E-Paper
Advertisement

Tomato pulao: టేస్టీగా వేడి వేడి టమోటా పులావ్ తింటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగో

Tomato pulao: టేస్టీగా వేడి వేడి టమోటా పులావ్ తింటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగో
Advertisement

టమాటా పులావ్ తక్కువ సమయంలో సులభంగా తయారయ్యే రైస్ రెసిపీ. టమాటాల పులుపు, మసాలాల సువాసన పులావుకు ఎంతో రుచి వస్తుంది. మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం లేదా టిఫిన్‌గా కూడా దీనిని చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న సాధారణ పదార్థాలతోనే ఈ వంటకం తయారవుతుంది కాబట్టి ఎవరికైనా సులభంగా చేసేయచ్చు.

టమోటా పులావ్ రెసిపీకి కావలసిన పదార్థాలు
బియ్యం – ఒక కప్పు
టమాటాలు – మూడు
ఉల్లిపాయ – ఒకటి
పచ్చిమిర్చి – 2 లేదా 3
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూను
పసుపు – చిటికెడు
కారం పొడి – అర స్పూన్
గరం మసాలా – అర టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నూనె లేదా నెయ్యి – రెండు స్పూన్లు
బిర్యానీ ఆకు – రెండు
లవంగాలు – రెండు
యాలకులు – రెండు
దాల్చినచెక్క – చిన్న ముక్క
కొత్తిమీర తరుగు – గుప్పెడు
పుదీనా ఆకులు – గుప్పెడు
నీరు – సరిపడినంత

Advertisement

Also read: Treasure: ఇంటి పునాది తవ్వుతుండగా బయటపడిన బంగారం.. నిధి మాత్రం కాదు

టమోటా పులావ్ రెసిపీ
1. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల బియ్యం మెత్తగా ఉడుకుతుంది.
2. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముందుగానే కోసి సిద్ధంగా పెట్టుకుంటే వండేటప్పుడు సులభంగా ఉంటుంది.
3. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ లేదా పెద్ద పాత్ర తీసుకుని అందులో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయాలి.
4. నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, ఏలకులు, దాల్చినచెక్క వేసి కొద్దిసేపు వేయించాలి.
5. తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
6. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం వేయించాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
7. టమాటాలు పూర్తిగా మెత్తబడినప్పుడు పసుపు, కారం పొడి, ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలపాలి.
8. ఈ మసాలా మిశ్రమం నుంచి నూనె కొద్దిగా విడిపోతే మసాలా సిద్ధమైనట్టే.
9. తర్వాత నానబెట్టిన బియ్యాన్ని నీరు వంపేసి కుక్కర్‌లో వేసి మెల్లగా కలపాలి.
10. ఇప్పుడు రెండు కప్పుల నీరు పోసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టాలి. మధ్యస్థ మంటపై 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
11. విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కొద్దిసేపు ఆవిరి తగ్గే వరకు వేచి ఉండాలి.
12. మూత తీసిన తర్వాత పులావ్‌ను మెల్లగా కలపాలి. పైన కొత్తిమీర, పుదీనా చల్లి అలంకరించాలి.
13. ఇలా చేస్తే టమాటా పులావ్ సువాసనగా, రుచిగా ఉంటుంది. పులావ్‌ను వేడిగా వడ్డిస్తే ఇంకా బాగుంటుంది.

Advertisement

టమాటా పులావ్‌ను పెరుగు రైతా, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ ముక్కతో తింటే టేస్టీగా ఉంటుంది. ఏదైనా పచ్చడి తో వడ్డిస్తే రుచి మరింత పెరుగుతుంది. పిల్లలు తినేటప్పుడు కారం తక్కువగా వేసుకోవచ్చు. అలాగే కూరగాయలు ఇష్టమైతే క్యారెట్, బీన్స్, బఠానీ వంటి కూరగాయలు కూడా కలిపి చేసుకోవచ్చు.

Related News

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

Big Stories

Advertisement
×