింపు లభిస్తుంది. మొత్తంగా మీ సేవింగ్స్ రూ.34,500 మించిపోతాయి. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు, త్వరగా కొనుగోలు చేయండి.

సూపర్ డిస్‌ప్లే, శక్తివంతమైన పనితీరు

Advertisement

వివో X100 ప్రోలో 6.78 అంగుళాల పెద్ద కర్వ్డ్ AMOLED LTPO స్క్రీన్ ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా, సాఫీగా ఉంటుంది. గరిష్ఠంగా 3000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటంతో ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఫోన్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 9300 చిప్‌సెట్ ఉంది. దీంతో పాటు 16GB ర్యామ్ కూడా ఉంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్ అని పనులు సులభంగా జరుగుతాయి. కెమెరా పనితీరును మెరుగుపరచడానికి ప్రత్యేకమైన V3 ఇమేజింగ్ చిప్ కూడా ఉంది.

ప్రొఫెషనల్ లెవెల్ కెమెరా సిస్టమ్

వివో కంపెనీ జీస్‌తో కలిసి ఈ కెమెరాలను రూపొందించింది. ప్రధాన కెమెరా 50MP సోనీ సెన్సార్‌తో వస్తుంది. ఇది ఒక అంగుళం సైజులో ఉండడంతో ఎక్కువ బ్రైట్‌నెస్ ని కూడా క్యాప్చర్ చేస్తుంది. ఫోటోలు చాలా అందంగా వస్తాయి. 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP సూపర్ టెలిఫోటో కెమెరాలు కూడా ఉన్నాయి. టెలిఫోటో కెమెరా 4.3x ఆప్టికల్ జూమ్ ఇస్తుంది. మొత్తం 100x డిజిటల్ జూమ్ వరకు సాధ్యం. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. రాత్రి ఫోటోలు, పోర్ట్రెయిట్ షాట్స్ అద్భుతంగా వస్తాయి.

పెద్ద బ్యాటరీ, వేగవంతమైన ఛార్జింగ్

Advertisement

ఈ ఫోన్‌లో 5,400mAh పెద్ద బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా సులభంగా పనిచేస్తుంది. 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. కేవలం కొద్ది నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుంది. 50W వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌కు IP68 రేటింగ్ ఉంది. దీంతో దుమ్ము, నీళ్ల నుంచి ఫుల్ ప్రొటెక్షన్ లభిస్తుంది.

ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే

వివో X100 ప్రో 5G ఇప్పుడు టాప్ ఫీచర్లతో, భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. అద్భుతమైన కెమెరా, శక్తివంతమైన ప్రాసెసర్, వేగవంతమైన ఛార్జింగ్, పెద్ద బ్యాటరీ – అన్నీ ఒక్క ఫోన్‌లో ఉన్నాయి. ఈ ఆఫర్ కొద్ది రోజులే ఉంటుంది. అమెజాన్ వెబ్‌సైట్‌లో అన్ని వివరాలు తెలుసుకొని ఈ అద్భుతమైన డీల్‌ను వినియోగించుకోండి.

 

Also Read: ఛార్జర్లతో డ్యామేజ్ అవుతున్న ఫోన్లు.. నకిలీ ఛార్జర్లను ఇలా గుర్తించండి

 

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×