E-Paper
Advertisement

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ.. బిగ్ టీవీ సర్వేలో సంచలన ఫలితాలు

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ.. బిగ్ టీవీ సర్వేలో సంచలన ఫలితాలు

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్.. ఇప్పుడు టాక్‌ ఆఫ్ ది తెలంగాణ పాలిటిక్స్. ఈ ఎన్నిక ఇప్పుడు అధికార, విపక్ష పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకం. ఒక్కో పార్టీది ఒక్కో రీజన్. కానీ అన్ని పార్టీలకు గెలుపు కావాలి. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలో గెలిచి ప్రజలంతా తమ వైపే ఉన్నారు.. తమ పాలనపై ఎలాంటి వ్యతిరేకత లేదని చాటి చెప్పాలని చూస్తోంది. అందుకే ప్రచారంలో ఏ మాత్రం తగ్గడం లేదు.

ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే.. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడం ఆ పార్టీకి అత్యవసరం. ఈ ఎన్నికలో గెలిచి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని చాటి చెప్పాలని చూస్తోంది. దీనికి తోడు ఇప్పటికే పార్టీ భూస్థాపితమైపోయింది అనే విమర్శలు ఎదుర్కోంటోంది బీఆర్ఎస్.. అందుకే ఈ ఎన్నిక ఆ పార్టీకి డూ ఆర్ డై సిట్యూవేషన్ లాంటిది. ఇక బీజేపీ పరిస్థితి మరో రకంగా ఉంది. బీజేపీకి అంతో ఇంతో పవర్, క్యాడర్, క్యాలిబర్ ఉన్నది హైదరాబాద్‌లోనే. ఇప్పటికే ఆ పార్టీకి హైదరాబాద్‌లో ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే దూరమయ్యాడు. ఈ ఎన్నికల్లో గెలిచి పార్టీలో ఇంకా సత్తా ఉందని చాటి చెప్పాలనే ఆలోచన కమలనాథులది.

ఇలా ఒక్కో పార్టీది ఒక్కో ఆలోచన.. ఒక్కో స్ట్రాటజీ.. మరి నిజంగా జూబ్లీహిల్స్‌లో గెలిచేది ఎవరు? ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తున్నారు? ఎవరిని అందలం ఎక్కించాలనుకుంటున్నారు? ఎవరిని ఓడించాలనుకుంటున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు బిగ్‌టీవీ ఇంపాక్ట్ SURVEYS టీమ్‌ ప్రజల్లోకి వెళ్లింది. చివరి నిమిషం వరకూ గ్రౌండ్‌ లెవల్‌లో మారుతున్న సిచ్యుయేషన్‌ను పట్టుకోవడం కోసం.. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 8 మధ్యాహ్నం 2 గంటల వరకూ అభిప్రాయాలను సేకరించింది.. వాటన్నింటిని సమగ్రంగా విశ్లేషించి మీ ముందుకు తెచ్చింది.. అదే …. ఇంపాక్ట్ SURVEYS బై బిగ్‌టీవీ మూడ్ ఆఫ్ జూబ్లీహిల్స్.

2023 కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్.. 2023 తెలంగాణ అసెంబ్లీ .. 2024 ఆంధ్రా అసెంబ్లీతో పాటు సాధారణ ఎన్నికల్లో బిగ్‌టీవీ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఎంత ఎగ్జాక్ట్‌గా వచ్చాయో మీకు తెలిసిందే. ఇప్పుడే అదే టీమ్‌.. జూబ్లీహిల్స్‌ పల్స్‌ను మీ ముందుకు తెచ్చింది.

