E-Paper
Advertisement

దొంగలు, చోరీలకు చెక్ పెట్టాలా? వైర్డ్ vs వైర్‌లెస్.. ఏ CCTV పవర్ఫుల్?

దొంగలు, చోరీలకు చెక్ పెట్టాలా? వైర్డ్ vs వైర్‌లెస్.. ఏ CCTV పవర్ఫుల్?
Advertisement

Wired vs Wireless CCTV: ఇల్లు, ఆఫీసు, వ్యాపారం రక్షణ అనగానే ఈ రోజుల్లో అందరికీ మొదట గుర్తొచ్చేది సెక్యూరిటీ కెమెరాలు (CCTV). అయితే మార్కెట్‌లోకి వెళ్తే హోమ్ సెక్యూరిటీలో ప్రధానంగా రెండు రకాల కెమెరాలు కనిపిస్తాయి. ఒకటి సాంప్రదాయకంగా వచ్చే ‘వైర్డ్ (వైర్లతో కూడిన)’ సిస్టమ్ కాగా, రెండోది ఆధునిక టెక్నాలజీతో నడిచే ‘వైర్‌లెస్’ సిస్టమ్. అయితే ఈ రెండింటిలో ఏది కొనాలి? దేని వల్ల ఎక్కువ బెనిఫిట్? అన్న సందేహం చాలా మందికి కలిగే ఉంటుంది. కాబట్టి సెక్యూరిటీ దానిలో ఏది బెటరో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

వైర్డ్ సెక్యూరిటీ కెమెరాలు

వైర్డ్ కెమెరాలు.. ఇంటర్నెట్ కేబుల్స్ (PoE) ద్వారా నేరుగా ఒక రికార్డర్ కు కనెక్ట్ చేయబడి ఉంటాయి. దీనివల్ల వైఫై సిగ్నల్ కట్ అయినా ఇంటర్నెట్ స్లో అయినా ఈ కెమెరాలు రికార్డింగ్‌ను ఆపవు. హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువ. ఎలాంటి మంత్లీ క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ ఫీజులు లేకుండా టీబీలకు టీబీలు డేటాను లోకల్‌గా దాచుకునేందుకు ఇవి వీలు కల్పిస్తాయి. ఇక మైనస్ లకు వస్తే.. వీటిని ఇన్‌స్టాల్ చేయడం చాలా పెద్ద టాస్క్. ఇల్లంతా వైర్లు లాగి, గోడలకు రంధ్రాలు చేసి వీటికి ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. టెక్నీషియన్ల హెల్ప్ లేకుండా వీటిని అమర్చడం అసాధ్యం. ఒకవేళ ఇల్లు మారితే వీటిని తీసేసి.. మళ్లీ కొత్త ఇంట్లో సెట్ చేయడం పెద్ద తలనొప్పిగా మారుతుంది.

వైర్‌లెస్ సెక్యూరిటీ కెమెరాలు

Advertisement

ఇక వైర్‌లెస్ కెమెరాలకు వస్తే.. ఇవి ఇంటి వైఫై (Wi-Fi) నెట్‌వర్క్ ఆధారంగా పనిచేస్తాయి. బ్యాటరీ ద్వారా లేదంటే ఒక పవర్ కేబుల్ సాయంతో రన్ అవుతాయి. అయితే వీటి ఇన్‌స్టలేషన్ చాలా ఈజీ. టెక్నీషియన్ అవసరం లేకుండానే ఐదు నిమిషాల్లో సొంతంగా ఫిక్స్ చేసుకోవచ్చు. వైర్లు ఉండవు కాబట్టి ఇల్లు నీట్‌గా కనిపిస్తుంది. మొబైల్ యాప్స్ ద్వారా ప్రపంచంలో ఎక్కడున్నా లైవ్ ఫుటేజ్‌ని చూడొచ్చు. వీటిలోని ఏఐ స్మార్ట్ ఫీచర్లు.. మనుషులను, జంతువులను గుర్తుపట్టి అలర్ట్స్ పంపుతుంటాయి. ఇక మైసన్ పాయింట్స్ కు వస్తే.. వైఫై కనెక్షన్ గనుక వీక్ అయితే వీడియో క్వాలిటీ పడిపోతుంది. ఒక్కోసారి రికార్డింగ్ కూడా ఆగిపోతుంది. దీనికితోడు డేటా క్లౌడ్‌లో సేవ్ అవ్వాలంటే ప్రతి నెల కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా వైఫైతో కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి హ్యాకర్ల ముప్పు ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read: బుక్ vs ఈ-బుక్.. గెలుపెవరిది? చదవడానికి ఏది బెస్ట్?

అవసరానికి ఏది బెటర్?

Advertisement

ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది పూర్తిగా అవసరం, బడ్జెట్‌పై ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. సొంత ఇల్లు ఉండి, ఎలాంటి సిగ్నల్ డ్రాప్స్ లేకుండా 24/7 పక్కాగా రికార్డింగ్ కావాలి అనుకుంటే కళ్ళు మూసుకుని వైర్డ్ సిస్టమ్‌ వైపు వెళ్లొచ్చని సూచిస్తున్నారు. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, బంగళాలకు ఇవే బెస్ట్ అని స్పష్టం చేస్తున్నారు. అలాకాకుండా అద్దె ఇంట్లో ఉంటూ.. ఇల్లు పాడవకుండా సింపుల్‌గా కెమెరాలు అమర్చుకోవాలి అనుకుంటే వైర్ లెస్ కెమెరాలు బెస్ట్ ఆప్షన్. స్మార్ట్ ఫీచర్లు, మొబైల్ అలర్ట్స్ తో రావడం వల్ల.. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేందుకు వీలు కలుగుతుంది. ఫైనల్గా మీ అవసరం, అభిరుచికి తగ్గట్లు ఉన్న దానిని మీరే ఎంచుకోండి.

Also Read: టోస్టర్ vs శాండ్‌విచ్ మేకర్.. మార్నింగ్ టిఫిన్ కోసం.. ఏది బెస్ట్ ఛాయిస్?

Related News

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

10నిమిషాల ఛార్జింగ్‌తో..200 నిమిషాల ప్లేటైమ్ ఇయర్ బడ్స్

ఇంతకీ ఈ LTPO డిస్‌ప్లే కథేంటి? స్మార్ట్‌ఫోన్లలో ఇది ఉంటే బ్యాటరీ లైఫ్ డబుల్ అవుతుందా?

రూ.499కే బ్లూటూత్ స్పీకర్..పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో ట్రెండీ మోడల్

మార్కెట్‌లోకి కొత్త మోడల్.. రచ్చ చేస్తున్న ఈ టీవీ మోడల్ గురించి మీకు తెలుసా?

రూ.1648కే 3 వస్తువుల కాంబో..ఇలాంటి ఆఫర్ ఎప్పుడూ చూసుండరు

Big Stories

Advertisement
×