E-Paper
Advertisement

Leftover rice recipe: అన్నం మిగిలిపోతే ఇలా సాయంత్రం స్నాక్స్ వండేయండి, పకోడీల కన్నా టేస్టీ

Leftover rice recipe: అన్నం మిగిలిపోతే ఇలా సాయంత్రం స్నాక్స్ వండేయండి, పకోడీల కన్నా టేస్టీ
Advertisement

ఇంట్లో వండిన అన్నం కొన్నిసార్లు మిగిలిపోతుంది. ఆ అన్నాన్ని మళ్లీ వేడి చేసి తినడం కొందరికి ఇష్టం ఉండదు. అలాంటి సమయంలో ఆ అన్నాన్ని వృథా చేయకుండా, కొత్తగా రుచికరమైన స్నాక్స్ గా మార్చుకోవచ్చు. మిగిలిపోయిన అన్నంతో చేసే ఈ రైస్ బాల్స్ లేదా పునుకులు చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే స్నాక్ ఇది. తక్కువ పదార్థాలతో, తక్కువ సమయంలో ఇవి రెడీ అయిపోతాయి.

పునుకులు రెసిపీకి కావాల్సిన పదార్థాలు:
మిగిలిపోయిన అన్నం – రెండు కప్పులు
ఉల్లి – ఒకటి
పచ్చిమిర్చి – రెండు
అల్లం తురుము- ఒక స్పూను
కరివేపాకులు – గుప్పెడు
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
ఉప్పు – తగినంత
కారం – అర టీ స్పూన్
జీలకర్ర – అర టీ స్పూన్
శనగపిండి – రెడు స్పూన్లు
బియ్యం పిండి – ఒక స్పూన్
నూనె – వేయించడానికి సరిపడా

Advertisement

Also read: Carrot Bobbatlu: క్యారెట్ హల్వా స్టఫ్ చేసిన బొబ్బట్లు రెసిపీ.. చూస్తేనే నోరూరిపోతుంది

మిగిలిపోయిన్ అన్నంతో స్నాక్స్ రెసిపీ
1. ముందుగా మిగిలిపోయిన అన్నాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. అన్నంలో ముద్దలు ఉంటే చేతితో లేదా స్పూన్‌తో బాగా నలిపి మెత్తగా చేయాలి.
2. ఇప్పుడు ఆ అన్నంలో సన్నగా తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి, తురిమిన అల్లం వేసుకోవాలి.
3. తర్వాత తరిగిన కరివేపాకు, కొత్తిమీర కూడా కలపాలి. ఇవన్నీ బాగా కలిసేలా చేతితో మిక్స్ చేయాలి.
4. తర్వాత రుచికి తగినంత ఉప్పు, కారంం పొడి, జీలకర్ర వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరోసారి బాగా కలపాలి.
5. ఇప్పుడు శనగపిండి, బియ్యం పిండి వేసుకోవాలి. అవసరమైతే ఒకటి లేదా రెండు స్పూన్లు నీళ్లు చల్లుకోవచ్చు.
6. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి.
7. స్టవ్ పై ఒక కళాయిపెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక, సిద్ధం చేసిన రైస్ బాల్స్‌ను నెమ్మదిగా నూనెలో వేసుకోవాలి.
8. మీడియం మంటపై రైస్ బాల్స్‌ లేదా పునుకులు వేయించాలి. బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
9. పునుకులు వేగావాటిని టిష్యూ పేపర్‌పై వేయాలి. ఇలా చేయడం వల్ల అదనపు నూనె తొలగిపోతుంది. అంటే టేస్టీ అన్నం పునుకులు రెడీ అయినట్టే.

Advertisement

Also read: Rice Water: గ్లోయింగ్ స్కిన్ కోసం రైస్ వాటర్ ట్రిక్.. రాత్రి పూట ఇలా వాడితే రెట్టింపు అందం

ఈ రైస్ బాల్స్‌ను వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటాయి. టమాటో సాస్, పుదీనా చట్నీ లేదా కొబ్బరి చట్నీతో ఇవి బావుంటాయి. సాయంత్రం టీ టైమ్ స్నాక్‌గా లేదా పిల్లల లంచ్ బాక్స్‌లో పెట్టడానికి కూడా ఇవి చక్కగా ఉంటాయి.

Related News

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big Stories

Advertisement
×