Big tv Kissik Talks: బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న కార్యక్రమాలలో ఢీ డాన్స్ షో (Dhee Dance Show)కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది డాన్సర్లు ఇండస్ట్రీకి పరిచయం అవడంతో ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్లుగా మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఇలా డాన్స్ అంటే మక్కువతో ఢీ అవకాశాన్ని అందుకొని ఏకంగా కప్ కొట్టిన వారిలో రాజు ఒకరు. బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా మొదలైన ఈయన ప్రయాణం కంటెస్టెంట్ గా ఢీ 10 విజేతగా(Dhee 10 winner) నిలిచారు. ప్రస్తుతం రాజు ఢీ 20 సీజన్ లో పాల్గొని సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఢీ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రాజుకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఇకపోతే తాజాగా రాజు బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big tv Kissik Talks)కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన కెరియర్ గురించి అలాగే పలువురు మాస్టర్ల గురించి మాట్లాడారు. అయితే వర్ష ఇటీవల కాలంలో జరుగుతున్న లవ్ బ్రేకప్స్ గురించి ప్రశ్నలు వేయడంతో రాజు సైతం తన బ్రేకప్ గురించి వెల్లడించారు. ఒక అమ్మాయితో చాలా ప్రేమలో ఉన్నానని అయితే మాకు మెచ్యూరిటీ లేక ఆ అమ్మాయి నుంచి విడిపోయానని తెలిపారు.. ఇలా బ్రేకప్ తర్వాత తను నా పక్కన లేకపోవడంతో ఊపిరి కూడా తీసుకోలేకపోయానని, ఆ సమయంలో సూసైడ్(Suicide) చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని షాకింగ్ విషయాలను బయటపెట్టారు.
ఇక ఆ అమ్మాయిని మిస్ చేసుకొని నేను చాలా తప్పు చేశాను అయితే నేను తప్పు తెలుసుకునేలోపు ఆ అమ్మాయికి మరొకరితో పెళ్లి జరిగిందని, తన బ్రేకప్ గురించి తెలిపారు. ఒకవేళ నువ్వు బ్రేకప్ చెప్పిన అమ్మాయికి ఏదైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తావ్ అంటూ వర్ష అడగడంతో హ్యాపీగా, జాగ్రత్తగా ఉండు అంటూ రాజు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక చాలామంది బ్రేకప్ అవ్వగానే సూసైడ్ చేసుకుంటారు కానీ అది చాలా పెద్ద తప్పు అని తెలిపారు. మన జీవితంలో నుంచి వెళ్లిపోయిన అమ్మాయి గురించి కాకుండా మన జీవితంలోకి వచ్చిన వారి గురించి ఆలోచించాలని తెలిపారు. డార్లింగ్స్ లవ్ పోతే లైఫ్ పోయినట్టు కాదు కెరియర్ పై ఫోకస్ పెట్టి గోల్ రీచ్ అవ్వాలి అంటూ స్ఫూర్తి నిచ్చే మాటలను కూడా రాజు మాట్లాడారు.
ఇక రాజు ఢీ కార్యక్రమానికి రావడానికి గల కారణాలను కూడా ఈ సందర్భంగా తెలియజేశారు తనకు చదువు పెద్దగా రాదు డాన్స్ కూడా అసలు రాదు కానీ, పదో తరగతి చదువుతున్న సమయంలో ఒకసారి స్టేజ్ పై డాన్స్ చేశానని తెలిపారు. నా డాన్స్ చూసిన టీచర్లు బాగా పొగడారు. ఆ ప్రశంసలే నన్ను ఇటు వైపుకు నడిపించాయని రాజు తెలియజేశారు. ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చైతన్య మాస్టర్ తనని బాగా ఆదుకున్నారని ఆయన కారణంగానే తాను ఈ స్థాయిలో ఉన్నానని తన కెరియర్ గురించి రాజు ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read: Shraddha Das: అల్లు అర్జున్ టాలీవుడ్ షారుక్.. నా ప్రపంచమే మారిపోయిందన్న నటి!