BigTV English

Nayanatara Remuneration : చిరు మూవీ నుంచి నయనతార అవుట్… దీపికా పదుకొనె ను ఫాలో అవుతుందా?

Nayanatara Remuneration : చిరు మూవీ నుంచి నయనతార అవుట్… దీపికా పదుకొనె ను ఫాలో అవుతుందా?

Nayanatara Remuneration : ఇటు టాలీవుడ్ లోనూ, అటు కోలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుందుతున్న హీరోయిన్ ఎవరంటే కచ్చితంగా నయనతార పేరే వినిపిస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీలోని అందరు స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. ప్రస్తుతం భారీ చిత్రాల్లో, ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్, కాంబినేషన్ లో నటిస్తోంది. ఈ క్రమంలో నయనతార మెగాస్టార్ చిరంజీవి సరసన తొలిసారి నటిస్తుండటం టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ గా మారిన సంగతి తెలిసిందే.. అయితే ఈ మూవీ గురించి ఫిలింనగర్ లో ఇప్పుడు మరో వార్త చర్చనీయంశంగా మారింది. మొన్న దీపిక పదుకొనే లాగా నయనతార కూడా తన రెమ్యూనరేషన్ విషయంలో నో కాంప్రమైజ్ అని అన్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే..


చిరుకు జోడీగా నయన్ ..

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర షూటింగ్లో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుంది. దాదాపు షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయబోతుంది. అయితే ఈ మూవీ తర్వాత అనిల్ రావిపూడి తో చిరు సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. మెగా 157 పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవికి జోడిగా నయనతారను సెలెక్ట్ చేశారు. నయనతార కూడా సెట్స్ లో జాయిన్ అయ్యింది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లలో సాహు గరపాటి, సుష్మితా కొణిదెల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.. ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది.. వచ్చే ఏడాది ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని భారీగానే ప్లాన్ చేస్తున్నారని సమాచారం.


రెమ్యూనరేషన్లో నయన్ నో కాంప్రమైజ్..

మొన్న మద్య సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబినేషన్లో రాబోతున్న స్పిరిట్ మూవీ కోసం దీపిక పదుకొనేను హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. అయితే ఆమె రెమ్యూనరేషన్ ను పెంచడంతో పాటుగా కొన్ని కండిషన్లు పెట్టడం వల్ల ఆ సినిమా నుంచి తప్పించారు. ఇప్పుడు దాదాపు చిరు సినిమాకు అదే పరిస్థితి కనిపిస్తుంది. నయనతారా ప్రస్తుతం సినిమాకు రూ.10 కోట్లు ఛార్జ్ చేస్తున్న నయనతార మెగా 157కి ఎన్ని కోట్లు తీసుకుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే మూవీకి నయనతార అదనపు పారితోషికం కూడా అడిగిందంట. సినిమా షూటింగ్ వరకు ఒక రెమ్యునరేషన్ తీసుకుంటుండటంతో పాటు మూవీ ప్రమోషన్స్, ఈవెంట్స్, ఆడియో లాంచ్ ఈవెంట్లకు హాజరు కావాలంటే ఎక్ట్స్రా రెమ్యునరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుందని ఫిలిం నగర్లో టాక్.. నయనతార డిమాండ్ కు మేకర్స్ ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు సగం షూటింగ్ అయిన తర్వాత ఇలాంటి వార్తలకు వెనక్కి తగ్గితే భారీ నష్టం తప్పదు అని ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..

Also Read : పవన్ సినిమాకు గ్రహనం వీడింది. అఫీసియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది..

మెగా 157 షూటింగ్ అప్డేట్.. 

అనిల్ రావిపూడి ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ చిత్రం 2వ షెడ్యూల్ పూర్తైంది. ఈ షెడ్యూల్ ను ముస్సోరీ లో పూర్తి చేశారు. చిరంజీవి పెర్ఫామెన్స్ అదిరిపోయిందని, హై ఎనర్జీ సీన్లను, కీలక సీన్లను పూర్తి చేశారని టీమ్ తెలియజేసింది.. ప్రస్తుతం మూడవ షెడ్యూల్ షూటింగు జరుగుతుంది. అత్యంత వేగంగా షూటింగ్ పూర్తిచేసుకుని ప్రమోషన్స్ మొదలు పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారట.. అలాగే ఈ మూవీ ని వచ్చేయడానికి సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది..

Related News

Coolie vs War 2 : వార్‌కి ఇది సరిపోదు… మిగిలింది ఈ ఒక్క ఛాన్సే

Vadde Naveen: పదేళ్ల తర్వాత రీఎంట్రీ.. ఈ కానిస్టేబుల్ కష్టాలేందుకు నవీన్..

Bollywood: రక్షాబంధన్ వేళ కన్నీళ్లు పెట్టిస్తున్న సుశాంత్ సింగ్ సోదరి పోస్ట్!

Niharika Konidela: మెగా బ్రదర్స్ తో నిహారిక రాఖీ సెలబ్రేషన్స్.. ఆకట్టుకున్న ఫోటోలు!

Aamir Khan Brother: ఏడాది పాటు గదిలో బంధించాడు.. ఏవేవో మందులు ఇచ్చి చిత్రహింసలు పెట్టాడు.. ఆమిర్ ఖాన్ పై సోదరుడి ఆరోపణలు

Bad Girlz : స్టేజ్‌పైనే బట్టలు విప్పేసిన హీరోయిన్లు… వామ్మో అసలు వీళ్లకు ఈ థాట్ ఎలా వచ్చిందో ?

Big Stories

×