ఏ పార్టీ వైపు ఎంత మంది ఓటర్లు- బిగ్ టీవీ సర్వే

బోరబండ

  • కాంగ్రెస్ : 42.53 శాతం
  • బీఆర్ఎస్ : 52.30 శాతం
  • బీజేపీ : 4.60 శాతం
  • ఇతరులు : 0.60 శాతం

రహమత్ నగర్

  • కాంగ్రెస్ : 55.28 శాతం
  • బీఆర్ఎస్ : 42.68 శాతం
  • బీజేపీ : 1.63 శాతం
  • ఇతరులు : 0.40 శాతం

షేక్ పేట

  • కాంగ్రెస్ : 36.73 శాతం
  • బీఆర్ఎస్ : 56.61 శాతం
  • బీజేపీ : 3.64 శాతం
  • ఇతరులు : 0.3 శాతం

వెంగళరావు నగర్

  • కాంగ్రెస్ : 50.97 శాతం
  • బీఆర్ఎస్ : 42.72 శాతం
  • బీజేపీ : 4.85 శాతం
  • ఇతరులు : 1.50 శాతం

యూసఫ్ గూడ

  • కాంగ్రెస్ : 66.67 శాతం
  • బీఆర్ఎస్ : 27.78 శాతం
  • బీజేపీ : 3.33 శాతం
  • ఇతరులు : 2.20 శాతం

సోమాజిగూడ

  • కాంగ్రెస్ : 55.56 శాతం
  • బీఆర్ఎస్ : 29.24 శాతం
  • బీజేపీ : 11.70 శాతం
  • ఇతరులు : 3.50 శాతం

జూబ్లీహిల్స్

  • కాంగ్రెస్ : 48.60 శాతం
  • బీఆర్ఎస్ : 44.70 శాతం
  • బీజేపీ : 4.90 శాతం
  • ఇతరులు : 1.70 శాతం

ఎర్రగడ్డ

  • కాంగ్రెస్ : 47.50 శాతం
  • బీఆర్ఎస్ : 45 శాతం
  • బీజేపీ : 6.67 శాతం
  • ఇతరులు : 0.80 శాతం

జూబ్లీహిల్స్ ఓవరాల్‌ రిపోర్ట్ చూసేముందు.. డివిజన్‌ల వారీగా  పార్టీలకు అనుకూలంగా ప్రతికూలంగా ఉన్న అంశాల గురించి తెలుసుకుందాం.

బోరబండ

బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్న అంశాలు

  • బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి
  • బీఆర్ఎస్ హయాంలో పూర్తైన రోడ్లు, డ్రెయిన్‌లు
  • కొండ ప్రాంతంలో తాగునీటి సరఫరా కోసం చేసిన పనులు
  • ఎన్నికల సమయం కావడంతోనే రోడ్ల రిపేర్లు చేస్తున్నారనే ఆలోచన
  • మాగంటి గోపినాథ్ చేపట్టిన అభివృద్ధి పనులు, అతనికున్న మంచిపేరు
  • కాంగ్రెస్ సంక్షేమ పథకాల అమలు తీరులో లోపాలు
    గ్యాస్ సబ్సిడీ సరిగా రావడం లేదనే ఆరోపణలు

కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న అంశాలు

  • నవీన్‌ యాదవ్‌కు ఉన్న ఆదరణ
  • బొరబండ డివిజన్‌ ప్రజలతో నిత్యం టచ్‌లో ఉండటం
  • బొరబండ డివిజన్‌లో నిర్వహించిన అనేక సామాజిక కార్యక్రమాలు
  • కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉండటం
  • పీజేఆర్ చేసిన సేవా కార్యక్రమాలను ప్రజలు మర్చిపోకపోవడం
  • కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా జారీ చేసిన రేషన్ కార్డులు
  • ఓవరాల్‌గా బోరబండ డివిజన్‌లో BRS కు లీడ్ కనిపిస్తోంది.

