E-Paper
Advertisement

డిష్‌వాషర్ గురించి భయంకరమైన నిజాలు.. మీకు తెలుసా?

డిష్‌వాషర్ గురించి భయంకరమైన నిజాలు.. మీకు తెలుసా?
Advertisement

Dishwasher smells bad reasons: మన వంటింట్లో శ్రమను తగ్గించి, గిన్నెలను తళతళా మెరిపించే అద్భుతమైన గ్యాడ్జెట్ డిష్‌వాషర్. పాత్రలపై ఉండే నూనె జిడ్డు, ఆహారానికి సంబంధించిన ముక్కలను ఇది క్లీన్ చేస్తుంది కాబట్టి.. ఈ మిషన్ ఎప్పుడూ శుభ్రంగానే ఉంటుందని మనమంతా అనుకుంటాం. కానీ అది మన భ్రమ మాత్రమే! గిన్నెలను కడిగిన మురికి అంతా పోయి డిష్‌వాషర్ అడుగున ఉండే ఫిల్టర్‌లో పేరుకుపోతుంది. మీకు తెలియకుండానే మీ డిష్‌వాషర్ ఫిల్టర్ లోపల దాగుండే ఆ 4 అసహ్యకరమైన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డిష్‌వాషర్ ఫిల్టర్ గురించి ముఖ్య విషయాలు:

1. కుళ్ళిపోయిన ఆహార వ్యర్థాలు:
మనం గిన్నెలను డిష్‌వాషర్‌లో పెట్టే ముందు ఎంత తుడిచినా.. చిన్న చిన్న అన్నం మెతుకులు, కూర ముక్కలు, నిమ్మకాయ గింజలు లేదా చపాతీ ముక్కలు పాత్రలకే ఉండిపోతాయి. మిషన్ ఆన్ చేసినప్పుడు వాటర్ ప్రెజర్‌కు ఇవన్నీ కొట్టుకుపోయి నేరుగా కింద ఉండే ఫిల్టర్‌లో ఇరుక్కుంటాయి. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ ఆహార వ్యర్థాలు ఆ వేడి నీటి వాతావరణంలో కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతాయి. మీ డిష్‌వాషర్ నుంచి విచిత్రమైన కుళ్ళిన వాసన వస్తోందంటే.. దానికి ప్రధాన కారణం ఫిల్టర్ లోపల దాగున్న ఈ కుళ్ళిపోయిన ముక్కలే.

Advertisement

2. జిగటగా మారిన గ్రీజు, ఫ్యాట్ :
వంటల్లో నూనె, నెయ్యి, రకరకాల మసాలాలు ఎక్కువగా వాడతాం. డిష్‌వాషర్ లోపల వేడి నీరు , డిటర్జెంట్ ఈ జిడ్డును కడిగేసినప్పటికీ.. ఆ జిడ్డు పూర్తిగా డ్రైన్ పైపు గుండా బయటకు వెళ్లదు. అందులోని కొంత భాగం ఫిల్టర్ మెష్ (నెట్) కు అంటుకుపోతుంది. కాలక్రమేణా ఇది ఒక తెల్లటి, జిగటగా ఉండే లేయర్ లాగా పేరుకుపోతుంది. ఇది ఫిల్టర్‌ను పూర్తిగా బ్లాక్ చేయడమే కాకుండా.. మీరు కడిగే మిగతా పాత్రలపై కూడా సన్నటి జిడ్డు లేయర్ వచ్చేలా చేస్తుంది.

3. హానికరమైన ఫంగస్ , బ్యాక్టీరియా:
డిష్‌వాషర్ లోపల ఎప్పుడూ తేమ, వేడి వాతావరణం ఉంటుంది. చీకటి, తేమ, కుళ్ళిన ఆహారం ఎక్కడైతే ఉంటాయో.. అక్కడ ఫంగస్, మోల్డ్, బ్లాక్ ఈస్ట్ వంటి బ్యాక్టీరియాలు విపరీతంగా పెరుగుతాయి. మనం గిన్నెలు కడిగేది ఆరోగ్యం కోసం.. కానీ ఫిల్టర్ క్లీన్ చేయకపోతే ఈ బ్యాక్టీరియా మనం కడిగే ప్లేట్లు, స్పూన్లకు అంటుకుంటుంది. ఇది మన కంటికి కనిపించదు కానీ.. దీనివల్ల కడుపునొప్పి, అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది.

