E-Paper
Advertisement

టీడీపీ వీరాభిమాని సత్యనారాయణ కోరిక.. కలుద్దామని సీఎం చంద్రాబాబు ట్వీట్

టీడీపీ వీరాభిమాని సత్యనారాయణ కోరిక.. కలుద్దామని సీఎం చంద్రాబాబు ట్వీట్
Advertisement

Amaravati: టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును దగ్గగా చూడాలని చాలామంది భావిస్తుంటారు. ఆయన కనిపిస్తే దేవుడు దర్శినమిచ్చినట్టేనని మరి కొందరు భావిస్తుంటారు. అలాంటి అభిమానులు టీడీపీలో చాలామంది ఉన్నారు కూడా. ఓ పెద్దాయన వీడియోపై సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. సోమవారం కలుద్దామంటూ ట్వీట్ చేశారు. ఇక ఆ అభిమాని ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.

టీడీపీ వీరాభిమాని సత్యనారాయణ కోరిక

Advertisement

టీడీపీ అంటే ప్రాణం ఇచ్చే అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబును చూడాలని చాలామంది కలలు కంటారు. ఆయనతో మాట్లాడితే జీవితంలో వారికి కోరిక తీరినట్టే. అందుకోసం చాలామంది పరితపిస్తుంటారు. సోషల్ మీడియాలో టీడీపీ హార్డ్ కోర్ అభిమాని సత్యనారాయణకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయ్యింది.

దానిపై సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. అభిమాని కోరికను తీర్చడానికి ముందుకొచ్చారు. తనను కలవాలని ఆశగా ఎదురుచూస్తున్న పెద్దాయన సత్యనారాయణ గారూ రేపు సిద్ధాంతంలో కలుద్దామని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. గోదావరి జిల్లాకు కామధేనువు లంక గ్రామానికి చెందిన సత్యనారాయణ టీడీపీకి వీరాభిమాని.

Advertisement

కలుద్దామని సీఎం చంద్రబాబు ట్వీట్

ఆయన వయస్సు కూడా ఎక్కువే. ఓ యువకుడు మాట్లాడిన ఆయన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. చంద్రబాబును ఎప్పుడైనా చూశారా? అని యువకుడు అడిగాడు. ఆయన హైదరాబాద్‌లో ఉంటారని అంటారని తాను చూడలేదంటూ బదులిచ్చారు. ఆయనతో కలవాలని ఉందా? అని అడగ్గా, తనకు చూడాలనే కోరిక ఉందని సత్యనారాయణ చూడాలనే చెప్పుకొచ్చాడు.

దీంతో ఆ యువకుడు జూన్ 9న సీఎం చంద్రబాబు సిద్ధాంతం వస్తున్నారని తాను తప్పకుండా కలిసేలా చేస్తానని హామీ ఇవ్వడంతో ఆ పెద్దాయన ఆననందానికి అవధుల్లేవు. సోమవారం సిద్ధాంతంలో తన పర్యటన సందర్భంగా సత్యనారాయణను కలుద్దామని  చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.  సీఎం చంద్రబాబు ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సీఎం త్వరగా స్పందించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీళ్లే.. విధేయతకు పట్టం కట్టిన హైకమాండ్, విజయ్-సానా-రామకృష్ణలకు ఛాన్స్

 

Related News

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

Big Stories

Advertisement
×