E-Paper
Advertisement

కరెంట్ బిల్లు రాదు.. ఏసీ అక్కర్లేదు.. ఈ 6 ట్రిక్స్‌తో మీ గది ‘కాశ్మీర్’ అయిపోద్ది!

కరెంట్ బిల్లు రాదు.. ఏసీ అక్కర్లేదు.. ఈ 6 ట్రిక్స్‌తో మీ గది ‘కాశ్మీర్’ అయిపోద్ది!
Advertisement

AC Alternative Tips: ప్రస్తుత వేసవి నేపథ్యంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు ఇళ్లు సెగలు కక్కుతున్నాయి. ఈ ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడానికి పెద్ద ఎత్తున ప్రజలు ఏసీలపై ఆధారపడుతున్నారు. మరి ఇంట్లో ఏసీలేని వారి పరిస్థితి ఏంటన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతోంది. అలాంటి వారికోసం ఈ ప్రత్యేక కథనం అందించడం జరుగుతోంది. గదిని ఏసీ లేకున్నా చల్లగా ఉంచుకునే 6 అద్భుతమైన చిట్కాలను ఇప్పుడు చూద్దాం.

కిటికీలు, కర్టెన్స్ క్లోజ్

సమ్మర్ లో గదిలోకి వేడి గాలి ఎండ రాకుండా ఉండాలంటే ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కిటికీలు, తలుపులు, కర్టెన్లు పూర్తిగా మూసి ఉంచాలి. మందపాటి తెరలు (Curtains) వాడటం వల్ల గదిలోకి వేడి రాకుండా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. .

క్రాస్ వెంటిలేషన్

Advertisement

సాయంత్రం ఎండ తగ్గిన తర్వాత రాత్రి వేళల్లో కిటికీలను తెరిచి ఉంచండి. గదికి ఇరువైపులా ఉన్న కిటికీలు తెరవడం ద్వారా గాలి ఒక వైపు నుండి వచ్చి మరోవైపు వెళ్తుంది. దీనివల్ల గదిలోని వేడి గాలి బయటకు పోయి చల్లదనం పెరుగుతుంది.

టేబుల్ ఫ్యాన్ ట్రిక్

మీ గదిలో టేబుల్ ఫ్యాన్ ఉంటే దాని ముందు ఒక గిన్నెలో కొన్ని ఐస్ ముక్కలను ఉంచండి. ఫ్యాన్ గాలి ఆ ఐస్ ముక్కలపై పడి.. గది అంతటా చల్లటి ఏసీ గాలిని విస్తరించేలా చేసి.. కూల్ చేస్తుంది.

కాటన్ బెడ్‌షీట్స్

Advertisement

వేసవిలో సిల్క్, సింథటిక్ పరుపులను పక్కన పెట్టి.. కేవలం లైట్ కలర్ కాటన్ బెడ్‌షీట్లను వాడితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాటన్ బట్టలు గాలి శరీరానికి తగిలేలా చేస్తూ.. బాడీ టెంపరేచర్ ను తగ్గిస్తాయి.

ఎలక్ట్రానిక్ వస్తువులు ఆఫ్

లైట్లు, కంప్యూటర్లు, టీవీలు రన్ అవుతున్నప్పుడు చాలా వేడిని విడుదల చేస్తాయి. కాబట్టి అవసరం లేనప్పుడు వాటిని పూర్తిగా ఆఫ్ చేయడం బెటర్. అలాగే గదిలో పాతకాలపు బల్బులకు బదులుగా తక్కువ వేడినిచ్చే ఎల్‌ఈడీ (LED) బల్బులను వాడండి.

Also Read: Window AC: టెక్నాలజీ మారినా.. కాలం మారినా.. విండో ఏసీల రూటే సెపరేటు!

మొక్కలు పెంచండి

గది మూలల్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంచడం వల్ల గదిలోని తేమ శాతం పెరుగుతుంది. కలబంద, స్నేక్ ప్లాంట్ వంటి మొక్కలు గదిని చల్లబరచడమే కాకుండా గాలిని కూడా శుద్ధి చేస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: జియో సూపర్ ఆఫర్.. సంవత్సరం పాటు.. రోజూ 2.5GB డేటా, నాన్ స్టాప్ వినోదం!

Related News

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

Big Stories

Advertisement
×