E-Paper
Advertisement

2026 Honda Civic Type R: హోండా సివిక్ టైప్ ఆర్ 2026.. ఈ కార్‌లో జర్నీ చేస్తే దిగాలన్న ఫీలింగే రాదు మావా

2026 Honda Civic Type R: హోండా సివిక్ టైప్ ఆర్ 2026.. ఈ కార్‌లో జర్నీ చేస్తే దిగాలన్న ఫీలింగే రాదు మావా
Advertisement

2026 Honda Civic Type R: కారు అంటే అందరికీ ఒక అవసరం. కానీ కొందరికి అది కేవలం ప్రయాణ సాధనం కాదు, అది ప్యాషన్, అదొక ఫీలింగ్. అలాంటి కార్లలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నది హోండా సివిక్ టైప్ ఆర్. ఇప్పుడే హోండా తీసుకొచ్చిన కొత్త 2026 మోడల్ టైప్ ఆర్ అంటే మాటల్లో చెప్పలేనంత అద్భుతం. ఈ కారు స్పీడ్‌కి కొత్త నిర్వచనం ఇచ్చిందంటే అతిశయోక్తి కాదు. రోడ్డుపై దీన్ని చూసిన వారెవరికైనా ఇది సాధారణ కారు కాదని వెంటనే అర్థమవుతుంది. హోండా ఈసారి పర్‌ఫార్మెన్స్‌కి స్టైల్‌కి హద్దుల్లేవు అనేలా కొత్త మోడల్‌ని తయారు చేసింది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

డిజైన్ – రోడ్డుపై రేస్ ట్రాక్ ఫీలింగ్

Advertisement

ఈ కారు డిజైన్ చూస్తేనే ఇది సాధారణ కారు కాదని స్పష్టంగా తెలుస్తుంది. రోడ్డుపై నిలిపినా, నడిపినా ఇది ఒక స్పోర్ట్స్ కార్ ఫీల్‌ను ఇస్తుంది. డిజైన్ పరంగా హోండా ఈసారి మరింత ఆగ్రెసివ్ లుక్‌ను తీసుకువచ్చింది. విశాలమైన ముందు బంపర్, ఎయిర్ వెంట్స్, వెనుక భాగంలో ఉన్న పెద్ద సిగ్నేచర్ స్పాయిలర్ ఈ కార్‌కు ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి. రోడ్డు మీద ఇది ఒక రేస్ ట్రాక్ కార్ లాగా కనిపిస్తుంది.

2.0 లీటర్ టర్బో ఇంజిన్

Advertisement

ఇంజిన్ విషయానికి వస్తే, 2026 హోండా సివిక్ టైప్ ఆర్‌లో 2.0 లీటర్ టర్బో ఇంజిన్ ఉంది. ఇది దాదాపు 325 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుందని సమాచారం. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ ఇంజిన్‌ని సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు, దాంతో డ్రైవింగ్ అనుభవం మరింత రా, కంట్రోల్‌లో ఉంటుంది. హోండా మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను కొనసాగించడం వల్ల డ్రైవర్‌కు నిజమైన స్పోర్ట్స్ ఫీల్ వస్తుంది. ఈ కారు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.4 సెకన్లలో చేరుతుంది. టాప్ స్పీడ్ దాదాపు 275 కిలోమీటర్ల వరకు ఉందని అంచనా.

అద్భుతమైన హ్యాండ్లింగ్ సామర్థ్యం

డ్రైవింగ్ అనుభవం విషయానికి వస్తే, హోండా సివిక్ టైప్ ఆర్ ఎప్పటిలాగే అద్భుతమైన హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని చూపిస్తోంది. ఈ కారులో ముందు భాగంలో ప్రత్యేకమైన సస్పెన్షన్ వ్యవస్థ, వెనుక భాగంలో మెరుగైన అమరిక ఉండటంతో పాటు, మిషెలిన్ టైర్లు ఉండడం వల్ల రోడ్డు మీద కారు అద్భుతమైన గ్రిప్‌ను కలిగి ఉంటుంది. మలుపు ల్లోనూ వేగం తగ్గకుండానే సరిగ్గా బ్యాలెన్స్‌గా కదిలేలా దీని నిర్మాణం ఉంటుంది. హోండా స్పోర్ట్స్ కార్‌లకు ప్రత్యేకంగా అందించే ఫీచర్లను ఈ కారు కూడా నిలబెట్టింది.

