E-Paper
Advertisement

Stylish Watches For Women: 2025 లో.. అమ్మాయిల మనసు దోచుకున్న టాప్ 5.. స్టైలిష్ వాచ్‌లు ఇవే!

Stylish Watches For Women: 2025 లో.. అమ్మాయిల మనసు దోచుకున్న టాప్ 5.. స్టైలిష్ వాచ్‌లు ఇవే!
Advertisement

Stylish Watches For Women: 2025లో వాచ్ అంటే కేవలం సమయాన్ని చూపే పరికరం కాదు.. అది మీ పర్సనాలిటీని ఎలివేట్ చేసే ఒక అల్టిమేట్ ‘ఫ్యాషన్ స్టేట్‌మెంట్’. ఈ ఏడాది ఓల్డ్ స్కూల్ క్లాసిక్స్ , ఫ్యూచరిస్టిక్ మినిమలిజం ట్రెండ్ సెట్ చేసాయి. లగ్జరీ ఫినిషింగ్ నుంచి ఎలిగెంట్ డిజైన్ల వరకు.. ఫ్యాషన్ ప్రపంచాన్ని షేక్ చేస్తూ మహిళల మణికట్టుపై మ్యాజిక్ చేస్తున్న టాప్ 5 స్టైలిష్ వాచీలపై ఓ లుక్కేద్దామా.

1. మైఖేల్ కోర్స్ డార్సీ (Michael Kors Darci – Rose Gold):
మహిళల వాచీల అనగానే మొదట గుర్తొచ్చే బ్రాండ్లలో Michael Kors ఒకటి. 2025లో ‘రోజ్ గోల్డ్’ కలర్ ట్రెండ్ మళ్ళీ ఊపందుకుంది. దీని ప్రత్యేకత డయల్ చుట్టూ ఉండే మెరిసే క్రిస్టల్స్ లగ్జరీ లుక్‌ను ఇస్తాయి. ఇది పార్టీ వేర్‌కు, వివాహా శుభకార్యాలకు అద్భుతంగా సరిపోతుంది. ఇది మీ చేతికి ఒక నగలాంటి లుక్ ఇస్తుంది.

Advertisement

2. డానియల్ వెల్లింగ్టన్ క్వాడ్రో (Daniel Wellington Quadro):
చాలా కాలం పాటు రౌండ్ డయల్స్ రాజ్యమేలాయి. కానీ 2025లో రెక్టాంగ్యులర్ డయల్స్ మళ్ళీ ట్రెండ్‌లోకి వచ్చాయి. దీని ప్రత్యేకత DW క్వాడ్రో సిరీస్ చాలా స్లిమ్‌గా, క్లాసీగా ఉంటుంది. ముఖ్యంగా దీని మెష్ స్ట్రాప్స్ చేతికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఆఫీసుకి వెళ్లే మహిళలకు లేదా సెమీ-ఫార్మల్ బట్టలు ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. ఇది మీ వ్యక్తిత్వంలో ఒక హుందాతనాన్ని నింపుతుంది.

3. టైటాన్ రాగా ‘ఫాసెట్స్’ కలెక్షన్ (Titan Raga Facets):
మహిళల అభిరుచులకు తగ్గట్టుగా వాచీలను రూపొందించడంలో Titan Raga ఎప్పుడూ ముందే ఉంటుంది. 2025లో వీరి ‘ఫాసెట్స్’ కలెక్షన్ బాగా ప్రాచుర్యం పొందింది. వీటి ప్రత్యేకత ఏంటంటే ఈ వాచీలు ప్రకృతిలోని రాళ్ళు, ముత్యాల ఆకృతుల నుంచి ప్రేరణ పొంది తయారు చేయబడ్డాయి. వీటి స్ట్రాప్స్ వినూత్నమైన డిజైన్లతో ఉంటాయి. చీరలు లేదా అనార్కలీ డ్రెస్సులపై ఇది ఒక ‘స్టేట్‌మెంట్ పీస్’లా కనిపిస్తుంది.

Advertisement

4. ఫాసిల్ రాక్వెల్ వాచ్ రింగ్ (Fossil Raquel Watch Ring):
2025లో ఒక వినూత్నమైన ఫ్యాషన్ ట్రెండ్ ఏమిటంటే ‘వాచ్ రింగ్’. చేతి మణికట్టుకు కాకుండా.. వేలికి ఉంగరంలా పెట్టుకునే చిన్నపాటి వాచ్ ఇది. వీటి ప్రత్యేకత Fossil కంపెనీ ప్రవేశపెట్టిన ఈ వాచ్ రింగ్ యువతుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇది చూడటానికి చిన్న ఉంగరంలా ఉన్నా, అందులో సమయాన్ని చూపే చిన్న డయల్ ఉంటుంది. కొత్తగా, ట్రెండీగా కనిపించాలనుకునే కాలేజీ యువతులకు, ఫ్యాషన్ ప్రియులకు ఇది ఒక గొప్ప ఆప్షన్.

5. కాసియో షీన్ సిరీస్ (Casio Sheen – Minimalist):
మన్నికతో పాటు స్టైల్ కోరుకునే వారి కోసం Casio Sheen అద్భుతమైన ఎంపిక. 2025లో ఈ సిరీస్ లోని సిల్వర్, సెరామిక్ మోడల్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఇందులో సఫైర్ గ్లాస్ వాడటం వల్ల గీతలు పడవు. అలాగే, దీని డిజైన్ చాలా సింపుల్‌గా, మినిమలిస్టిక్‌గా ఉంటుంది. ప్రతిరోజూ వాడుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×