E-Paper
Advertisement

E20 పెట్రోల్.. మైలేజ్ తగ్గడమే కాదు.. ఈ సమస్యలు కూడా వస్తాయట, షాకిచ్చిన తాజా సర్వే!

E20 పెట్రోల్.. మైలేజ్ తగ్గడమే కాదు.. ఈ సమస్యలు కూడా వస్తాయట, షాకిచ్చిన తాజా సర్వే!
Advertisement

E20 Petrol Controversy: దేశ వ్యాప్తంగా E20 పెట్రోల్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, పాత పెట్రోల్ వాహనాల యజమానుల్లో కొత్త ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు మైలేజీ తగ్గుతుందనే ఫిర్యాదులు ఎక్కువగా వినిపించగా, తాజాగా వాహనాల ఇంజిన్ కూడా డ్యామేజ్ అవుతున్నట్లు సర్వే వెల్లడించింది. లోకల్‌ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో 305 జిల్లాలకు చెందిన 2023కు ముందు తయారైన పెట్రోల్ వాహనాల యజమానులు 44 వేల మందికి పైగా పాల్గొన్నారు. వీరిలో చాలామంది E20 పెట్రోల్‌ ను ఎక్కువ కాలం ఉపయోగించిన తర్వాత వాహనాల్లో రిపేర్లు పెరిగినట్లు చెప్పారు.

సర్వే రిపోర్టు ఏం చెప్పిందంటే?

తాజా సర్వే ప్రకారం, 55 శాతం మంది తమ వాహనాల్లో గతంతో పోలిస్తే ఇంజిన్ అరుగుదల ఎక్కువైందని, తరచుగా రిపేర్లు చేయాల్సి వస్తుందని చెప్పారు. ఇందులో 24 శాతం మంది సమస్య తీవ్రంగా ఉందని చెప్పగా, మరో 21 శాతం మంది మోస్తరు స్థాయిలో ప్రభావం కనిపిస్తోందన్నారు. అయితే, 38 శాతం మంది మాత్రం తమ వాహనంలో పెద్దగా మార్పు కనిపించలేదని చెప్పారు.

నిపుణులు ఏం చెప్తున్నారంటే?

Advertisement

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇథనాల్ తేమను సులభంగా గ్రహించే లక్షణం కలిగి ఉంటుంది. దీంతో ఫ్యూయల్ ట్యాంక్, ఫ్యూయల్ పంప్, ఇంజెక్టర్లు, మెటల్ ఫ్యూయల్ లైన్లలో తుప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. అంతేకాదు, పాత వాహనాల్లో ఉపయోగించిన రబ్బరు హోసులు, సీల్స్, ఓ రింగ్స్, కొన్ని ప్లాస్టిక్ భాగాలు E20 మిశ్రమానికి అనుకూలంగా రూపొందించబడలేదు. దీర్ఘకాలంలో ఇవి త్వరగా దెబ్బతినే అవకాశం ఉందని సర్వే తెలిపింది.

మైలేజీ విషయంలోనూ ఫిర్యాదులు

మైలేజీ విషయంలో కూడా యజమానుల ఫిర్యాదులు పెరుగుతున్నాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 66 శాతం మంది 2025 ప్రారంభం నుంచి తమ వాహనాల మైలేజీ 10 శాతానికి పైగా తగ్గిందని చెప్పారు. వీరిలో 23 శాతం మంది 20 శాతానికి మించి మైలేజీ తగ్గిందని, మరో 23 శాతం మంది 15 నుంచి 20 శాతం మధ్య తగ్గుదల ఉందని వెల్లడించారు. మరో 20 శాతం మంది 10 నుంచి 15 శాతం వరకు మైలేజీ తగ్గిందన్నారు.

ఎందుకు ఇలా జరుగుతుంది?

Advertisement

ఈ పరిస్థితికి కారణం ఇథనాల్‌ లో ఉండే తక్కువ శక్తి సాంద్రత అని నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్‌ తో పోలిస్తే ఇథనాల్‌ లో శక్తి తక్కువగా ఉండటంతో, అదే పనితీరు కోసం ఇంజిన్ ఎక్కువ ఇంధనాన్ని వినియోగించాల్సి వస్తుంది. కొత్త E20-  వాహనాల్లో ఇంజిన్ ఇందుకు అనుగుణంగా పనిచేసే సాంకేతికత ఉన్నా, పాత మోడళ్లలో అలాంటి సదుపాయం లేకపోవడం వల్ల మైలేజీపై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉందని వివరించారు. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) అంచనా ప్రకారం E20 వల్ల మైలేజీ 1 నుంచి 6 శాతం వరకు మాత్రమే తగ్గాలి. అయితే, వాస్తవ పరిస్థితుల్లో పాత వాహనాల్లో ఈ తగ్గుదల మరింత ఎక్కువగా కనిపిస్తోందని సర్వే వెల్లడించింది.

Read Also: ఎలక్ట్రిక్ కారు vs పెట్రోల్ కారు.. 2026లో ఏ కారు కొనడం బెస్ట్?

Related News

జూలైలో హ్యాచ్‌బ్యాక్‌ల దూకుడు.. వాగన్ ఆర్ టాప్, మారుతి హవా!

227 కిమీ రేంజ్‌ తో యూధా EPOD-భారత్.. ఈ ఆటో ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

స్కోడా ఎలక్ట్రిక్ కార్ల ఎంట్రీ.. భారత్‌కు రానున్న 3 గ్లోబల్ మోడల్స్ ఇవే!

కవాసకి W230 vs యమహా XSR155.. ఈ రెండు రెట్రో బైక్‌లలో ఏది బెస్ట్?

నీళ్లు లేకుండా కారు వాష్.. ఈ ఐడియా ఏదో భలే ఉందే!

మళ్లీ మార్కెట్లోకి అడుగు పెట్టిన స్పైకర్.. అదిరిపోయే సూపర్‌ కార్‌ తో రీఎంట్రీ!

ఆటోమొబైల్ రంగంలో రికార్డ్.. రూ.383 కోట్లకు అమ్ముడైన టాప్ బ్రాండ్ ఈవీ కారు.. ఎవరు కొన్నారో తెలుసా?

జీప్ కంపాస్ స్పెషల్ ఎడిషన్ వచ్చేసింది.. జస్ట్ 85 యూనిట్లు మాత్రమే!

Big Stories

Advertisement
×