E-Paper
Advertisement

ఏసీ కొనలేకపోతున్నారా? సింగిల్ రూమ్ కోసం బెస్ట్ కూలర్లు..

ఏసీ కొనలేకపోతున్నారా? సింగిల్ రూమ్ కోసం బెస్ట్ కూలర్లు..
Advertisement

Best personal air cooler: వేసవి కాలంలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. పెద్ద హాల్స్ లేదా ఇళ్ల సంగతి పక్కన పెడితే.. చిన్న బెడ్‌రూమ్‌లు, స్టడీ రూమ్‌లు లేదా ఆఫీస్ క్యాబిన్‌లలో ఉక్కపోత భరించడం చాలా కష్టంగా మారుతుంది. అలాంటి చోట్ల పెద్ద కూలర్లు పెడితే స్థలం సరిపోదు అలాగని ఏసీలు కొనడం అందరికీ సాధ్యం కాదు. ఈ సమస్యకు చక్కని పరిష్కారమే పర్సనల్ ఎయిర్ కూలర్లు. తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తూ, తక్కువ కరెంట్ బిల్లుతో మీ వ్యక్తిగత స్థలాన్ని కూల్‌గా మార్చే 3 బెస్ట్ పర్సనల్ కూలర్ల వివరాలు, వాటి ధరలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బెస్ట్ పర్సనల్ కూలర్లు:

Advertisement

1.సింఫనీ డైట్ 3ఐ పర్సనల్ టవర్ కూలర్:
పర్సనల్ కూలర్లలో బెస్ట్ మోడల్ సింఫనీ డైట్ 3ఐ (Symphony Diet 12T/35i). ఇది స్లిమ్ టవర్ డిజైన్‌తో రావడం వల్ల గదిలో చాలా తక్కువ స్థలాన్ని తీసుకుంటుంది. ఇందులో ఉండే మల్టీ-స్టేజ్ ఎయిర్ ప్యూరిఫికేషన్ ఫిల్టర్లు చల్లటి గాలితో పాటు స్వచ్ఛమైన గాలిని కూడా అందిస్తాయి. దీని మోటార్ చాలా తక్కువ కరెంట్ వినియోగిస్తుంది. కాబట్టి ఇన్వర్టర్‌పై కూడా సులభంగా నడుస్తుంది. బెడ్ పక్కన లేదా స్టడీ టేబుల్ పక్కన పెట్టుకోవడానికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ప్రస్తుతం మార్కెట్లో ఈ కూలర్ ధర సుమారు రూ.5,800 నుంచి రూ. 6,500 వరకు అందుబాటులో ఉంది.

2. బజాజ్ ప్లాటిని ఎక్స్ పర్సనల్ ఎయిర్ కూలర్:
బడ్జెట్ ధరలో ఎక్కువ కూలింగ్ కావాలనుకునే వారికి బజాజ్ ప్లాటిని ఎక్స్ (Bajaj Platini PX97 Torque) పర్సనల్ కూలర్ ఒక అద్భుతమైన ఆప్షన్. ఇది 36 లీటర్ల వాటర్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. కాబట్టి రాత్రంతా నీళ్లు అయిపోతాయనే టెన్షన్ లేకుండా హాయిగా పడుకోవచ్చు. ఇందులో అమర్చిన హనీకోంబ్ కూలింగ్ ప్యాడ్లు ఎక్కువ సమయం నీటిని పట్టి ఉంచి, గది ఉష్ణోగ్రతను వేగంగా తగ్గిస్తాయి. దీని పవర్‌ఫుల్ ఎయిర్ త్రో గదిలోని ప్రతి మూలకు చల్లదనాన్ని తీసుకెళ్తుంది. దీని చక్రాలు చాలా బలంగా ఉండటం వల్ల దీన్ని ఒక గది నుంచి మరో గదికి ఈజీగా మార్చుకోవచ్చు. దీని ప్రస్తుత ధర సుమారు రూ. 5,700 మధ్య ఉంది.

Advertisement

Also Read: ఈఫ్యాన్లతో క్షణాల్లోనే.. ఇల్లంతా కూల్ కూల్!

3. క్రాంప్టన్ ఆప్టిమస్ పర్సనల్ కూలర్:
ప్రీమియం లుక్ , లేటెస్ట్ ఫీచర్లు కోరుకునే వారి కోసం క్రాంప్టన్ ఆప్టిమస్ (Crompton Optimus Neo) పర్సనల్ కూలర్ మార్కెట్లో రెడీగా ఉంది. దీని డిజైన్ చాలా స్టయిలిష్‌గా ఉంటుంది. అంతు కాకుండా ఇందులో ఐస్ ఛాంబర్ కూడా ఇస్తారు. అంటే ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు అందులో ఐస్ ముక్కలు వేస్తే ఇంకా చల్లటి గాలి వస్తుంది. దీని బ్లేడ్లు పెద్దగా ఉండటం వల్ల నిశ్శబ్దంగా తిరుగుతూ ఎక్కువ గాలిని ఇస్తాయి. ఇది కూడా తక్కువ పవర్ కన్జంప్షన్‌తో పని చేస్తుంది. స్మార్ట్ కిచెన్ లేదా చిన్న ఆఫీస్ రూమ్‌లకు ఇది బాగా సెట్ అవుతుంది. ప్రస్తుతం దీని మార్కెట్ ధర సుమారు రూ. 6,900 వరకు నడుస్తోంది.

మీరు ఒంటరిగా ఒక రూమ్‌లో ఉంటున్నా.. లేదా మీ పిల్లల స్టడీ రూమ్ కోసం ఒక మంచి కూలింగ్ డివైజ్ వెతుకుతున్నా ఈ 3 పర్సనల్ కూలర్లు బెస్ట్ ఆప్షన్లుగా నిలుస్తాయి. ఇవి ఏసీ లాంటి భారీ ఖర్చు లేకుండానే.. వేసవి కాలంలో మీకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయి. ప్రముఖ ఈ-కామర్స్ సైట్లు అయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లేదా స్థానిక ఎలక్ట్రానిక్ స్టోర్లలో నడుస్తున్న బ్యాంక్ ఆఫర్లను బట్టి వీటి ధరలలో మరికొంత తగ్గింపు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ రూమ్ సైజును బట్టి సరైన మోడల్‌ను ఎంచుకుని ఈ సమ్మర్‌ను కూల్‌గా మార్చుకోండి.

Also Read: ఇల్లే ఏసీలా మారుతుంది! లివింగ్ రూమ్ కోసం.. తక్కువ ధరలో సీలింగ్ ఫ్యాన్లు

Related News

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి నాన్‌స్టాప్ మ్యూజిక్.. ధర వింటే ఆశ్చర్యపోతారు!

8 గంటలకు పైగా బ్యాకప్ ఇచ్చే.. టాప్ 5 ల్యాప్‌టాప్‌లు ఇవే!

ఆన్‌లైన్ క్లాసులు, నోట్స్ కోసం తక్కువ ధరలో బెస్ట్ ట్యాబ్‌లు

సౌండ్ నెక్స్ట్ లెవెల్ అంతే! బడ్జెట్‌లో.. బెస్ట్ 4K డాల్బీ ఆడియో టీవీలు!

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

Big Stories

Advertisement
×