యాపిల్ కార్ ప్లే వంటి సౌకర్యాలు

ఇంటీరియర్‌ విషయానికి వస్తే, హోండా ఈసారి కూడా తన నైపుణ్యాన్ని మరోసారి చాటింది. కారు లోపలి భాగం పూర్తిగా డ్రైవర్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. ఎరుపు రంగు అల్లికలతో ఆకర్షణీయంగా ఉన్న స్పోర్ట్ సీట్లు, డిజిటల్ మీటర్‌ బోర్డు, పెద్ద ఇన్ఫో టైన్‌మెంట్ స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే వంటి ఆధునిక సౌకర్యాలతో కారు లోపలి వాతావరణం మరింత రేస్ కారు తరహాలో ఉంటుంది. డ్రైవర్ కూర్చొన్న క్షణం నుంచే స్పీడ్ ఫీలింగ్ కలిగించే ఈ కేబిన్‌లో హోండా వేగం, సౌకర్యం రెండింటినీ సమానంగా ప్రదర్శించడంలో మరోసారి విజయాన్ని సాధించింది

ఇండియాలో ధర ఎంతంటే?

ఇండియాలోకి వస్తే, ప్రస్తుతం హోండా సివిక్ టైప్ ఆర్ అధికారికంగా లాంచ్ అవుతుందనే స్పష్టత లేదు. కానీ అంచనా ప్రకారం ఇది భారత్‌లోకి వచ్చినట్లయితే ధర రూ.50 లక్షల నుండి రూ.55 లక్షల వరకు ఉండవచ్చని సమాచారం. ఇది పూర్తిగా విదేశాల నుంచి నేరుగా దిగుమతి చేసే మోడల్‌గా వస్తే, ప్రభుత్వ పన్నులు, సుంకాల కారణంగా దీని ధర మరింతగా పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ఇది భారతీయ మార్కెట్‌లో సాధారణ వినియోగదారులకంటే, కార్లపై ఆసక్తి ఉన్నవారికి, స్పోర్ట్స్ కారు అభిమానులకు మాత్రమే సరిపడే వాహనంగా మారుతుంది

స్పోర్ట్స్ కార్ సెగ్మెంట్‌కి ప్రాణం పోసే అవకాశం

భారత పరిస్థితుల్లో ఈ కారు డ్రైవింగ్ ప్రాక్టికల్ కాకపోయినా, ఇది హోండా యొక్క ఇంజినీరింగ్ ప్రతిభను చూపించే ఒక ప్రదర్శన అని చెప్పాలి. సివిక్ టైప్ ఆర్ ఎల్లప్పుడూ కార్ ప్రపంచంలో ఒక ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంది. 2026 మోడల్ కూడా అదే ట్రడిషన్‌ను కొనసాగిస్తూ, మరింత ఆధునికత, వేగం, అందం కలిపిన రూపంలో వచ్చింది. 2026 హోండా సివిక్ టైప్ ఆర్ అనేది “అన్‌మాచ్‌డ్ స్పీడ్, హ్యాండ్లింగ్, స్టైల్” అనే మాటలకు తగిన నిర్వచనం. ఇది భారత మార్కెట్‌లోకి వస్తే, స్పోర్ట్స్ కార్ సెగ్మెంట్‌కి కొత్త ప్రాణం పోసే అవకాశం ఉంది.

Related News

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

Big Stories

Advertisement
×