ఎర్రగడ్డ

కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న అంశాలు

  • ఎర్రగడ్డలో నవీన్‌ యాదవ్‌కు ఉన్న మంచి ఇమేజ్ ఓపెన్‌గానే నవీన్‌ యాదవ్‌కు ఓటేస్తామని చెబుతున్న ప్రజలు
  • పేదలకు గతంలో నవీన్ చేసిన ఆర్థిక సాయాలు
    అనేక పండగల సమయంలో నవీన్ అందించిన ఆర్థిక సహకారం
  • పేదల ఇంట జరిగిన పెళ్లిళ్ల సమయంలో నవీన్ అందించిన సహకారం
  • నిత్యం డివిజన్‌లో జరిగే కార్యక్రమాలకు హాజరవడం
  • కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో ఉండటం
  • కాంగ్రెస్ నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తుందని నమ్మడం
  • కొత్త సంక్షేమ పథకాలను తీసుకోస్తారనే నమ్మకం
  • అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే పనులు సులభంగా జరుగుతాయని నమ్మడం

బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్న అంశాలు

  • మాగంటి గోపినాథ్ మరణంతో వచ్చిన సానుభూతి
    నీటి కనెక్షన్లు, రోడ్లు, విద్యుత్ సరఫరాకు బీఆర్ఎస్‌ చేసిన కృషి
  • బీఆర్ఎస్ హయాంలో అమలైన షాదీ ముబారక్‌
  • కేసీఆర్ నాయకత్వంపై ప్రజల్లో ఇప్పటికీ ఉన్న నమ్మకం
  • కాంగ్రెస్ ఇచ్చిన హమీలు పూర్తిస్థాయిలో అమలుకాకపోవడం
  • మహిళా ఓటర్లు బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉండటం
  • ఓవరాల్‌గా చూస్తే ఎర్రగడ్డలో పోటా పోటీగా పోరు సాగుతున్నప్పటికీ కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యం కనిపిస్తోంది.

షేక్ పేట్

బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్న అంశాలు

  • పార్టీకి స్థానిక లీడర్ల నుంచి ఉన్న బలమైన మద్దతు
    ఐటీ సెక్టార్‌లో జరిగిన అభివృద్ధి
  • ముస్లింలను ఆకట్టుకున్న షాదీ ముబారక్ స్కీమ్
  • మాగంటి గోపినాథ్‌ మరణంతో వచ్చిన సానుభూతి
  • బీఆర్ఎస్ హయాంలో జరిగిన రోడ్లు, డ్రైయినేజీల నిర్మాణం
  • బాకీ కార్డ్‌ పేరుతో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ప్రచారం

కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న అంశాలు

  • కాంగ్రెస్ అధికారంలో ఉండటం
  • కాంగ్రెస్ గెలిస్తే బస్తీల్లో అభివృద్ధి జరుగుతుందనే నమ్మకం
  • నవీన్ యాదవ్‌కు ఉన్న మంచిపేరు
  • నవ యువ నిర్మాణ్‌ చేపట్టిన కార్యక్రమాలు
  • కాంగ్రెస్‌కు AIMIM సపోర్ట్ చేయడం

ఓవరాల్‌గా చూస్తే.. షేక్‌పేటలో బీఆర్‌ఎస్‌కే ఆధిక్యంగా ఎక్కువగా ఉంది. ఎంఐఎం సపోర్ట్‌తో కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ పుంజుకుంటున్నట్లు కనిపిస్తున్నా.. రెండు పార్టీల మధ్య గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది.

రహమత్ నగర్

కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న అంశాలు

  • నవీన్ యాదవ్‌ అభ్యర్థిగా ఉండటం
  • నవీన్ యాదవ్ అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం
  • యువతలో పెద్ద ఫాలోయింగ్ ఉండటం
  • కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతో మరింత పెరిగిన మద్దతు
  • రీసెంట్‌గా రేషన్‌ కార్డులను అందజేయడం
  • కాంగ్రెస్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి సపోర్ట్ ఇవ్వడం
  • ప్రచారం ఉధృతంగా కొనసాగిస్తుండడం
  • అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి కాంగ్రెస్‌ బలోపేతం కావడం

బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్న అంశాలు

  • మాగంటి మరణంతో సానుభూతి
  • బీఆర్‌ఎస్ హయాంలో లబ్దిదారులు ఆ పార్టీ వైపు ఉండడం

ఓవరాల్‌గా చూస్తే.. రహమత్‌నగర్‌లో కాంగ్రెస్ లీడ్ స్పష్టంగా కనిపిస్తోంది.

