E-Paper
Advertisement

భారత్‌లో చాట్‌జీపీటీ వాడకం బీభత్సం.. నెలలో 100 కోట్లు, భారీ మైలురాయి అన్న శామ్ ఆల్ట్‌మన్

భారత్‌లో చాట్‌జీపీటీ వాడకం బీభత్సం.. నెలలో  100 కోట్లు, భారీ మైలురాయి అన్న శామ్ ఆల్ట్‌మన్
Advertisement

Sam Altman: ఆన్‌లైన్‌‌లో ఏఐ క్రియేటివిటీ రోజురోజుకూ పెరుగుతోంది. సోషల్ మీడియాలో ఇమేజ్‌‌లు, వీడియోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రకరకాల ఆలోచనలో ఓ ఊపు ఊపేస్తోంది. ఈ నేపథ్యంలో కీలక విషయాలు వెల్లడించారు ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్. భారతీయులు చాట్‌జిపిటి ఇమేజెస్ 2.0ని ఉపయోగించి ఒక బిలియన్‌కు పైగా చిత్రాలను రూపొందించారని అన్నారు.

భారత్‌లో చాట్‌జీపీటీ వాడకం బీభత్సం

Advertisement

ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ కీలక విషయాలు బయటపెట్టారు. తమ సంస్థ ఏఐ ఇమేజ్ జనరేషన్ టూల్ చాట్ జీపీటీ ఇమేజ్ 2.0ను భారతీయులు అధికంగా ప్రేమిస్తున్నారని అన్నారు. దీన్ని ఉపయోగించి భారతీయులు ఒక బిలియన్‌కు పైగా చిత్రాలను సృష్టించారని తెలిపారు. ఇది చూడటానికి అద్భుతంగా ఉందని ఎక్స్‌లో పోస్టు చేశారు ఆయన.

సరికొత్త ఇమేజ్ జనరేషన్ టూల్‌తో ఇప్పటివరకు 100 కోట్లకు పైగా చిత్రాలను సృష్టించారన్నారు. కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఏఐ క్రియేట్‌ చేసిన ఫోటోలు, వీడియోల హవా నడుస్తోంది. యానిమేటెడ్‌ స్టైల్ పోర్ట్రెయిట్‌లు, లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ఫోటోలు, ఫాంటసీ ఎడిట్స్, స్టైలిష్ అవతార్‌లను క్రియేట్ చేస్తున్నారు.

Advertisement

భారీ మైలురాయి అన్న శామ్ ఆల్ట్‌మన్

అందుకోసం ఏఐ టూల్స్‌ను వినియోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓపెన్ ఏఐ విడుదల చేసిన చాట్‌ జీపీటీ ఇమేజెస్‌ భారతీయులను వివరీతంగా ఆకట్టుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓపెన్ ఏఐ విడుదల చేసిన చాట్‌ జీపీటీ ఇమేజెస్‌ భారతీయులను వివరీతంగా ఆకట్టుకుంది.

పాత వెర్షన్‌తో పోలిస్తే ఎడిటింగ్, రిచ్ లేఅవుట్స్, వివిధ భాషల్లో వీలుండడం, టెక్స్ట్ చక్కగా రాయగల సామర్థ్యం ఉండడం దీని ప్రత్యేకత. అందుకే చాట్‌జీపీటీ ఇమేజెస్‌ 2.0 యూజర్లను ఆకట్టుకుంటోంది. కొత్త టూల్ వాస్తవికతను ప్రదర్శించడంపై ఆ కంపెనీ ఎక్కువగా దృష్టి సారించింది. ఏఐ రూపొందించిన కంటెంట్-అసలైన ఫోటోగ్రఫీ మధ్య తేడాను గుర్తించలేనంతగా ఉంది.

ALSO READ: ఇకపై ఇంట్లోనే కాదు.. గోడలపైనా మొక్కలు పెంచేయొచ్చు.. శాస్త్రవేత్తల క్రేజీ ఆవిష్కరణ!

వినియోగదారులు ChatGPT ద్వారా ఈ ఫీచర్‌ను యాక్సెస్ చేయవచ్చు. యానిమేషన్ కామిక్స్, 3D అవతార్‌లు, ప్రొఫెషనల్ హెడ్‌షాట్‌లతో సహా పలు విజువల్ స్టైల్స్ ఎంచుకోవచ్చు. ఇప్పటికే ఉన్న చిత్రాలను అప్‌లోడ్ చేయడానికి, వాటిని మెరుగుపరచడానికి లేదా మార్చడానికి ఈ టూల్ వినియోగదారులకు ఉపయోగపడుతోంది.  ChatGPT భారత్‌లో వారానికి 100 మిలియన్ల వినియోగదారులను దాటిందని, ప్రపంచవ్యాప్తంగా OpenAI అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా నిలిచిందన్నారు ఆల్ట్‌మాన్.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×