Nagarjuna: కొన్ని సినిమాలు విడుదలైన వెంటనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవు. కొంత టైం ఆ సినిమాలు తీసుకుంటాయి. అలా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉదాహరణలు చెప్పడానికి చాలా సినిమాలు ఉన్నాయి. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న శివ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. శివ సినిమాకు రిలీజ్ అయిన వెంటనే పాజిటివ్ టాక్ రాలేదు. సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు కూడా చాలామంది ప్రేక్షకులు సైలెంట్ గా సినిమా చూశారు.
ప్రేక్షకులు ఒక సినిమాను సైలెంట్ గా చూడటం అనేది అప్పుడు ఒక రిస్క్. ఎందుకంటే ఫైట్లు చేస్తున్నప్పుడు పాటలు వస్తున్నప్పుడు విపరీతంగా అప్పట్లో జనాలు అరుస్తూ సినిమా చూసేవాళ్ళు. కానీ శివ సినిమా విషయంలో అలా జరగలేదు. మొత్తానికి సినిమా అయిపోయిన తరువాత అర్థమైన విషయం ఏంటంటే జనాలు అందరూ కూడా ఒక షాక్ లో ఉండిపోయారు. వాళ్లు సినిమాను అంతలా ఓన్ చేసుకున్నారు అని తర్వాత కాలంలో అర్థమైంది.
శివ సినిమాకు సంబంధించి మొదట పాజిటివ్ టాక్ రాలేదు నాగర్జున చాలా టెన్షన్ గా ఉన్నారు. కొంతమేరకు నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. ఈ సినిమాలో కామెడీ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఆడవాళ్లకు నచ్చదు అని రకరకాల కామెంట్స్ నాగార్జున విన్నారు.
అయితే అక్కినేని నాగార్జున తో పాటు అక్కినేని నాగేశ్వరరావు కారులో వెళ్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు కార్ డ్రైవింగ్ చేస్తున్నారు. పంజాగుట్ట స్మశానం దగ్గరలో నాగార్జునతో మాట్లాడుతూ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయిపోతుంది. ఇది ఎక్కడికి వెళ్లి ఆగుతుందో నాకు తెలీదు అంటూ నాగార్జునతో చెప్పారట. అప్పుడు నాగార్జున కూడా ఆశ్చర్యపోయారు.
ఈ సినిమా ఎక్కడికి పోయి ఆగుతుందో అని ఏ ముహూర్తంలో అక్కినేని నాగేశ్వరరావు చెప్పారు కానీ ఇప్పటికే ఆ సినిమా గురించి మాట్లాడుతూనే ఉన్నాం. ఆ సినిమా ఎంత ప్రభావం చూపించిందో చాలామంది వివరించారు. ప్రజెంట్ జనరేషన్లో సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా శివ సినిమా తనపై ఎంత ప్రభావాన్ని చూపించిందో చెప్పాడు.
కేవలం సందీప్ మాత్రమే కాకుండా రాంగోపాల్ వర్మ స్కూల్ నుంచి వచ్చిన చాలామంది డైరెక్టర్లు ఇండస్ట్రీలో అద్భుతాలు సృష్టించారు. మొత్తానికి ఆయనకు ఏ విధంగా అనిపించిందో తెలియదు కానీ అతని మాటలు మాత్రం నేటికీ అక్షరాల నిజం అని అర్థమైంది. అయితే నాగేశ్వరరావు ఆ మాటలు చెప్పినట్లు స్వయంగా నాగార్జున నేడు జరిగిన శివ ఈవెంట్ లో చెప్పారు.
Also Read : RGV: శివ కథను 20 నిమిషాల్లో రాశా, అక్కడి నుంచి కాపీ చేసా