E-Paper
Advertisement

మిక్సీ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ 5 ఫాస్ట్ మోడల్స్ పై ఓ లుక్కేయండి!

మిక్సీ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ 5 ఫాస్ట్ మోడల్స్ పై ఓ లుక్కేయండి!
Advertisement

Top 5 fast action mixer grinder: మన ఇండియన్ వంటల్లో ఘాటైన మసాలాలు, దోసెల పిండి, నోరూరుంచే చట్నీలు తప్పనిసరి. కానీ, రోజువారీ లైఫ్‌లో ఈ పనులన్నీ స్పీడ్‌గా, అస్సలు శ్రమ లేకుండా అయిపోవాలంటే కిచెన్‌లో ఒక పవర్‌ఫుల్ మిక్సీ ఉండాల్సిందే. అందుకే.. ప్రస్తుత లేటెస్ట్ ట్రెండ్‌కు తగ్గట్టుగా మార్కెట్‌ను షేక్ చేస్తున్న “5 Fast Action Mixer Grinders” గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఇవి మీ పనిని స్పీడప్ చేయడమే కాదు, మీ కిచెన్ లుక్‌ని కూడా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తాయి. మరి వీటి ఫీచర్లు, లేటెస్ట్ మార్కెట్ ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బెస్ట్ మిక్సీలు:

1. ఫిలిప్స్ రాయల్ (Philips HL7756/00 750W) :
మన ఇండియన్ కిచెన్స్‌లో ఫిలిప్స్ బ్రాండ్‌కు ఉన్న క్రేజే వేరు. ఈ మోడల్ 750 వాట్ల పవర్‌ఫుల్ టర్బో మోటార్‌తో వస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇందులో అడ్వాన్స్‌డ్ ఎయిర్ వెంటిలేషన్ సిస్టమ్ ఉంటుంది. దీని వల్ల మిక్సీని ఎంత ఎక్కువ సేపు వాడినా అస్సలు వేడెక్కదు. ఎంతటి గట్టి పదార్థాలనైనా చిటికెలో స్మూత్‌గా గ్రైండ్ చేస్తుంది. దీంతో పాటు 3 స్ట్రాంగ్ స్టెయిన్‌లెస్ స్టీల్ జార్లు వస్తాయి. దీని ధర మార్కెట్లో ఆఫర్లను బట్టి సుమారు రూ.4,200 వరకు ఉంటుంది.

Advertisement

2. బాష్ ట్రూమిక్స్ ప్రో (Bosch TrueMixx Pro 1000W):
మీకు ట్రెడిషినల్ రోటి పచ్చళ్ల టేస్ట్ కావాలా? పసుపు కొమ్ములు, నల్ల మిరియాలు లాంటి గట్టి మసాలాలను నూరాలా? అయితే కళ్లు మూసుకుని దీనికి ఓటేయొచ్చు. ఇందులో ‘Stone Pounding Technology’ ఉంది. అంటే రోట్లో దంచినప్పుడు వచ్చే అసలైన రుచి, సువాసన అస్సలు మిస్ అవ్వవు. 1000 వాట్ల మోటార్ దీని సొంతం. జార్ మూతలకు గట్టి లాక్ సిస్టమ్ ఉండటం వల్ల లీకేజీల టెన్షనే ఉండదు. దీని ధర సుమారు రూ. 7,500 వరకు ఉంటుంది.

3. ప్రీతి జోడియాక్ (Preethi Zodiac MG-218 750W):
సౌత్ ఇండియన్ ఇళ్లలో.. ముఖ్యంగా ఇడ్లీ, దోసెల పిండి రోజు మార్చి రోజు రుబ్బే ఇళ్లకు ప్రీతి బ్రాండ్ ఒక వరమనే చెప్పాలి. ఇది కేవలం మిక్సీ మాత్రమే కాదు,పక్కా ఫుడ్ ప్రాసెసర్. ఇందులో చపాతీ పిండి కలపొచ్చు, కూరగాయలు ముక్కలు చేయొచ్చు. అంతేకాదు ఫ్రెష్ జ్యూస్ కూడా క్షణాల్లో రెడీ చేసుకోవచ్చు. దీని వేగా 5 మోటార్ సూపర్ ఫాస్ట్‌గా పనిచేస్తుంది. దీని ధర సుమారు రూ.9,500 వరకు ఉంటుంది.

