Tirumala Annadanam: తిరుమల లో టీటీడీ అన్నదానం ఎక్స్ లెంట్.. అసలు అమోఘం..అపూర్వం. ఇంతమందికి ఇంత నాణ్యమైన భోజన వసతి కల్పించడం అంతా దేవ దేవుని కృప అంటు వైసిపి కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వీడియోను విడుదల చేయడం అదే పార్టీకి చెందిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డికికు ఇబ్బంది కరంగా మారిందంటున్నారు. ఈ మధ్యనే అయన అన్నదాన సత్రంలో మంచి బోజనం పెట్టడంలో టీటీడీ విఫలం అవుతోందని భూమన విమర్శించారు. అది జరిగిన రోజుల వ్యవధిలోనే అంబటి రాంబాబు వ్యాఖలు ఇప్పుడు టీటీడీ సర్టిఫికెట్ లాగా మారడంతో భూమనకు ఇరకాటంగా మారిందంట.
తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్ టి రామరావు మానస పుత్రిక .1985 అయన చిన్న స్థాయిలో ప్రారంభించిన అన్నదానం ఇప్పుడు విస్తరించింది. ప్రతి రోజు తొంబై వేల నుంచి లక్షమంది పర్వ దినాలలో మూడు లక్షల మంది వరకు భోజనంతో పాటు అల్పహారం చేస్తున్నారు…దీనికితోడు భక్తులు అన్నదాన ట్రస్టుకు ఇస్తున్న విరాళాల వడ్డీతో నడుస్తుంది. ఏకంగా 2700 కోట్ల రూపాయల మేర అన్నదాన ట్రస్టులో నిధులు ఉండగా రోజు రోజుకు విరాళాలు పెరుగుతున్నాయి..
మరో వైపు భక్తులకు పర్వదినాలలో అయితే రెగ్యులర్ వంటకాలు కాకుండా అదనంగా స్వీట్స్ కూడా పంపిణీ చేస్తున్నారు. దీనికితోడు తరిగొండ వెంగమాంబ అన్నదాన కేంద్రంలోనే కాకుండా తిరుమలలో మరో ఐదు చోట్ల అన్నదానం నిర్వహిస్తారు. క్యూలైన్లలోని భక్తులకు సైతం నిరంతరం అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. దీంతో పాటు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము లో అన్నదానం చేస్తారు..వీటికితోడు స్వీమ్స్ ,బర్డ్స్ లో కూడా రోగులకు, వారి బందువులకు అన్నదానం జరుగుతుంటుంది.
అయితే 2019- 24 మధ్య కాలంలో అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో పాలకులు అన్నదానం స్థాయిని దిగజార్చారు. క్యూలైన్లలోని భక్తులకు అవసరం లేదనే స్థాయిలో అప్పట్లో పనిచేసిన అల్ ఇన్ వన్ అధికారి మాట్లాడారు. అయన మాటలకు పాపం పాలకమండలి సైతం తపాల్సివచ్చింది. మరో వైపు చివరి తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో వడ్డించే అన్నం క్వాలీటి లేక పోవడంతో అనేక విమర్శలు వచ్చాయి. దీనిపై ఎవరైన విమర్శలు చేస్తే మరోసటి రోజు వారి వద్దకు విజిలెన్స్ కాని పోలీసులు కాని వెళ్ళి .. భయపెట్టి వారితో తాము అలా మాట్లాడలేదనే ఓ వీడియో తీయించి రీలీజ్ చేయించే వారు..మాట వినక పోతే కేసులు కూడా పెట్టారు ..
ఎమర్జెన్సీ లాంటి వ్యవహారం అన్నదానం విషయంలో కూడా నడిచింది. రేషన్ బియ్యాన్ని మరపట్టించి మిల్లర్లు అన్నదానానికి సరఫరా చేసారనే విమర్శలు కూడా వచ్చాయి. గుడిలో మెల్లలాగా కరుణాకర్ రెడ్డి హాయంలో ఏనిమిది నెలల పాటు క్యూలైన్లలో అన్నప్రసాదాలు పంపిణీ చేసారు. అయితే క్వాలీటి అయితే మాత్రం మెరుగుపడలేదు. కూటమి అధికారంలోకి రాగానే ముందు అన్నప్రసాదాలపై దృష్టి కేంద్రీకరించింది. అన్నదానం పై అప్పటి ఇవో శ్యామల రావు,అదనపు ఇవో వెంకయ్య చౌదరి ప్రత్యేక శ్రద్ద తీసుకుని నాణ్యతను మెరుగు పర్చారు. దాంతో పాటు క్వాలీటి పై ఐవిఅర్ ఎస్ పోన్ కాల్ ద్వారా భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. వడ్డనలో కూడా భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నారు.