వెంగళరావు నగర్‌

కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న అంశాలు

  • కాంగ్రెస్‌ అధికారంలో ఉండటంతో పెరిగిన మద్దతు
  • బీఆర్ఎస్ గెలిచిన పెద్దగా మార్పేమీ ఉండదనే అభిప్రాయం
  • కాంగ్రెస్‌ గెలిస్తే సంక్షేమ పథకాలు ఆగవనే నమ్మకం
  • డివిజన్‌లో నవీన్ యాదవ్‌కు ఉన్న చరిష్మా
  • యూత్‌లో నవీన్‌ యాదవ్‌కు ఉన్న ఫాలోయింగ్
  • నవీన్‌ యాదవ్‌కు ఉన్న మాస్ ఇమేజ్

బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్న అంశాలు

  • లోకల్‌గా నేతలు ఫుల్ యాక్టివ్‌గా ఉండటం
  • బీఆర్ఎస్‌ హయాంలో డివిజన్‌లో జరిగిన అభివృద్ధి
  • మాగంటి గోపినాథ్‌పై ఉన్న అభిమానం

ఓవరాల్‌గా చూస్తే.. వెంగళరావు నగర్‌ డిజివిజన్‌లో కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది.

యూసుఫ్‌గూడ

కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న అంశాలు

  • నవీన్‌ యాదవ్‌కు అత్యంత పట్టు ఉన్న డివిజన్
  • నవీన్‌ యాదవ్‌ ఈ డివిజన్‌కు చెందిన వ్యక్తే కావడం
  • డివిజన్‌లో నవీన్ యాదవ్‌ నిర్వహించిన అనేక కార్యక్రమాలు
  • హెల్త్ క్యాంప్‌లు, చదువు కోవడానికి ఆర్థిక సాయం చేయడం
  • నిత్యం డివిజన్‌లోని ప్రజలతో టచ్‌లో ఉండటం
  • డివిజన్‌లో కాంగ్రెస్ నేతల ముమ్మర ప్రచారం
  • MIM సపోర్ట్‌తో కాంగ్రెస్‌ వైపు ముస్లింలు మొగ్గుచూపుతుండడం
  • కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో ఉండటం
  • సాఫ్ట్‌వేర్, ప్రభుత్వ ఉద్యోగులు కూడా మద్దతు పలకడం

బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్న అంశాలు

  • మాగంటి సునీతపై సానుభూతి..
  • కేటీఆర్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుండడం
  • యూసఫ్‌గూడపై బీఆర్‌ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టి పోల్ మేనేజ్‌మెంట్ చేస్తుండడం

సోమాజిగూడ

కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న అంశాలు

  • అధికారంలో కాంగ్రెస్ ఉండడం
  • బైపోల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని నమ్మడం
  • బీఆర్‌ఎస్ గెలిపించినా ఉపయోగం ఉండకపోవచ్చంటున్న జనం
  • నవీన్ అందుబాటులో ఉంటాడంటున్న ఓటర్లు

బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్న అంశాలు

  • మాగంటికి ఉన్న ఫాలోవర్స్‌
  • మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసిన పనులు
  • మాగంటి మరణంతో వచ్చిన సానుభూతి

జూబ్లీహిల్స్‌లో ముస్లిం ఓటర్ల పల్స్

overall 1 lac to 1 lac 20 thousand

( As of Nov 8, 2PM)
INC – 50.9
BRS – 47.2
ఇతరులు – 1.9

ఇక ఓవరాల్‌గా చూసుకుంటే.. కాంగ్రెస్‌కు 48.6 శాతం మంది మద్దతు తెలుపుతుండగా.. బీఆర్ఎస్‌కు 44.7 శాతం మంది ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ఇక బీజేపీ 4.9 శాతం మంది మాత్రమే మద్దతు పలుకుతున్నారు. ఇక ఏ నిర్ణయం చెప్పలేము అని చెప్పిన వారు 1.8 శాతం మంది. సో.. ఓవరాల్‌గా చూసుకుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే హోరాహోరి పోరు జరుగుతుందని అర్థమవుతోంది.

