E-Paper
Advertisement

Green peas Pulao: ఈ సీజన్లో దొరికే గ్రీన్ పీస్‌తో టేస్టీ పులావ్ రెసిపీ ఇదిగో

Green peas Pulao: ఈ సీజన్లో దొరికే గ్రీన్ పీస్‌తో టేస్టీ పులావ్ రెసిపీ ఇదిగో
Advertisement

గ్రీన్ పీస్ పలావ్ అనేది చాలా సులువుగా చేసే వంటకం. పచ్చి బఠానీలు చలికాలంలోనే అధికంగా లభిస్తాయి. వీటిని తినాల్సిన అవసరం ఉంది. వీటితో వండే గ్రీన్ పీస్ పులావ్ పిల్లలకూ, పెద్దలకూ అందరికీ ఇష్టమైన వంటకం. ఎక్కువ మసాలాలు అవసరం లేకుండా, తక్కువ సమయంలో సిద్ధమవుతుంది. లంచ్ బాక్స్‌కు, లేదా డిన్నర్‌కు కూడా ఇది మంచి ఎంపిక.

గ్రీన్ పీస్ పులావ్ రెసిపీకి కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్యం – ఒక కప్పు
పచ్చి బఠానీలు – అరకప్పు
ఉల్లిపాయ – ఒకటి
పచ్చిమిరపకాయలు – రెండు
అల్లం తురుము – అర స్పూను
జీలకర్ర – ఒక స్పూన్
దాల్చిన చెక్క – చిన్న ముక్క
లవంగాలు – రెండు
బిర్యానీ ఆకు – ఒకటి
నూనె – రెండు స్పూన్లు
ఉప్పు – తగినంత
నీరు – రెండు కప్పులు
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు

Advertisement

Also read: Paneer: పనీర్ ప్రతిరోజూ తింటే ఆరోగ్యానికి ప్రమాదమా?

గ్రీన్ పీస్ పులావ్ రెసిపీ
1. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి 20 నుంచి 30 నిమిషాలు నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల పలావ్ మెత్తగా, పొడవుగా తయారవుతుంది.
2. ముందుగా ప్రెషర్ కుక్కర్ లేదా లోతైన పాత్రను స్టౌవ్ మీద పెట్టండి.
3.అందులో నెయ్యి లేదా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసి చిటపటలాడే వరకు వేయించాలి.
4. తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి కొద్దిసేపు వేయించాలి. ఇలా చేయడం వల్ల మంచి వాసన వస్తుంది.
5. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు వేసి మెల్లగా కలుపుతూ లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
6. తరువాత అల్లం తరుగు లేదా అల్లం పేస్ట్ వేసి వేయించాలి.
7. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి కలపాలి. తరువాత పచ్చి బఠానీలు వేసి 2 నుంచి 3 నిమిషాలు వేయించాలి.
8. ఇప్పుడు ముందుగా నానబెట్టిన బియ్యాన్ని నీరు వడకట్టి పాత్రలో వేసి నెమ్మదిగా కలపాలి.
9. తరువాత ఉప్పు తగినంత వేసి మళ్లీ ఒకసారి కలపాలి.
10. ఇప్పుడు 2 కప్పుల నీరు పోసి కలిపి, కుక్కర్ మూత పెట్టాలి.
11. మీడియం మంటపై 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
12. గ్యాస్ ఆపిన తర్వాత కుక్కర్ ప్రెషర్ తగ్గే వరకు కొద్దిసేపు ఆగాలి.
13. మూత తీసిన తర్వాత పలావ్‌ను ఫోర్క్ లేదా చెంచాతో మెల్లగా కలపాలి. పైన తరిగిన కొత్తిమీర చల్లాలి. అంతే గ్రీన్ పీస్ పలావ్ సిద్ధం.

Advertisement

Also read: Leftover rice recipe: అన్నం మిగిలిపోతే ఇలా సాయంత్రం స్నాక్స్ వండేయండి, పకోడీల కన్నా టేస్టీ

ఈ పలావ్ ను పనీర్ కర్రీతో, చికెన్ గ్రేవీతో తింటే అదిరిపోతుంది. ఒక్కసారి దీన్ని తిని చూడండి మీకు బాగా నచ్చేస్తుంది. మటన్ కర్రీతో కూడా ఈ కాంబినేషన్ అదిరిపోతుంది.

Related News

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

Big Stories

Advertisement
×