BigTV English
Advertisement

Nizamabad: దందాలు మూసుకోండి.. బీజేపీ లీడర్లకు ధర్మపురి వార్నింగ్

Nizamabad: దందాలు మూసుకోండి..  బీజేపీ లీడర్లకు ధర్మపురి వార్నింగ్

Nizamabad:  నిజామాబాద్ జిల్లాలో జోరుగా పత్తాలాట నడుస్తుంటే ఉన్నట్లు ఉండి ఒక్క సారిగా అక్కడి ఎంపీ ధర్మపురి అరవింద్ బాగా సీరియస్‌గా రీయక్ట్ అయ్యారట. బీజేపీ నాయకులు పత్తాలాట నిర్వాహకులుగా కొనసాగితే వెంటనే అడ్డుకోండి అంటూ, డేట్, టైం, స్పాట్ పెట్టి మరి వార్నింగ్ ఇచ్చారట. దీంతో ఆ జిల్లాలో బీజేపీ పార్టీలో ఎంపీ అరవింద్ వాట్సాప్ గ్రూపులో పెట్టిన మేసేజ్ తో అలజడి రేపుతోంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా పరిషత్ గెలుస్తామని పదేపదే చెప్పుకుంటున్న ఆ ఎంపీ ఇప్పుడు ఈ పత్తాలాట వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలు అక్కడ పోటీ చేసే స్థానిక సంస్థల అభ్యర్థుల్లో గుబులు రేపుతోందంట .. అసలు ఆ పత్తాలాట వ్యవహారం ఏంటి ? ఎందుకు ఆ ఎంపీ సీరియస్ రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది.


నిజామాబాద్ జిల్లాలో చాలాకాలంగా పత్తాలాట

నిజామాబాద్ జిల్లాలో చాలాకాలంగా పత్తాలాట కొనసాగుతుంది. ఎంతలా అంటే పేకాట క్లబ్బులను మించిపోయి అధికారికంగా క్లబ్బులకు అనుమతి లేకున్నా పొలిటికల్ పార్టీ లీడర్లు ఆర్గనైజర్లుగా అవతారమెత్తి పేకాట ఆడిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు టాస్క్ ఫోర్స్ ఉన్నప్పుడు పేకాట కోసం దెగ్లూరు, ధర్మాబాద్ నాందేడ్ ప్రాంతాలకు వెళ్లే వారట. టాస్క్ ఫోర్స్ ఎత్తేయడంతో జిల్లాలో పేకాట స్థావరాలు మళ్ళీ మొదలయ్యాయంటున్నారు. మొన్నటి వరకు గోవా క్యాసినోలకు కు ఒక్కో ప్లేయర్‌ను తీసుకువెళ్తే 30 శాతం కమిషన్ దక్కించుకున్న ఆర్గనైజర్లు ప్రస్తుతం జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ఫామ్ హౌస్‌లలో పేకాట నడిపిస్తున్నారంట. టాస్క్ ఫోర్స్ లో పని చేసే కానిస్టేబుళ్లు పేకాట స్థావరాలపై చేస్తున్న రైడింగ్ సమాచారం లీక్ అవుతుండడంతో పేకాట అడ్డాలపై పోలీసులు దాడులు విఫలమవుతున్నాయనే టాక్ ఉంది.

