BigTV English
Advertisement

RGV: శివ కథను 20 నిమిషాల్లో రాశా, అక్కడి నుంచి కాపీ చేసా

RGV: శివ కథను 20 నిమిషాల్లో రాశా, అక్కడి నుంచి కాపీ చేసా

RGV: కొన్నిసార్లు కొన్ని అద్భుతాలు అలా జరిగిపోతూ ఉంటాయి. ఇంకొన్నిసార్లు ఒక అద్భుతం చేద్దామని ప్లాన్ చేసినా కూడా అది జరగదు. ముఖ్యంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎలాంటి దాఖలాలు కోకొలలు. ఇక రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమైన శివ సినిమా అనేది ఒక అద్భుతం. తెలుగు సినిమా రూపురేఖలు మార్చిన ఆ సినిమా అనేది అలా జరిగిపోయింది.


వాస్తవానికి ఒక కొత్త దర్శకుడు తెలుగు సినిమా మీద అంత ప్రభావాన్ని చూపిస్తాడు అని ఎవరు ఊహించి ఉండరు. ఎవరో ఎందుకు ఆ సినిమా చేస్తున్న టెక్నీషియన్స్ కూడా దానిని ఊహించలేదు. నాలుగు ఇంగ్లీషు ముక్కలు నేర్చుకొని వచ్చి నాగర్జున లైన్లో పడేసి ఏదో చేసుకుంటున్నాడు అనుకున్నారు. కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. రామ్ గోపాల్ వర్మ అనే ఒక సంచలన దర్శకుడు పేరు మారుమోగిపోయింది. అయితే ఆ సినిమా ఆలోచన ఎలా పుట్టిందో రాంగోపాల్ వర్మ చెప్పాడు.

20 నిమిషాల్లో రాశా 

శివ సినిమా అనే థాట్ మీకు ఎలా పుట్టింది అని రాంగోపాల్ వర్మను ఒక ప్రముఖ జర్నలిస్ట్ ప్రశ్నించారు. దానికి రామ్ గోపాల్ వర్మ చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్య పోవాల్సిందే. తాను అప్పటికే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే సినిమాను ఒక 50 సార్లు పైగా చూసారట.


అయితే మరోవైపు నాగర్జునతో సినిమా కాకుండా రాత్రి అనే ఒక సినిమా కథను పట్టుకొని పలుచోట్ల తిరుగుతూ ఉన్నాడు రాంగోపాల్ వర్మ. అయితే నాగార్జునకి ఒక కథ రాయొచ్చు కదా నువ్వు అని అక్కినేని వెంకట్ చెప్పడంతో ఆలోచనలో పడ్డాడు వర్మ.

రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా మరోసారి చూస్తున్న తరుణంలో రాంగోపాల్ వర్మ కి ఒక ఆలోచన తట్టింది. ఆ సినిమాలో బ్రూస్ లీ క్యాంటీన్లో గొడవ పడుతూ ఉంటాడు. ఆ ఫైట్స్ అన్ని కూడా ఆ క్యాంటీన్లో అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఈ సినిమా చూస్తున్నప్పుడు రాంగోపాల్ వర్మ ఆ క్యాంటీన్ అనే ప్లేస్ మార్చి కాలేజ్ బ్యాక్ డ్రా పెట్టాడు. అలా పెట్టి కేవలం 20 నిమిషాల్లో శివ సినిమాకు సంబంధించిన ఫస్ట్ డ్రాఫ్ట్ పూర్తి చేశాడు.

తన ఎక్స్పీరియన్స్

రామ్ గోపాల్ వర్మ విజయవాడ సిద్ధార్థ కాలేజీలో తాను చూసిన లైఫ్లోని కొన్ని సీన్స్ ను రాసుకొని శివ సినిమాను డిజైన్ చేశాడు. అవన్నీ డిజైన్ చేయడం వలన సినిమా కూడా ఒరిజినాలిటీకి చాలా దగ్గరగా అనిపిస్తుంది. ముఖ్యంగా శివ సినిమాకి సంబంధించిన సౌండ్ చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది. ఒకప్పుడు ఫైట్స్ చేస్తుంటే విలను పదిమంది ఎగిరిపోయేవాళ్ళు. కానీ శివ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా షటిల్ గా ఉంటాయి. విలన్ ను హీరో కొడుతున్నప్పుడు ఆ సౌండ్ కూడా రియలస్టిక్ గా అనిపిస్తుంది. అందుకే శివ ఒక ఫ్రెష్ ఫీల్ క్రియేట్ చేసింది.

Also Read: The Raja Saab : ఫస్ట్ సింగిల్ గురించి ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చిన ఎస్కేఎన్, మరో రెండు వారాల్లో

Related News

Shiva Remake: శివ రీమేక్ .. ఆ హీరోలకు అంత గట్స్ లేవన్న కింగ్..ఇలా అనేశాడేంటీ?

Nagarjuna: నాన్నగారు స్మశానం దగ్గర నాతో ఆ మాటను చెప్పారు

SSMB 29: ఎస్ఎస్ఎంబి 29 టైటిల్ ఇదేనా? సాంగ్ తో హింట్ ఇచ్చిన జక్కన్న!

The Raja Saab : ఫస్ట్ సింగిల్ గురించి ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చిన ఎస్కేఎన్, మరో రెండు వారాల్లో

Arasan : శింబు సినిమా షూటింగ్ మొదలయ్యేది అప్పుడే, క్లారిటీ ఇచ్చిన వెట్రి

SK24 : శివ కార్తికేయన్ సినిమా స్టార్ట్ అప్పుడే, నాని వదిలేసిన కథతోనే సిబి సినిమా

Shiva : శివ సీక్వెల్? ఆ ఇద్దరు హీరోలని రిజెక్ట్ చేసిన రామ్ గోపాల్ వర్మ

Big Stories

×