BigTV English
Advertisement

The Raja Saab : ఫస్ట్ సింగిల్ గురించి ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చిన ఎస్కేఎన్, మరో రెండు వారాల్లో

The Raja Saab : ఫస్ట్ సింగిల్ గురించి ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చిన ఎస్కేఎన్, మరో రెండు వారాల్లో

The Raja Saab : బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేసిన ప్రతి సినిమా కూడా సీరియస్ మోడ్ లోనే ఉంటుంది. ఆ సినిమాలన్నీ చూస్తుంటే కొంతమంది అభిమానులకి కొద్ది శాతం సంతృప్తి కలిగిన విషయం వాస్తవమే. కానీ ప్రభాస్ లో ఉన్న కామెడీ టైమింగ్ మిస్ అవుతున్నాము అని చాలామందికి అనిపించింది. దానిని కల్కి సినిమాలో కొద్దిగా బయటకు తీసే ప్రయత్నం చేశాడు నాగి. అయితే సినిమా సబ్జెక్ట్ హెవీగా ఉండటం వలన మైతిలాజికల్ విషయాలు ఆ సినిమాలో ఎక్కువ పాపులర్ అయి చాలామంది డిస్కషన్స్ కూడా మొదలుపెట్టారు.


ప్రభాస్ ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తే చూడాలి అని చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో, మారుతి ఈ లీగ్ లోకి వచ్చాడు. గతంలో మారుతి మాట్లాడుతూ నేను ప్రభాస్ తో సినిమా చేస్తే బుజ్జిగాడు డార్లింగ్ కైండ్ ఆఫ్ సినిమాలు చేస్తాను అని చెప్పాడు. ఇప్పుడు అదే మాదిరిగా రాజా సాబ్ సినిమాను కూడా డీల్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల అయిపోయింది. సినిమాపై అంచనాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి.

ఫస్ట్ సింగిల్ పై క్లారిటీ 

ఈ మధ్యకాలంలో వస్తున్న పెద్ద ప్రాజెక్టులకు సంబంధించి ముందు ఫస్ట్ సింగిల్స్ విడుదలవుతాయి. ట్రైలర్ అనేది సినిమా రిలీజ్ వారం రోజులు ముందు విడుదల చేస్తుంటారు. కానీ ఈ సినిమాకి సంబంధించి దాదాపు మూడు నెలల ముందే సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ అంతా కూడా ఫుల్ హ్యాపీ. ఎందుకంటే చాలా రోజులు తర్వాత ప్రభాస్ లోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ బయటకు తీశాడు మారుతి.


అయితే ఈ సినిమా విషయంలో ఎప్పుడూ వినిపించి ఒక కంప్లైంట్ ఇప్పటివరకు ఫస్ట్ సింగిల్ రాలేదు. ఒకవైపు ఫస్ట్ సింగిల్ తమన్ ఇవ్వకుండా లేట్ చేస్తున్నాడు అంటూ అతని మీద ట్రోలింగ్ కూడా నడిచింది. అయితే ఫస్ట్ సింగిల్ రాకపోవడానికి అసలైన కారణం బయటికి చెప్పాడు నిర్మాత ఎస్ కే ఎన్.

ఇంకా ఆ ఆలోచనలోనే ఉన్నాం 

ఫస్ట్ సింగిల్ తెలుగులో ఇచ్చేటప్పుడు మనం లిరిక్స్ తో పాటు ఇస్తాం. అలానే అక్కడక్కడ కొన్ని విజువల్స్ యాడ్ చేస్తాము. కానీ బాలీవుడ్ లో మాత్రం కంప్లీట్ వీడియో సాంగ్ బయటకు ఇస్తారు. నార్త్ సైడ్ మార్కెట్ అలా ఉంటుంది అని ఎస్ కే ఎన్ చెప్పాడు.

మనం ఫస్ట్ టైటిల్ సాంగ్ బయటకు వదులుదాము అని అనుకుంటున్నాము. కానీ నార్త్ మార్కెట్ వాళ్లు మాత్రం ఒక మెలోడీ సాంగ్ ఫస్ట్ బయటకు విడిచిపెడదాం అంటున్నారు. ఆ విషయంలో ఇంకా క్లారిటీ లేకుండా డిస్కషన్స్ జరుగుతున్నాయి.

ఈ విషయం గురించి నార్త్ మార్కెటింగ్ టీం తో చర్చలు జరిపిన తర్వాత ఒక అవగాహన వస్తుంది మరో రెండు వారాల్లో పాట గురించి క్లారిటీ వచ్చేస్తుంది అని ఎస్ కే ఎన్ అని క్లారిటీ ఇచ్చాడు.

Also Read: Arasan : శింబు సినిమా షూటింగ్ మొదలయ్యేది అప్పుడే, క్లారిటీ ఇచ్చిన వెట్రి

Related News

Shiva Remake: శివ రీమేక్ .. ఆ హీరోలకు అంత గట్స్ లేవన్న కింగ్..ఇలా అనేశాడేంటీ?

Nagarjuna: నాన్నగారు స్మశానం దగ్గర నాతో ఆ మాటను చెప్పారు

RGV: శివ కథను 20 నిమిషాల్లో రాశా, అక్కడి నుంచి కాపీ చేసా

SSMB 29: ఎస్ఎస్ఎంబి 29 టైటిల్ ఇదేనా? సాంగ్ తో హింట్ ఇచ్చిన జక్కన్న!

Arasan : శింబు సినిమా షూటింగ్ మొదలయ్యేది అప్పుడే, క్లారిటీ ఇచ్చిన వెట్రి

SK24 : శివ కార్తికేయన్ సినిమా స్టార్ట్ అప్పుడే, నాని వదిలేసిన కథతోనే సిబి సినిమా

Shiva : శివ సీక్వెల్? ఆ ఇద్దరు హీరోలని రిజెక్ట్ చేసిన రామ్ గోపాల్ వర్మ

Big Stories

×