Rishabh Pant : టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్పారు. దీంతో కొత్త కెప్టెన్ అనుభవం లేని జట్టు.. ఇంగ్లాండ్ వంటి కఠిన పరిస్తితుల్లో కుర్రాళ్లతో నిండిన భారత్ ఎలా ఆడుతుందోనని అందరినీ అనుమానాలు వ్యక్తం చేసారు. ఇక ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ టీమిండియా సిరిస్ తొలి రోజే అదరగొట్టింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్, కెప్టెన్ శుబ్ మన్ గిల్ ఇద్దరూ కూడా సెంచరీ సాధించారు. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా అద్భుతంగా ఆడాడు. మొత్తానికి ఇంగ్లాండ్ పర్యటనలో యువ భారత్ అద్భుతంగా అదురగొడుతోంది. ఇక రెండో రోజు కూడా బ్యాటర్లు ఇలాగే జోరుని కొనసాగించినట్టయితే మ్యాచ్ పై భారత్ పట్టు సాధించడం ఖాయం అనే చెప్పవచ్చు.
Also Read : MPL 2025 : బుల్డోజర్ల లాగా గుద్దుకున్నారు… ఇద్దరు రనౌట్ అయ్యేవాళ్ళు..కానీ చెత్త ఫీల్డింగ్ తో
అయితే ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ 102 బంతుల్లో 65 పరుగులు చేశాడు. అందులో 2 సిక్సులు కూడా కొట్టడం విశేషం. అయితే పంత్ ఇటీవల వైట్ బాల్ క్రికెట్ లో మాత్రం అంతగా రాణించలేదు. వైట్ బాల్ క్రికెట్ అంటే.. ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ కి కెప్టెన్ గా వ్యవహరించాడు. పంత్ కి లక్నో యాజమాన్యం భారీ ధర వెచ్చించారు. కానీ బడ్జెట్ కి తగినట్టుగా అంతగా ఆడలేదు. పంత్ పై సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్స్ చేశారు. తక్కువ ధర పలికినా 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన సెంచరీ సాధించడంతో పంత్ కి అంత అమౌంట్ దండుగా అని పేర్కొన్నారు. తాజాగా హాఫ్ సెంచరీ చేసి కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న పంత్ పై మళ్లీ ట్రోలింగ్స్ చేయడం గమనార్హం. వైట్ బాల్ తో మాత్రం చేతకాదు.. కానీ ఇంగ్లాండ్ లో రెడ్ బాల్ తో మాత్రం అండర్టేకర్ లా రెచ్చిపోతున్నాడంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. మొత్తానికి పంత్ పై రెచ్చిపోతున్నారు నెటిజన్లు.
అండర్సన్ -టెండూల్కర్ ట్రోఫీని నిన్న భారత్ ఘనంగా ప్రారంభించింది. 5 టెస్టుల సీరిస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో తొలిరోజు బ్యాట్ తో అదురగొట్టింది. 3 వికెట్లు కోల్పోయి 359 పరుగులతో భారీ స్కోర్ దిశగా సాగుతోంది. కెప్టెన్ శుబ్ మన్ గిల్ 127 పరుగులు చేసి క్రీజులోనే ఉన్నాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 101 పరుగులు చేశాడు. దీంతో ఇద్దరూ సెంచరీలు చేయడంతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. మరో ఓపెనర్ కే.ఎల్. రాహుల్ కూడా 42 పరుగులు సాధించాడు. చివర్లో శుబ్ మన్ తో కలిసి వైస్ కెప్టెన్ పంత్ 65 పరుగులు చేశాడు. ప్రస్తుతం పంత్ క్రీజులోనే ఉన్నాడు. 98 పరుగుల వద్ద రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న గిల్.. టంగ్ బౌలింగ్ లో ఫోర్ తో టెస్టుల్లో ఆరో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వోక్స్ బౌలింగ్ లో ఓ స్లాగ్ స్వీప్ ఫోర్ తో పంత్ హాఫ్ సెంచరీ చేశాడు. నాలుగో వికెట్ కి శుబ్ మన్ -పంత్ జోడీ 138 పరుగులు జోడించింది. ఇవాళ కూడా ఇలాగే కొనసాగితే.. టీమిండియా భారీ స్కోర్ సాధించే అవకాశం ఉంది.
— Out Of Context Cricket (@GemsOfCricket) June 20, 2025