Advertisement

4. విరిగిపోయిన గాజు ముక్కలు ,ప్లాస్టిక్ స్టిక్కర్లు :
కొన్నిసార్లు డిష్‌వాషర్ లోపల ప్రెజర్ ఎక్కువైనప్పుడు లేదా పొరపాటున లోడింగ్ సరిగ్గా లేనప్పుడు చిన్న చిన్న గాజు గ్లాసులు, సిరామిక్ బౌల్స్ చివర్లు విరిగిపోతుంటాయి. ఆ చిన్న చిన్న గాజు ముక్కలు నేరుగా వెళ్లి ఫిల్టర్ అడుగున దాక్కుంటాయి. అలాగే కొత్త పాత్రలకు ఉండే పేపర్/ప్లాస్టిక్ బార్‌కోడ్ స్టిక్కర్లు ఊడిపోయి ఫిల్టర్‌ను జామ్ చేస్తాయి. ఈ గాజు ముక్కలను మనం గమనించకుండా వదిలేస్తే.. డిష్‌వాషర్ వాటర్ పంప్ డ్యామేజ్ అయి వేల రూపాయల రిపేర్ ఖర్చు వస్తుంది.

Also Read:  మిక్సీ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ 5 ఫాస్ట్ మోడల్స్ పై ఓ లుక్కేయండి!

డిష్‌వాషర్ ఫిల్టర్‌ను ఎలా క్లీన్ చేయాలి?
ఈ తిప్పలన్నింటికీ ఒకటే పరిష్కారం నెలకు కనీసం ఒకసారి డిష్‌వాషర్ ఫిల్టర్‌ను తీసి క్లీన్ చేయడం. డిష్‌వాషర్ అడుగు భాగంలో ఉండే ఫిల్టర్‌ను యాంటీ-క్లాక్‌వైస్ తిప్పితే అది ఈజీగా బయటకు వచ్చేస్తుంది. దాన్ని సింక్ దగ్గరకు తీసుకెళ్లి కొద్దిగా లిక్విడ్ సోప్ , పాత టూత్ బ్రష్ సహాయంతో సాఫ్ట్‌గా రుద్దితే దుమ్ము, జిడ్డు మొత్తం వదిలిపోతాయి. ఆ తర్వాత మళ్లీ దాన్ని యథావిధిగా ఫిక్స్ చేసేయడమే.

పాత్రలు తళతళా మెరిసినంత మాత్రాన డిష్‌వాషర్ క్లీన్‌గా ఉన్నట్టు కాదు. ఈ 4 వస్తువులు మీ ఫిల్టర్‌లో చేరితే మిషన్ లైఫ్ తగ్గిపోవడమే కాదు, మీ హెల్త్‌కి కూడా రిస్క్. అందుకే ఆలస్యం చేయకుండా ఇప్పుడే మీ డిష్‌వాషర్ ఫిల్టర్ ఓపెన్ చేసి ఓ లుక్కేయండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఉపయోగించి క్లీన్ చేయండి.

Related News

వాట్సప్ హ్యాక్ అయిందా? వెంటనే ఇలా చేయండి.. స్కామర్లకు పిచ్చెక్కిపోద్ది!

వానలో ఆఫీస్‌కి వెళ్తున్నారా? రూ.300 లోపున్న ఈ గ్యాడ్జెట్స్ లేకపోతే.. రూ.వేలల్లో నష్టపోవాల్సిందే!

SanDisk సంచలనం.. సరికొత్త USB-C డ్రైవ్‌లు లాంచ్.. ఇక డేటా ట్రాన్స్‌ఫర్ మరింత ఈజీ!

20,000mAh బ్యాటరీ.. 67W ఫాస్ట్ ఛార్జింగ్.. షావోమీ నుంచి మైండ్ బ్లోయింగ్ పవర్ బ్యాంక్!

గ్రహాంతర వాసుల కోసం.. అంతరిక్షంలోకి భారతీయ పాట.. ఖగోళంలో మార్మోగుతున్న సింగర్ స్వరం!

వీఐ యూజర్లకు పండగే.. రూ. 189కే ఫ్రీ కాల్స్, డేటా.. సామాన్యులకు పర్ఫెక్ట్ ప్లాన్!

జియో బంపర్ ఆఫర్.. రూ. 175కే 10 జీబీ డేటా.. ఉచితంగా 11 ఓటీటీలు!

AC ఫ్యాన్ మోడ్.. కరెంట్ బిల్లు సగానికి తగ్గించుకునేందుకు సూపర్బ్ ట్రిక్!

Big Stories

Advertisement
×