బీఅర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత అయన కూడా నిరంతరం అన్నదాన సత్రంలో వడ్డించే వాటిపై ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. ప్రత్యేకంగా అదనంగా వడను మెనులో చేర్పించారు. ప్రస్తుతం మెనూలో ఏనిమిది రకాల అహార పదార్థాలు వడ్డిస్తున్నారు. దానికితోడు అన్నదాన ట్రస్టుకు వచ్చే విరాళాల సంఖ్య కూడా పెరిగింది. తాజాగా 8 నెలల కాలంలో 1100 కోట్ల విరాళాలు రాగా అందులో సగం అన్నదానికి వచ్చాయి..పాలకుల పట్ల నమ్మకం వల్లనే ఇవి పెరగాయని తాజా పాలక మండలి అంటోంది.
గత వారం లో బీఅర్ నాయుడు టిటిడి చైర్మన్ గా ఏడాది పాలన ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో అన్నదాన వితరణ బ్రహ్మాండంగా సాగుతుందని భక్తులు కూడా పాజిటివ్ గా ఉన్నారని చెప్పారు. అయితే అదే సమయంలో మీడియా సమావేశం పెట్టిన మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అన్నదాన సత్రం నిర్వహాణలో అనేక లోపాలున్నాయని విమర్శలు గుప్పించారు. ఒక వడ అదనంగా చేర్చి చైర్మన్ బీఅర్ నాయుడు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేసారు..వంటశాల యంత్రాలు సరిగా లేవంటూ వాటి ఆధునీకరణ చేయాలని చెప్పుకొచ్చారు.
అయితే అప్పటికే వంటశాల అదునీకరణ పై దృష్టి సారించిన టీటీడీ పాలకవర్గం టాటా ట్రస్టు సాయంతో ఆధునీకరణ పనులు చేపట్టింది. దీంతో మరో వంట శాలను నిర్మించడానికి అవసరమయిన వందకోట్ల విరాళం ఇవ్వడానికి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సై అన్నట్లు సమాచారం. తాజాగా శ్రీవారి దర్శనం తర్వాత అద్వానీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ఈ ప్రతిపాదన తీసుకురాగా ఓకే అన్నట్లు తెలుస్తోంది..
అంతే టీటీడీని విమర్శిస్తు ప్రభుత్వాన్ని పలుచన చేయడానికి రంగం ఏ విషయాన్ని వదలని భూమన కరుణాకరరెడ్డికి తాజాగా అంబటి రాంబాబు టిటిడి అన్నదాన నిర్వహాణ పై ఇచ్చిన సర్టిఫికెట్ మాత్రం ఇబ్బంది కరంగా మారిందని సన్నిహిత వర్గాల సమాచారం. భక్తులు సైతం పార్టీలకు అతీతంగా అన్నదానం విషయంలో టీటీడీ మంచిగా నిర్వహిస్తుందని అంటున్న నేపథ్యంలో బంధు మిత్ర సమేతంగా తిరుమలకు వచ్చిన అంబటి రాంబాబు అన్నదానం నాణ్యతను, పాటిస్తున్న ప్రమాణాలను విపరీతంగా కొనియాడారు.
అంబటి రాంబాబు ఆ రేంజ్లో సర్టిఫికేట్ ఇవ్వడం భూమన కరుణాకరరెడ్డికి పెద్ద ఝలకే అంటున్నారు . పాపం భూమన అప్తమిత్రుడు అంబంటి ఇచ్చిన సర్టిఫికెట్‌తో టీటీడీ మాజీ చైర్మన్ అయోమయం పడ్డారంటట. చూడాలి మరి వైసీపీ పెద్దలు అంబటితో ఖండన ఇప్పిస్తారో లేక మరో ఇష్యూతో భూమన టీటీడీపై దాడి చేస్తారో.
Story by Apparao , Big Tv