కాంగ్రెస్‌కు అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు ఉన్న ఫాలోయింగ్‌ జూబ్లీహిల్స్‌లో అడ్వాంటేజ్ కానుంది. యూసుఫ్ గూడ, రహమత్‌నగర్, ఎర్రగడ్డల్లో నవీన్ ఇన్‌ఫ్లూయెన్స్‌ ఎక్కువగా ఉంది. ఇక్కడి ప్రజలతో నవీన్ నిత్యం టచ్‌లో ఉంటున్నాడు. అయితే షేక్‌పేట్‌లో బీఆర్‌ఎస్ నెట్‌వర్క్, లోకల్‌ నేతలు బలంగా ఉండడంతో ఆ పార్టీకి ఫేవర్‌గా ఉంది. బోరబండ, వెంగళ్‌రావునగర్ డివిజన్లలో బీఆర్ఎస్‌ పార్టీ క్యాడర్ కాస్త ఎక్కువగానే ఉంది. అయితే ఇతర డివిజన్లలో మాత్రం బీఆర్‌ఎస్‌ చాలా వీక్‌గా కనిపిస్తోంది.

కాంగ్రెస్‌కు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు

చాలా మంది ఓటర్లు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి.. అటువైపే మొగ్గుచూపాలనే ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని.. సంక్షేమ పథకాలు అందుతాయనేది వారి ఆలోచన. బీఆర్ఎస్‌ అభ్యర్థి గెలిచినా అధికారంలో లేరు కాబట్టి.. పెద్దగా జరిగే మార్పు ఏమీ ఉండదనేది జూబ్లీహిల్స్‌ ప్రజల మాటగా తెలుస్తోంది.
మాగంటి సునీతకు నాయకత్వ లక్షణాలు లేకపోవడం న్యూటల్ ఓటర్లను.. కొందరు బీఆర్‌ఎస్‌ సానుభూతిపరులను ఆలోచనలో పడేలా చేస్తోంది. నవీన్‌ యాదవ్‌ లోకల్‌ అనే ఫీలింగ్‌ చాలా మంది ఓటర్లలో ఉంది. మాగంటి గోపినాథ్‌ తర్వాత ఆస్థాయిలో నియోజకవర్గంపై క్లారిటీ.. పనులు చేసే సత్తా నవీన్‌ వద్దే ఉన్నాయనేది చాలా మంది ఆలోచన.

బీజేపీ మూడోస్థానానికే

యూసఫ్‌గూడ, రహమత్‌నగర్, ఎర్రగడ్డల్లో కాంగ్రెస్ లీడ్ లో ఉండగా, బోరబండ, షేక్‌పేట్‌లో బీఆర్ఎస్ బలంగా కనిపిస్తుంది. జూబ్లీహిల్స్‌లో ఎక్కడా బీజేపీ ప్రభావం కనిపించడంలేదని సర్వేలో స్పష్టమైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య 4 శాతం ఓట్ల తేడా ఉండనుందని సర్వేలో తేలింది. మరోసారి బీజేపీ మూడోస్థానానికే పరిమితం కానుందని బిగ్ టీవీ సర్వే తేల్చింది. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో పోల్‌ మేనేజ్మెంట్‌ కీలకం కానుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read: బీజేపీ ఎక్కడ పోటీ చేసినా.. అక్కడ ఓట్ చోరీ పక్కా..

Related News

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

Big Stories

×