E-Paper
Advertisement

మీ ఫోన్ మీపైనే నిఘా పెట్టిందా? వెంటనే ఇలా చేయకపోతే.. తప్పదు భారీ మూల్యం!

మీ ఫోన్ మీపైనే నిఘా పెట్టిందా? వెంటనే ఇలా చేయకపోతే.. తప్పదు భారీ మూల్యం!
Advertisement

Phone Privacy: స్మార్ట్‌ఫోన్ వ్యక్తిగత విషయాలను దొంగతనంగా గమనిస్తోందా? తమ ప్రమేయం లేకుండానే డేటాను సేకరిస్తోందా? అనే అనుమానం చాలామందికి వచ్చే ఉంటుంది. మనం మాట్లాడే మాటలు, వెతికే అంశాలను బట్టి ఫోన్‌లో యాడ్స్ రావడం చూస్తే ఇది నిజమే అన్న అభిప్రాయం చాలా మందికి కలిగే ఉంటుంది. అయితే ఫోన్ పూర్తిగా ‘స్పై’ చేయకపోయినా.. కొన్ని సెట్టింగ్స్ వల్ల మన డేటా కంపెనీలకు చేరే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రైవసీని కాపాడుకోవడానికి వెంటనే నిలిపివేయాల్సిన 3 అతి ముఖ్యమైన సెట్టింగ్స్ ఏంటో ఈ కథనంలో చూద్దాం.

మైక్రోఫోన్ పర్మిషన్స్

సాధారణంగా ఏ యాప్ ఇన్‌స్టాల్ చేసినా అది అడిగే పర్మిషన్లను ఏమాత్రం ఆలోచించకుండా చాలా మంది ‘Allow’ ఆప్షన్ క్లిక్ చేస్తుంటారు. గేమ్స్, కాలిక్యులేటర్స్ వంటి యాప్స్‌కు మైక్రోఫోన్ అవసరం ఉండదు. కానీ అవి బ్యాక్‌గ్రౌండ్‌లో మాటలను వినే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు ఫోన్ సెట్టింగ్స్ > యాప్స్ > పర్మిషన్ మేనేజర్ > మైక్రోఫోన్ లోకి వెళ్లండి. అక్కడ కేవలం అవసరమైన యాప్స్ (వాట్సాప్, ఫోన్ కాల్స్ వంటివి)కి మాత్రమే పర్మిషన్ ఇచ్చి.. మిగిలిన వాటికి ‘Don’t Allow’ చేస్తే బెటర్.

లొకేషన్ హిస్టరీ

Advertisement

యూజర్లు ఎక్కడికి వెళ్తున్నారు, ఎంతసేపు ఉంటున్నారు అనే ప్రతి అడుగును స్మార్ట్ ఫోన్స్ ట్రాక్ చేస్తూనే ఉంటాయి. దీనివల్ల మీ వ్యక్తిగత రోజూవారి యాక్టివిటీ అంతా రికార్డు అయ్యే ఛాన్స్ ఉంది. ఇలా జరగకూడదని భావిస్తే.. కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్ లోని డేటా & ప్రైవసీలోకి వెళ్లి ‘లొకేషన్ హిస్టరీ’ లేదా ‘టైమ్ లైన్’ ను ఆఫ్ (Pause) చేయండి. దీనివల్ల మీరు తిరిగే ప్రదేశాల డేటా సేవ్ అవ్వదు.

Also Read: ఏసీలు, కూలర్లు అక్కర్లేదు.. ఈ 4 చిట్కాలతో.. ఇంటి పైకప్పును ఐస్‌లా మార్చేయండి!

యాడ్ ఐడీ తొలగింపు

Advertisement

కంపెనీలు మీకు నచ్చిన ప్రకటనలను చూపించడానికి మీ ఫోన్ యాక్టివిటీని బట్టి ఒక ప్రత్యేక ‘యాడ్ ఐడీ’ని క్రియేట్ చేస్తాయి. దీనివల్లే మీరు దేని గురించైనా మాట్లాడితే వెంటనే దానికి సంబంధించిన యాడ్స్ ఫోన్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. దీనికి చెక్ పెట్టేందుకు ఆండ్రాయిడ్ ఫోన్లలో సెట్టింగ్స్ > ప్రైవసీ > యాడ్స్ లోకి వెళ్లి ‘డిలీట్ అడ్వర్ టైజింగ్ ఐడీపై క్లిక్ చేయండి. ఐఫోన్ యూజర్లు అయితే సెట్టింగ్స్ > ప్రైవసీ & సెక్యూరిటీ > ట్రాకింగ్ లోకి వెళ్లి ‘Allow Apps to Request to Track’ ను ఆఫ్ చేయాలి. ఇలా చేస్తే మీ మాటలకు అనుగుణంగా వచ్చే యాడ్స్ ఆగిపోతాయని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: ఒరేయ్ వైభ‌వ్…నీకు ఆంధ్ర పూతరేకులు తినిపిస్తా, డ‌కౌట్ అయిపో..యాంక‌ర్ రిక్వెస్ట్

Related News

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

Big Stories

Advertisement
×