E-Paper
Advertisement

Fridge: ఫ్రిజ్ రిపేర్ చేయించాలా లేక కొత్తది కొనాలా? ఈ 10 పాయింట్లు చూస్తే ఫుల్ క్లారిటీ

Fridge: ఫ్రిజ్ రిపేర్ చేయించాలా లేక కొత్తది కొనాలా? ఈ 10 పాయింట్లు చూస్తే ఫుల్ క్లారిటీ
Advertisement

Fridge: సాదారణంగా ఒక మంచి బ్రాండెడ్ ఫ్రిజ్ 10 నుంచి 15 ఏళ్ల పాటు పనిచేస్తుంది. కానీ.. 2026 నాటి ఏఐ టెక్నాలజీతో పోలిస్తే, పాత మోడల్స్ ఎక్కువ కరెంటును వాడుకోవడమే కాకుండా.. బట్టలు ఉతికినట్టు శబ్దం చేస్తూ చిరాకు తెప్పిస్తుంటాయి. మీ ఫ్రిజ్‌ను మార్చాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పే 10 ముఖ్యమైన సంకేతాలను ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త ఫ్రిజ్ తీసుకోవడం వల్ల కేవలం చల్లదనం మాత్రమే కాదు.. ఇది మీ కరెంటు బిల్లు కూడా సగానికి సగం తగ్గించే అవకాశం ఉంది.

మీ పాత ఫ్రిజ్‌ను మార్చాల్సిన సమయం వచ్చిందని చెప్పే 10 సంకేతాలు:
1. ఆహార పదార్థాలు పాడైపోవడం:
మీరు ఫ్రిజ్‌లో పెట్టిన పాలు ఒక రోజులోనే విరిగిపోతున్నాయా? కూరగాయలు రెండు రోజుల్లోనే వాడిపోతున్నాయా? అయితే మీ ఫ్రిజ్ తగినంత చల్లదనాన్ని అందించలేకపోతోందని అర్థం. ఇది ఫ్రిజ్ మోటార్ బలహీనపడటానికి సంకేతం.

Advertisement

2. ఫ్రిజ్ వెనక భాగం వేడెక్కడం:
ఫ్రిజ్ వెనక వైపు కొంచెం వెచ్చగా ఉండటం సాధారణం. కానీ.. ముట్టుకుంటే చెయ్యి కాలేంత వేడి పుడుతుంటే మాత్రం లోపల కంప్రెసర్ విపరీతంగా కష్టపడుతోందని అర్థం. ఇది ఏ క్షణమైనా ఆగిపోయే ప్రమాదం ఉంది.

3. వింత శబ్దాలు రావడం:
మీ ఫ్రిజ్ నిరంతరం గర్జిస్తున్నట్లు శబ్దం చేస్తోందా? లేదా అప్పుడప్పుడు పెద్దగా చప్పుడు వస్తోందా? పాత మోడల్స్ వయసు పెరిగేకొద్దీ కంప్రెసర్ అరిగిపోయి ఇలాంటి శబ్దాలు చేస్తాయి. 2026 నాటి ‘ఇన్వర్టర్ కంప్రెసర్’లు అసలు శబ్దమే చేయవు.

Advertisement

4. లోపల లేదా బయట నీటి చుక్కలు:
ఫ్రిజ్ తలుపులు సరిగ్గా క్లోజ్ అవ్వకపోవడం వల్ల లేదా లోపల టెంపరేచర్ సెన్సార్ పనిచేయకపోవడం వల్ల ఫ్రిజ్ ‘చెమట’ పట్టినట్లు నీటి చుక్కలు ఏర్పడతాయి. దీనివల్ల లోపల బూజు పట్టే అవకాశం ఉంది.

5. ఫ్రీజర్‌లో విపరీతంగా ఐస్:
పాత డైరెక్ట్ కూల్ ఫ్రిజ్‌లలో ఐస్ రావడం సహజం. కానీ.. అది గడ్డకట్టి తలుపులు కూడా తీయలేనంతగా మారుతుంటే.. డెఫ్రాస్ట్ సిస్టమ్ పాడైందని అర్థం.

6. 10 ఏళ్లు పైబడి వాడకం:
మీ ఫ్రిజ్ కొని పదేళ్లు దాటిందా? అయితే మార్చడానికి ఇదే సరైన సమయం. పాత టెక్నాలజీ వల్ల ఇవి కొత్త వాటి కంటే 40% ఎక్కువ కరెంట్ ను వాడుకుంటాయి.

7. కరెంటు బిల్లు పెరగడం:
మీ ఇంట్లో ఇతర వస్తువుల వాడకం పెరగకపోయినా.. కరెంటు బిల్లు మాత్రం భారీగా వస్తుంటే దానికి కారణం మీ పాత ఫ్రిజ్ కావచ్చు. ఎఫిషియన్సీ తగ్గినప్పుడు ఫ్రిజ్ ఎక్కువ సేపు రన్ అవుతూ కరెంటును లాగేస్తుంది.

Also Read: కొత్త వాషింగ్ మెషిన్ కొంటున్నారా? ఈ 3 బ్రాండ్ల మధ్య తేడాలు తెలియకుండా అస్సలు కొనకండి!

8. రిపేర్లు తరచుగా అవ్వడం:
ప్రతి ఆరు నెలలకు ఒకసారి మెకానిక్‌ను పిలవాల్సి వస్తుంటే.. ఆ రిపేర్ ఖర్చుల కంటే కొత్త ఫ్రిజ్ కొనడమే తెలివైన పని. ముఖ్యంగా కంప్రెసర్ మార్చాల్సి వస్తే కొత్తది కొనడమే బెస్ట్.

9. సరిగ్గా డోర్ పడకపోవడం :
ఫ్రిజ్ తలుపు చుట్టూ ఉండే రబ్బర్ వదులైతే లోపలి చల్లదనం బయటకు పోతుంది. దీని వల్ల కూలింగ్ సరిగ్గా ఉండదు. రబ్బర్ మార్చినా సెట్ అవ్వకపోతే మెషిన్ అలైన్‌మెంట్ పోయిందని అర్థం.

10. స్థలం సరిపోకపోవడం:
కుటుంబం పెరిగినప్పుడు పాత చిన్న ఫ్రిజ్ సరిపోదు. సామాన్లు ఎక్కువగా ఇరుకైన చోట పెడితే గాలి ఆడక కూలింగ్ తగ్గుతుంది. ఇప్పుడు మార్కెట్లో వస్తున్న 3-డోర్ లేదా సైడ్-బై-సైడ్ మోడల్స్ ఎక్కువ స్టోరేజ్ అందిస్తాయి.

Also Read: ఫ్రంట్ లోడ్ vs టాప్ లోడ్.. మీ ఇంటికి ఏది కరెక్ట్ ?

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×