Advertisement

4. సుజాత డైనమిక్స్ (Sujata Dynamix 900W):
కమర్షియల్ షాపుల్లో.. పెద్ద ఫ్యామిలీల్లో ఎక్కువగా కనిపించే నమ్మకమైన బ్రాండ్ సుజాత. ఎంత రఫ్‌గా వాడినా, ఎంత ఎక్కువ సేపు రన్ చేసినా ఇది అస్సలు తగ్గదు. 900 వాట్ల మోటార్‌తో పాటు డబుల్ బాల్ బేరింగ్ టెక్నాలజీ ఉండటం వల్ల ఇయర్స్‌ తరబడి రిపేర్ అనేది రాకుండా లైఫ్ ఇస్తుంది. 22,000 RPM స్పీడ్‌తో పదార్థాలను క్షణాల్లో పౌడర్ చేస్తుంది. దీని ధర మార్కెట్లో సుమారు రూ. 6,500 వరకు అందుబాటులో ఉంది.

5. బజాజ్ రెక్స్ (Bajaj Rex 500W / 750W):
తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ బ్రాండ్. మంచి పర్ఫార్మెన్స్ కావాలనుకునే చిన్న ఫ్యామిలీస్ కోసం బజాజ్ రెక్స్ పర్ఫెక్ట్ మ్యాచ్. చిన్న కిచెన్ రూమ్‌లకు సెట్ అయ్యేలా ఇది చాలా కాంపాక్ట్ డిజైన్‌తో వస్తుంది. దీని 3 స్పీడ్ కంట్రోల్ ఫీచర్ రోజువారీ చట్నీలు, జ్యూస్‌లకు చాలా బాగా యూజ్ అవుతుంది. రస్ట్ ప్రూఫ్ బాడీ ఉండటం వల్ల మెయింటెనెన్స్ చాలా ఈజీ. దీని ధర వాటేజ్ బట్టి రూ. 3,200 లోపే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా దొరుకుతుంది.

Also Read: వర్షాకాలంలో బ్యాడ్ స్మెల్‌కి గుడ్‌బై.. బట్టలను పూర్తిగా ఆరబెట్టే వాషింగ్ మెషీన్స్

ఎవరికి ఏది బెస్ట్ ?
రోజువారీ వంటల కోసం తక్కువ శబ్దంతో పనిచేసే Philips HL7756 (750W) ధర రూ.3,890 కి బెస్ట్ ఆప్షన్. హెవీ మసాలాలు నూరుకోవడానికి 1000W పవర్‌తో వచ్చే Bosch TrueMixx Pro ధర రూ.6,400 కి అద్భుతంగా పనిచేస్తుంది. ఆల్‌రౌండర్ పనుల కోసం 5 జార్ల Preethi Zodiac ధర రూ. 8,990 కి, ఎక్కవ కాలం మన్నిక ఇచ్చే Sujata Dynamix ధర రూ. 5,800 కి సూపర్ ఛాయిస్. అలాగే తక్కువ బడ్జెట్‌లో చిన్న ఫ్యామిలీస్ కోసం Bajaj Rex ధర రూ. 2,500 కి పక్కాగా సెట్ అవుతుంది.

ఈ ఐదు ఫాస్ట్ యాక్షన్ మిక్సీ గ్రైండర్లు కూడా మన ఇండియన్ వంటల స్టైల్‌కి పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. మీ ఇంట్లోని అవసరాలు, మీ బడ్జెట్‌ను బట్టి ఇందులో మీకు నచ్చిన బెస్ట్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కొనేటప్పుడు రన్నింగ్ డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్స్ అండ్ వారంటీ డీటెయిల్స్‌ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.

Related News

ఆండ్రాయిడ్ 16తో వస్తున్న Motorola Edge 70 Plus.. ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ పక్కా!

10000mAh బ్యాటరీ, 4K కెమెరాతో POCO X8 Series.. రూ.3,000 డిస్కౌంట్ ఆఫర్!

6000mAh బ్యాటరీ, IP68 రేటింగ్.. ఈ ప్రైజ్ రేంజ్‌లో ఇలాంటి ఫోన్ రావడం ఇదే తొలిసారి!

గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కి పండగే.. ఆ ఫోన్ ధర రూ.13,300 తగ్గింది, ఈ డీల్ మిస్ అవ్వొద్దు!

హెల్దీగా తినాలని ఉందా? బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!

4K డిస్‌ప్లే, 12700mAh బ్యాటరీతో Lenovo Yoga Tab Gen 2.. ధరెంతో తెలుసా?

హైదరాబాద్‌లో TCS భారీ ఏఐ ప్రాజెక్ట్.. రూ.57,600 కోట్లతో HyperVault డేటా సెంటర్!

బడ్జెట్‌లో బెస్ట్ క్యాసియో అనలాగ్ వాచ్.. ఇలాంటి వాచ్ ఒక్కటైనా ఉండాలి

Big Stories

Advertisement
×