E-Paper
Advertisement

స్మశానంలో ప్రేమాయణం.. ఇదేం పిచ్చిరా అయ్యా!

స్మశానంలో ప్రేమాయణం.. ఇదేం పిచ్చిరా అయ్యా!
Advertisement

Graveyard Dating Trend Goes Viral:  సాధారణంగా డేటింగ్ అంటే కేఫ్‌లు, రెస్టారెంట్లు, పార్కులు, సినిమా థియేటర్లే గుర్తుకు వస్తాయి. కానీ, ఇప్పుడు కొందరు యువతీయువకులు  స్మశాన వాటిలు, సమాధుల మధ్యలో కూర్చొని ప్రేమించుకుంటున్నారు. వల్లకాట్లో ప్రేమేంట్రా పింజారీ వెధవల్లారా అనుకుంటున్నారా? అయినా, ఇది నిజం. గత కొంతకాలంగా గ్రేవ్‌ యార్డ్ ప్రేమాయణాలు పెరిగిపోయాయి.

ఓవైపు సపోర్టు.. మరోవైపు విమర్శలు..

ఈ ట్రెండ్‌ ను ఫాలోఅవుతున్న వారి అభిప్రాయం ఆసక్తికరంగా ఉంది. సిటీల్లో ఎక్కడ చూసినా రద్దీ, శబ్దం ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. స్మశాన వాటికల్లో నిశ్శబ్ద వాతావరణం ఉండటంతో ఒకరినొకరు బాగా అర్థం చేసుకునేలా ఎక్కువసేపు మాట్లాడుకోవచ్చని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు, స్మశానాలు జీవితం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తు చేస్తాయని, అక్కడ కూర్చున్నప్పుడు సాధారణ విషయాల కంటే జీవితం, భవిష్యత్తు, సంబంధాలు, భావోద్వేగాలు లాంటి అంశాలపై లోతైన చర్చలు జరుగుతాయంటున్నారు. అంతేకాదు, ఇద్దరి మధ్య మంచి అవగాహన పెరుగుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

చారిత్రక ప్రదేశాలపై ఆసక్తి

Advertisement

కొన్ని ప్రాంతాల్లోని పాత స్మశాన వాటికలు చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉంటాయి. అక్కడ ఉన్న సమాధులు, శిల్పకళ, పురాతన నిర్మాణాలు, పచ్చని వాతావరణం ఆకర్షిస్తుంటాయి. అందుకే అలాంటి ప్రదేశాలను చూడటంతో పాటు అక్కడ సమయం గడపడానికి కొందరు యువత ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.

సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు   

ఈ ట్రెండ్‌ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు దీనిని వ్యక్తిగత అభిరుచిగా చూస్తూ, ప్రశాంతమైన ప్రదేశంలో మాట్లాడుకోవడంలో తప్పేమీ లేదని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం దీనిని పిచ్చిగా అభివర్ణిస్తున్నారు. స్మశానాలు అనేవి మరణించిన వారిని గౌరవంగా స్మరించుకునే పవిత్రమైన ప్రదేశాలు. అలాంటి చోట్ల డేటింగ్ చేయడం, వినోదం కోసం వెళ్లడం సరైన పద్ధతి కాదని వారు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మృతుల కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడుతున్నారు.

Advertisement

గ్రేవ్‌ యార్డ్ డేటింగ్  ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కొందరికి ఇది ప్రశాంతంగా సమయం గడిపే కొత్త మార్గంగా కనిపిస్తే, మరికొందరికి ఇది సంప్రదాయాలకు, సామాజిక విలువలకు విరుద్ధమైన ట్రెండ్‌గా అనిపిస్తోంది. వ్యక్తిగత స్వేచ్ఛతో పాటు ఇతరుల భావాలను కూడా గౌరవించడం అవసరమనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. ఈ ట్రెండ్   ఎంతకాలం కొనసాగుతుందో చూడాల్సి ఉంది.

Read Also: లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

Related News

పాత బంగ్లాలో అర్ధరాత్రి విడిది.. దెయ్యం లేదని నిరూపిస్తే.. రూ.52 వేలు మీవే!

Gulf Job Scam: విజిట్ వీసా vs వర్క్ వీసా.. ఈ ఒక్క తప్పు చేస్తే గల్ఫ్‌లో జీవితం నాశనమే!

సహారా ఎడారి లేకపోతే అమెజాన్ అడవి ఉండేది కాదా? రెండింటి మధ్య అసలు లింకేంటి?

ఒకప్పుడు పాక్ లో.. ఇప్పుడు ఇండియాలో.. ఈ అందమైన గ్రామం గురించి మీకు తెలుసా?

హైడ్రోజన్ రైలుపై రాళ్లు విసిరారా? వైరల్ వీడియోపై రైల్వే క్లారిటీ!

రాత్రిపూట వెలిగే మొక్కలు వచ్చేశాయి.. ‘అవతార్‘ సినిమాలో చూసింది ఇప్పుడు నిజమైంది!

ఈ నదుల్లో నీళ్లే కాదు, బంగారం ప్రవహిస్తుంది.. నిజంగా అద్భుతం!

48 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన భార్య.. పచ్చబొట్టు చూసి గుండెలకు హత్తుకున్న భర్త!

Big Stories

Advertisement
×