E-Paper
Advertisement

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై సర్కార్ కొత్త రూల్.. ఈ మూడు కీ పాయింట్స్ మస్ట్..?

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై సర్కార్ కొత్త రూల్.. ఈ మూడు కీ పాయింట్స్ మస్ట్..?
Advertisement

Double Bedrooms: స్వేచ్ఛ బ్యూరో: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. గత ప్రభుత్వంలో కేటాయించిన ఇళ్ల కు కొత్త నిబంధనను తీసుకురానున్నారు. ఇండిపెండెంట్ విధానంలో కట్టిన 2 బీహెచ్‌కే తో పాటు టవర్స్ రూపంలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేవలం 8 నుంచి 10 కి.మీ ల పరిధిలోని పేదలకు ఇవ్వాలని భావిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రభుత్వం స్టడీ చేస్తున్నది. వంద శాతం ఆయా ఇళ్లలో లబ్ధిదారులు ఉండాలంటే ఈ కొత్త రూల్ ను ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నట్లు సర్కార్ భావిస్తున్నది.

ఒక్క కోల్లూరులోనే..

గత ప్రభుత్వం కట్టిన, పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఎంత మంది ఉంటున్నారు? అనే దానిపై ప్రభుత్వం ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఎన్నికల ముందు గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 60 నుంచి 70 వేల మందికి ఇళ్లు ఇవ్వగా, దాదాపు 50 శాతం మంది ఆయా ఇళ్లలో లేనట్లు సర్కార్ సర్వేలో తేలింది. ఒక్క కోల్లూరులోనే 38 వేల మందికి ఇళ్లు కేటాయించగా, 16 వేల మంది లబ్ధిదారులు లేనట్లు సర్కార్ సర్వేలో తేలింది.ఇందులో కొందరు ఆయా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద జీవనోపాధి లభించక నివసించడం లేదు. సుమారు 25 నుంచి 30 కి.లో మీటర్లు వచ్చి జీవనోపాధి పొంది మళ్లీ తిరిగి వెళ్లలేక ఆయా ఇళ్లలో లబ్ధిదారులు లేనట్లు సర్కార్ స్టడీలో గుర్తించారు.

ఆరు నెలల క్రిందట నోటీసులు

Advertisement

ఇక 10 నుంచి 12 శాతం మందికి పారదర్శకంగా ఇళ్లు కేటాయించలేదు, అర్హతల్లో తప్పుడు వివరాలు సమర్పించి ఇళ్లు పొందినట్లు నిర్ధారించారు. ఇక కొంత మంది జీహెచ్ ఎంపీ ప్రైమ్ ఏరియాల్లో ఉంటూ, ఆయా డబుల్ బెడ్ రూమ్ లను రెంట్ లకు ఇచ్చారు. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని, వంద శాతం లబ్ధిదారులు ఉండేలా యాక్షన్ ప్లాన్ ను మొదలు పెట్టింది. నివసించని లబ్ధిదారులకు ప్రభుత్వం ఆరు నెలల క్రిందట నోటీసులు కూడా ఇచ్చింది. కొందరు తిరిగి రాగా, మరొ కొందరు సమయం కోరారు. మూడు నెలల క్రిందట కూడా ప్రభుత్వం రెండోసారి నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ, పూర్తి స్థాయిలో లబ్ధిదారులు ఆసక్తి చూపలేదు. దీంతోనే సర్కార్ కొత్త నిర్ణయానికి తెరలేపింది.

Also Read: సామాన్యుడికి గుడ్ న్యూస్.. ఏసీ లేకున్నా లైఫ్ లాంగ్ కూలింగ్.. పైగా జీరో కరెంట్ బిల్లు!

సంపూర్ణంగా పూర్తి చేయాలని..?

Advertisement

మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయి. ఇందులో బేస్ మెంట్ స్​థాయిలో కొన్ని, పిల్లర్స్ స్టేజ్ లో మరి కొన్ని నిలిచిపోయాయి. వీటిని పూర్తి చేయాలని ప్రభుత్వం పాత కాంట్రాక్టర్లపై ఒత్తిడి తేనున్నది. పైగా పాత రేట్లకే పూర్తి చేయాలని సూచించనున్నది. త్వరలో కామన్ మీటింగ్ ద్వారా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వనున్నది. రెండు నెలల్లోనే ఈ ప్రాసెస్ ను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్నది. ఇక అర్భన్ ప్రాంతాల్లోని జీ ప్లస్ 1, జీ ప్లస్ 3 టవర్స్ రూపంలో నిర్మించిన ఇళ్లల్లోనూ కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. వీటిని కూడా సంపూర్ణంగా నిర్మించి లబ్ధిదారులకు కేటాయించనున్నారు. ఇందుకోసం ఆయా టవర్స్ లోనే సొసైటీని ఫామ్ చేయనున్నారు. అంతేగాక ప్రభుత్వం, సొసైటీ ఆధ్వర్యంలో జాయింట్ అకౌంట్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. దీని వలన ఆయా టవర్స్ డెవలప్ మెంట్ వేగంగా జరుగుతుందనేది సర్కార్ ఆలోచన. డ్రికింగ్ వాటర్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బలోపేతం, విద్యుత్ సమస్యలు పరిష్​కారం కొరకు ఈ అకౌంట్ లోని నిధులు వినియోగించనున్నారు.

ఓపెన్ యాక్షన్ లో షాప్స్..

ఇక డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, టవర్స్ లో నిర్మించిన కమర్షియల్ షాప్ లను ఓపెన్ యాక్షన్ పద్ధతిలో కేటాయించనున్నారు. ఈ యాక్షన్ లో వచ్చిన అమౌంట్ ను జాయింట్ అకౌంట్లలో డిపాజిట్ చేయనున్నారు. వీటి ద్వారా ఆయా ఇళ్లు, సొసైటీ డెవలప్ కోసం వాడనున్నారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ఈ విధానంలో యాక్షన్ నిర్వహిస్తే సుమారు రూ. 130 కోట్లు డిపాజిట్ అయినట్లు ప్రభుత్వం చెప్తుంది. గతంలో అతి తక్కువ కు రెంట్ కు ఇచ్చి , సరైన విధానంలో వాటిని సేకరించడం లేదు. ఆయా షాపుల కేటాయింపుల్లోనూ దుర్వినియోగం జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో పాలసీనే మార్చేయాలని ప్లాన్ చేసింది. ఈ విధానాన్ని కొంత మంది శాసన సభ్యులు వ్యతిరేకించినప్పటికీ, పేద వర్గాల డెవలప్ కోసం ప్రభుత్వం ముందడుగు వేసింది. అవసరమైతే ఎంక్వైయిరీ కూడా వెనకాడబోమని సర్కార్ స్పష్టం చేసింది.

Also Read: ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్ధులకు ఇక పండగే.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్!

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×