ఫాం హౌస్‌లలో పేకాట నడిపించేస్తున్న నిర్వాహకులు

ఇప్పుడు సదరు నిర్వహాకులే మళ్ళీ పేకాటను గల్లీల నుంచి ఫామ్‌హౌస్‌లలోకి మార్చి … 3 ముక్కలు, 13 పత్తాలాట, రమ్మి లాంటి ఆటలు అడిస్తున్నారంట. ఇదంతా ఇలా ఉంటే ప్రతిపక్షాలుగా దూషించుకున్న పార్టీల వారిని జూదం ఆడించే విషయంలో కలుపుకుపోతున్నారు. పేకాట రుచికి మరిగి బాయ్ బాయ్ అంటూ పార్టీల కతీతంగా అందరూ ఎంచక్కా ఆడుకుంటున్నారంట. ఈ విషయంలో పేకాట ఆడిస్తున్న బిజెపి నాయకుల పేర్లు ఎంపీ అరవింద్ వద్దకు చేరాయట. దీంతో ఎంపీ అరవింద్ ఎప్పుడు లేని విధంగా చాలా సిరియస్ గా రీయక్ట్ అయ్యారంటున్నారు. ఇతర పార్టీల విషయం పక్కన బెడితే బీజేపీ మాజీ ప్రజా ప్రతినిధుల భర్తలు ఈ హైటెక్ పేకాట స్థావరాలు నడిపించడంపై ఎంపీ అరవింద్ డైరెక్ట్‌గా రియాక్ట్ అవడంతో పేకాట నడిపిస్తున్న బీజేపీ నాయకులు ఎవరనేది నిజామాబాద్ బీజేపీలో పెద్ద చర్చకు దారి తీస్తోంది.


పేకాట మానుకోవాలంటూ ధర్మపురి వార్నింగ్

బీజేపీలో నేతలు సహజంగా దేశం, ధర్మమని ఉపన్యాసాలు ఇస్తుంటారు. అలాంటి నాయకులు పేకాట ఆడించడం ఏంటని, అలా పేకాట ఆడిస్తున్న వారు ఎవరైనా ఉంటే వెంటనే మానుకోవాలని లేకపోతే వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ వాట్సాప్ గ్రూపులో మెసేజ్ పెట్టి వార్నింగ్ ఇచ్చారట. తన వద్దకు వచ్చిన పేర్లపై వెరిఫై చేస్తున్నా అంటూ పేకాట నిర్వాహకులను అరవింద్ స్ట్రైట్‌గా హెచ్చరించారట. ఆ క్రమంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బరిలో నిలుస్తున్న చాలామంది బిజెపి ఆశవాహులు, అభ్యర్థులు ఎంపీ అరవింద్ పెట్టిన మేసేజ్ తో షాక్ కి గురయ్యరట.

దందాలు మూసుకోవాలని హెచ్చరించిన ఎంపీ అరవింద్

ఇతర పార్టీలకు క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పుకునే మనమే తప్పు దోవలో పడితే ఏ ముఖం పెట్టుకొని మాట్లాడగలం అంటూ అందుకే పేకాట ఆడించే బిజెపి నాయకులు వెంటనే వారి దందాలు మూసుకోకపోతే రాజకీయంలో వారి భవిష్యత్తు శూన్యం అంటూ అరవింద్ చెప్పేశారట. దీంతో ఎక్కడ వచ్చే ఎన్నికల్లో అవకాశం లేకుండా పోతుందో అనే భయం లో పేకాట ఆడించే బీజేపీ నాయకులు తలలు పట్టుకుంటున్నారట. మరి ఎంపీ అరవింద్‌కు చేరిన లిస్టులో ఎంతమంది స్థానిక బీజేపీ నేతలు బుక్ అవుతారో చూడాలి.

Story by Apparao, Big Tv 

 

Related News

Kalvakuntla Kavitha: హరీష్‌ను టార్గెట్ చేస్తున్న కవిత

Amadalavalasa: ఆముదాలవలస లో వైసీపీ ముక్కలవుతుందా?

Tirumala Annadanam: అంబటి ప్రశంస.. భూమనకు ఝలక్

German Scientists: గబ్బిలాలను వేటాడి తింటున్న ఎలుకులు.. కోవిడ్ లాంటి మరో కొత్త వైరస్‌కు ఇదే నాందా?

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Poll Management: పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీల ఫోకస్

Thati Venkateswarlu: బీఆర్ఎస్ లో అగ్గి రాజుకుందా ?

Big Stories

×