E-Paper
Advertisement

Lavanya Tripathi:ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ పేరు బయటపెట్టిన లావణ్య త్రిపాఠి.. ఎక్కువ మెసేజ్లు చేసేది అతనే..!

Lavanya Tripathi:ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ పేరు బయటపెట్టిన లావణ్య త్రిపాఠి.. ఎక్కువ మెసేజ్లు చేసేది అతనే..!
Advertisement

Lavanya Tripathi:మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత.. సినిమాలకు కొద్దిగా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల తల్లి అయిన తర్వాత ఆమె ఎక్కువ సమయం కుటుంబంతో గడుపుతోంది. అందుకే కొంతకాలంగా సినిమాల నుంచి దూరంగా ఉంది. అయితే ఆమె నటించిన సతీ లీలావతి సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా లావణ్య అభిమానులతో మాట్లాడింది.

ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు లావణ్య సరదాగా సమాధానాలు ఇచ్చింది. ముఖ్యంగా ఒక ప్రశ్న అందరి దృష్టిని ఆకర్షించింది. “మెగా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో ఎక్కువగా ఎవరు మెసేజ్‌లు చేస్తారు?” అని అడగగా, లావణ్య నవ్వుతూ “సాయి ధరమ్ తేజ్ చాలా యాక్టివ్‌గా ఉంటారు” అని చెప్పింది. మెగా ఫ్యామిలీ గ్రూప్ లో ఎక్కువగా తనే మెసేజ్లు పెడుతూ ఉంటారు అని చెప్పుకొచ్చింది.

Advertisement

ఇక వెంటనే ఆ గ్రూప్ పేరేమిటి అని కూడా అడిగారు. దీనికి లావణ్య సమాధానం చెబుతూ..”ఆ గ్రూప్ పేరు చెప్పలేను. ఎందుకంటే నేను ఆ గ్రూప్‌ను క్రియేట్ చేయలేదు” అని చెప్పింది. దీంతో ఆ గ్రూప్ పేరు గురించి అభిమానుల్లో ఇంకా ఆసక్తి పెరిగింది.

అయితే ఆమె మరో చిన్న ఫ్యామిలీ గ్రూప్ గురించి వివరించింది. “We Are Obsessed” అనే గ్రూప్ ఉందని చెప్పింది. ఈ గ్రూప్‌లో తాను, తన భర్త వరుణ్ తేజ్, అలాగే నాగబాబు కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారని తెలిపింది. ఈ గ్రూప్‌ను తానే క్రియేట్ చేసినందువల్లే ఆ పేరు చెప్పగలిగానని వివరించింది.

Advertisement

లావణ్య చెప్పిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ గురించి ఆమె చెప్పిన చిన్న చిన్న వివరాలు అభిమానులను ఆకట్టుకున్నాయి.

ప్రస్తుతం లావణ్య తన కుటుంబ జీవితాన్ని ఆనందంగా గడుపుతోంది. అదే సమయంలో సినిమా ప్రమోషన్స్‌లో కూడా చురుకుగా పాల్గొంటోంది. త్వరలో ఆమె మళ్లీ సినిమాల్లో కనిపిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ALSO READ: Vijaya Nirmala: సీనియర్ నటి విజయనిర్మల మొదటి భర్త ఆయన కాదా..!

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×