E-Paper
Advertisement

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఎలక్ట్రిక్ కెటిల్స్ కావాలా? వీటిపై ఓ లుక్కేయండి!

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఎలక్ట్రిక్ కెటిల్స్ కావాలా? వీటిపై ఓ లుక్కేయండి!
Advertisement

5 Best Multipurpose Kettles: హోస్టల్‌లో ఉండే స్టూడెంట్స్ అయినా, ఆఫీస్ కెరీర్‌లో బిజీగా ఉండే బ్యాచిలర్స్ అయినా, చిన్న ఫ్యామిలీస్ అయినా.. వంటింట్లో పని సులువుగా అవ్వాలంటే.. ఒక మంచి మల్టీపర్పస్ ఎలక్ట్రిక్ కెటిల్ ఉండాల్సిందే. కేవలం నీళ్లు కాచడానికే కాదు.. మ్యాగీ వండుకోవడానికి, గుడ్లు ఉడకబెట్టడానికి, టీ, కాఫీ, సూప్‌లు క్షణాల్లో తయారు చేసుకోవడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. మీ బడ్జెట్ రూ.వెయ్యిలోపే ఉంటూ, మార్కెట్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్న 5 మల్టీపర్పస్ ఎలక్ట్రిక్ కెటిల్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రోజుల్లో.. మల్టీ పర్పస్ ఎలక్ట్రిక్ కెటిల్స్ కిచెన్‌లో ఒక స్మార్ట్ గ్యాడ్జెట్‌లా మారిపోయాయి. గ్యాస్ స్టవ్ ఆన్ చేసే.. పనిలేకుండా, తక్కువ టైంలోనే లేట్ నైట్ క్రేవింగ్స్ తీర్చుకోవడానికి మ్యాగీ లేదా వేడి వేడి సూప్ రెడీ చేసుకోవచ్చు. రూ. వెయ్యి బడ్జెట్ లోపల లభించే టాప్ 5 బెస్ట్ మల్టీపర్పస్ కెటిల్స్ ఇవే..

1. Pigeon Favorite Multipurpose Electric Kettle:(రూ.699 – రూ.799)

Advertisement

బడ్జెట్ హోమ్ అప్లయెన్సెస్ మార్కెట్లో ‘పిజియన్’ (Pigeon)బ్రాండ్‌కు చాలా మంచి పేరుంది. ఈ కెటిల్ స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీతో వస్తుంది.
వేగంగా నీటిని ఇది వేడి చేస్తుంది. పాలు కాచుకోవడానికి, టీ/కాఫీ ప్రిపరేషన్‌కు చాలా బాగా సెట్ అవుతుంది. 360-డిగ్రీల స్వివెల్ బేస్, ఆటోమేటిక్ కటాఫ్ ఆప్షన్ కూడా ఇందులో ఉంటాయి.

2.AGARO Esteem Multi Kettle:(రూ.899 –రూ.999)

రూ. వెయ్యి బడ్జెట్‌లో ‘అగారో’ బ్రాండ్ నుంచి వచ్చే ఈ మల్టీపర్పస్ కెటిల్ ఒక అద్భుతమైన ఛాయిస్.  దీని వెడల్పాటి నోరు వల్ల లోపల క్లీన్ చేయడం చాలా ఈజీ. అంతే కాకుండా ఇందులో నీళ్లు మరిగించడంతో పాటు ఎగ్స్ బాయిల్ చేయడానికి, మ్యాగీ, పాస్తా వండుకోవడానికి ప్రత్యేకమైన యాక్సెసరీస్ కూడా వస్తాయి.

3. Butterfly Multi Cook Kettle:(రూ.749 – రూ.849)

Advertisement

కిచెన్ లో ‘బటర్‌ఫ్లై’ నమ్మకమైన బ్రాండ్. వీరి మల్టీ కుక్ కెటిల్ స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో వస్తుంది. హై-గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్ మెటీరియల్‌తో దీన్ని తయారు చేశారు. అంతే కాకుండా దీనిలో డ్రై బాయిల్ ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే కెటిల్‌లో.. నీళ్లు లేదా ఆహారం ఏమీ లేనప్పుడు ఇది ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోయి మోటార్ పాడవకుండా చూస్తుంది.

Also Read: బడ్జెట్ ధరలో.. రిమోట్ కంట్రోల్ సీలింగ్ ఫ్యాన్, ఫుల్ కరెంట్ సేవ్ !

4. Longway Handy Multi-Cooker Kettle:(రూ.599 – రూ.699)

తక్కువ ధరలో.. ఎక్కువ కెపాసిటీ, మల్టీ టాస్కింగ్ ఫీచర్లు ఆశించే వారికి  ఇది బెస్ట్ ఆప్షన్. ఇది సాధారణంగా 600W పవర్‌తో వస్తుంది. దీని వల్ల కరెంట్ బిల్లు కూడా చాలా తక్కువగా వస్తుంది. ఇందులో సూప్‌లు, మ్యాగీ, ఓట్స్ వంటివి బ్యాచిలర్స్ చాలా ఈజీగా వండుకోవచ్చు.

5. Lifelong Multi-Cook/Electric Kettle:రూ.649 – రూ.749)

లైఫ్‌లాంగ్ బ్రాండ్ తక్కువ బడ్జెట్‌లో.. క్వాలిటీ ప్రొడక్ట్స్‌ను అందిస్తుంది. ఇరుకైన ప్రదేశాల్లో కూడా ఈజీగా ఫిట్ అయ్యే కాంపాక్ట్ డిజైన్ దీని సొంతం. అంతే కాకుండా ఓవర్ హీటింగ్ ప్రొటెక్షన్ , కూల్-టచ్ హ్యాండిల్ ఉండటం వల్ల దీనిని సేఫ్‌గా వాడుకోవచ్చు.

Related News

ధర తక్కువ.. బెనిఫిట్స్ ఎక్కువ.. Airtel టాప్ ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ ఇవే!

2-పిన్, 3-పిన్ ప్లగ్‌ల మధ్య తేడా ఏంటి? ఇవి కేవలం డిజైన్ కోసమేనా లేక సేఫ్టీ కోసమా?

ల్యాప్‌టాప్ లైఫ్ ఎక్కువ రోజులు రావాలంటే షట్ డౌన్ చేయాలా? లేదా స్లీప్ మోడ్ బెటరా?

ఫోన్ ఛార్జ్ ఇట్టే పోతుందా? ఈ యాప్స్ ఏ కారణం!

120 ఏళ్ల నాటి రాక్షస చేప.. దోమల నివారణకు తెస్తే.. దీవినే మింగేస్తోంది..!

10 గంటలు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే.. ఓరియంట్ ఫ్యాన్, కరెంట్ లేకపోయినా నో టెన్షన్

రూ.849కే పోర్టబుల్ స్పీకర్..సౌండ్ వింటే మైండ్ బ్లాక్!

రూ.699కే ఫైర్‌బోల్ట్ ఇయర్‌బడ్స్..అదిరిపోయే ఫీచర్లపై ఓ లుక్కేయండి

Big Stories

Advertisement
×