E-Paper
Advertisement

Bun Dosa Recipe: దూది లాంటి మెత్తని బన్ దోశ.. బ్రేక్‌ఫాస్ట్‌లోకి దీనికి మించిన బెస్ట్ ఆప్షన్ లేదు!

Bun Dosa Recipe: దూది లాంటి మెత్తని బన్ దోశ.. బ్రేక్‌ఫాస్ట్‌లోకి దీనికి మించిన బెస్ట్ ఆప్షన్ లేదు!
Advertisement

Bun Dosa Recipe: ఎప్పుడూ చేసుకునే సాధారణ దోశలకు భిన్నంగా.. దూది లాంటి మెత్తదనంతో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఏదైనా రుచికరమైన వంటకం చేసుకోవాలి అనుకుంటే.. ఈ బన్ దోశను ఓసారి ట్రై చేసి చూడండి. కొబ్బరి, అటుకుల కాంబినేషన్‌తో చేసే ఈ దోశలు బ్రేక్‌ఫాస్ట్‌లోకి అద్భుతంగా ఉంటాయి. చాలా తక్కువ నూనెతో, హోటల్ స్టైల్ రుచిని ఇంట్లోనే ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

కావాల్సిన పదార్థాలు:

బియ్యం – రెండు కప్పులు
అటుకులు – ఒక కప్పు
పచ్చి కొబ్బరి తురుము – ఒక కప్పు
మెంతులు – అర స్పూను
పచ్చిమిర్చి – రెండు (సన్నని తరుగు)
పోపు గింజలు – ఒక స్పూను
కరివేపాకు- రెండు రెబ్బలు
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – కాల్చడానికి తగినంత

Advertisement

Also Read: సింపుల్ అండ్ టేస్టీ మినప్పప్పు మసాలా వడ రెసిపీ మీ కోసం!

తయారు చేసే విధానం:

ముందుగా ఒక గిన్నెలో బియ్యం, మెంతుల్ని పోసి తగినన్ని నీళ్లు పోసి కనీసం 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. బియ్యం బాగా నానిన తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్‌లో అటుకులు, పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి, అవసరమైతే కొద్దిగా నీళ్లు జతచేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మిశ్రమాలను కలిపి, మూత పెట్టి సుమారు 8 గంటల పాటు పులియనివ్వాలి. పిండి బాగా పొంగిన తర్వాత, ఒక చిన్న పాన్‌లో నూనె వేడి చేసి పోపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించి ఆ తాలింపును, రుచికి సరిపడా ఉప్పును పిండిలో బాగా కలుపుకోవాలి.

Advertisement

చివరగా స్టవ్ మీద పెనం పెట్టి వేడయ్యాక, రెండు గరిటెల పిండిని వేసి మూత పెట్టాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ పిండిని మామూలు దోశలా పెనం అంతా రుద్దకూడదు, మందంగా బన్‌లాగే ఉంచాలి. కొద్దిసేపటి తర్వాత మూత తీసి, కొంచెం నూనె వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన, మెత్తని బన్ దోశలు రెడీ అయిపోతాయి.

Also Read: పక్కా పల్లెటూరి రుచితో ఉలవచారు కోడికూర.. జొన్న రొట్టెల్లోకి అదిరిపోయే కాంబినేషన్!

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×