IPL 2026: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కు ( IPL 2026 Tournament ) సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చేసింది. అందరూ ముందుగా ఊహించినట్లుగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన రిటెన్షన్ ప్రక్రియ ఈ నెలలో జరగనుంది. మరో ఏడు రోజుల్లోనే ఐపీఎల్ 2026 కు సంబంధించిన రిటెన్షన్ లిస్టును ఫైనల్ చేయాలని 10 ఫ్రాంచైజీలకు ఆదేశాలు వెళ్లాయి. ఇప్పటికే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 రిటెన్షన్ లిస్ట్ ను మొన్న రిలీజ్ చేశారు. ఇక నవంబర్ 15వ తేదీన తమ రిటెన్షన్ తో పాటు రిలీజ్ లిస్టును ప్రకటించాలని బీసీసీఐ నుంచి 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఆదేశాలు వెళ్లినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన పనులు చకచకా నడిపిస్తోంది బీసీసీఐ. వచ్చే సంవత్సరం మొదట్లోనే టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఉన్న నేపథ్యంలో అన్ని పనులు ఫినిష్ చేసుకొని, ఐపీఎల్ 2026 కు సిద్ధం కావాలని బీసీసీఐ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే నవంబర్ 15వ తేదీన రిటెన్షన్ లిస్టును రిలీజ్ చేయనుంది బీసీసీఐ. ఆ లోపు అన్ని జట్లు తమ రిటెన్షన్ లిస్టును ప్రకటించాల్సి ఉంటుంది. ఇక మిగిలిన ప్లేయర్లందరూ వేలంలోకి వెళ్లి పోతారు అన్నమాట. డిసెంబర్ 15వ తేదీన మినీ వేలం నిర్వహిస్తారు. ఈ సారి విదేశాల్లో కాకుండా ముంబైలోనే మినీ వేలం జరిగే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో తమ జట్టులో కీలక మార్పులు చేసేందుకు కావ్య మారన్ సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే చాలా మంది ప్లేయర్లను వదిలేసేందుకు సిద్ధమయ్యారు. నవంబర్ 15వ తేదీన రిటైన్ లిస్టును ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైన నేపథ్యంలో రూ. 23 కోట్ల ప్లేయర్ క్లాసెన్ తొలగించేందుకే సిద్ధమయ్యారు. ఆయన ప్రస్తుతం ఫామ్ లో లేడు. అందుకే అతన్ని వదిలేసి.. మినీ వేలంలో తక్కువ ధరకు కొనుగోలు చేయాలన్నది కావ్య మారన్ ప్లాన్. ఒకవేళ అతడు దక్కకపోతే, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంబంధించిన షిమ్రాన్ హెట్‌మైర్ ను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారట. అదృష్టం కలిసి వస్తే క్లాసెన్ తో పాటు షిమ్రాన్ హెట్ మైర్ ఇద్దరిని అదే రూ. 23 కోట్లకు కొనుగోలు చేసే ఛాన్స్ హైదరాబాద్ కు ఉంది. అందుకే హైదరాబాద్ ఓనర్ కావ్య పాప ఈ నిర్ణయం తీసుకుందట. మినీ వేలంలోకి క్లాసెన్ వస్తే, ఆ సమయంలో హైదరాబాద్ కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది. వాళ్లు చెప్పే ధరనే ఫైనల్ అవుతుంది. అందుకే కావ్య పాప ఇలా రూట్ మార్చారు. అలాగే మహమ్మద్ షమీ, ఇషాన్ కిషన్ లను రిటైన్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారట కావ్యపాప.
Also Read: Cm Revanth Reddy: హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ స్టేడియం..ఆస్ట్రేలియా తరహాలో బౌన్సీ పిచ్ లు
🚨 𝑹𝑬𝑷𝑶𝑹𝑻𝑺 🚨
Explosive wicketkeeper-batter Heinrich Klaasen could be released by SRH ahead of mini IPL auction. 👀
By doing so, they’d free up ₹23 crore in the purse — potentially allowing them to fill key gaps and even buy Klaasen back for around ₹15 crore. (Source:… pic.twitter.com/5pwJvkN5G8
— Sportskeeda (@Sportskeeda) November 4, 2025