Yoga Day photos Vizag
విశాఖపట్నం ఆర్కే బీచ్.. ఉదయం కాంతిలో ప్రకృతి అందాలతో జమ అయ్యిన యోగ శక్తి! 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమం ఏపీ ప్రజల గర్వకారణంగా నిలిచింది.
Yoga Day photos Vizag
ఈసారి వేదికగా మారిన విశాఖలో రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు నమోదవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతే కాకుండా, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా హాజరైన ఈ కార్యక్రమం, దేశవ్యాప్తంగా యోగా డేకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది.
Yoga Day photos Vizag
మూడు లక్షల 50 వేల మందికి పైగా యోగసాధకులు ఏకకాలంలో యోగా అభ్యాసం చేయడం ద్వారా గోల్డ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నమోదు చేయడం ఈ వేడుకకు ప్రత్యేక ప్రాశస్త్యం తెచ్చింది.
Yoga Day photos Vizag
విశాఖ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి వేలాది మంది యోగాభ్యాసకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Yoga Day photos Vizag
ఇంకా మరో గిన్నిస్ రికార్డు – ఏకంగా 22,000 మంది గిరిజన విద్యార్థులు ఒకే సమయంలో సూర్య నమస్కారాలు చేసిన ఘనతను సాధించారు.
Yoga Day photos Vizag
ఇది కేవలం యోగా విజయమే కాకుండా, గిరిజన విద్యార్థుల శారీరక-మానసిక అభివృద్ధికి ఆదర్శంగా నిలిచింది.
Yoga Day photos Vizag
ఈ మహా కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాత్రి ఆర్కే బీచ్ వద్ద జరిగిన కార్యక్రమం అనంతరం నేవీ గెస్ట్ హౌస్ (సింధియా)కు బయలుదేరారు.
Yoga Day photos Vizag
మధ్యాహ్నం 11:50 గంటలకు INS డేగా నుంచి విమాన మార్గంలో ఢిల్లీకి తిరిగి బయలుదేరనున్నారు. పెద్ద ఎత్తున ఏర్పాటైన బస్సులు, ప్రత్యేక రైళ్లు రిటర్న్ జర్నీ కోసం సిద్ధంగా ఉండడం చూసి, నిర్వాహకుల చొరవకు ప్రశంసలు వెల్లువెత్తాయి.
Yoga Day photos Vizag
మొత్తం మీద యోగా డే సంధర్భంగా విశాఖ తీరం యోగా సాధనలతో ఆకట్టుకుంది. ప్రధానంగా నేవీ సిబ్బంది చేసిన సాధన తీరు అందరినీ ఆకట్టుకుంది.