E-Paper
Advertisement

Window AC: టెక్నాలజీ మారినా.. కాలం మారినా.. విండో ఏసీల రూటే సెపరేటు!

Window AC: టెక్నాలజీ మారినా.. కాలం మారినా.. విండో ఏసీల రూటే సెపరేటు!
Advertisement

Window AC: ప్రస్తుత ఆధునిక కాలంలో స్ప్లిట్ ఏసీల (Split ACs) హడావుడి ఎంత ఉన్నా.. విండో ఏసీల (Window ACs) క్రేజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. కాలం మారుతున్నా, సరికొత్త టెక్నాలజీలు వస్తున్నా నేటికీ మార్కెట్లో విండో ఏసీలు బలంగా నిలబడగల్గుతున్నాయి. స్మార్ట్ ఫీచర్లు ఉన్న స్ప్లిట్ ఏసీలను కాదని.. ఇప్పటికీ చాలా మంది విండో ఏసీలపై మెుగ్గు చూపుతున్నారు. ఇందుకు గల 5 ప్రధాన కారణాలేంటో ఈ కథనంలో చూద్దాం.

బడ్జెట్ ఫ్రెండ్లీ!

విండో ఏసీలు ఇప్పటికీ మార్కెట్లో దూసుకుపోవడానికి ప్రధాన కారణం వాటి ధర. స్ప్లిట్ ఏసీలతో పోలిస్తే విండో ఏసీల ధర చాలా తక్కువ. మధ్యతరగతి కుటుంబాలకు, తక్కువ బడ్జెట్‌లో ఇల్లు చల్లబడాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఆప్షన్. తక్కువ ఖర్చులోనే బ్రాండెడ్ ఏసీని సొంతం చేసుకునే అవకాశం విండో ఏసీల ద్వారానే నెరవేరుతోంది.

ఇన్‌స్టాలేషన్ చాలా ఈజీ

Advertisement

స్ప్లిట్ ఏసీని అమర్చాలంటే ఇండోర్ యూనిట్, అవుట్‌డోర్ యూనిట్ అని రెండు ఉంటాయి. వాటిని కనెక్ట్ చేయడానికి గోడలకు రంధ్రాలు చేయాలి. దాంతో పాటు పైపులు వేయాలి. ఫలితంగా ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు అమాంతం పెరిగిపోతాయి. అదే విండో ఏసీ విషయానికి వస్తే అంత శ్రమ ఉండదు. ఒకే ఒక్క బాక్స్ రూపంలో ఉండే ఈ ఏసీని కిటికీలో అమర్చడం చాలా సులువు. ఇన్‌స్టాలేషన్ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది.

ఇల్లు మారే వారికి బెస్ట్ ఆప్షన్

సొంత ఇల్లు లేని వారికి, ఉద్యోగ రీత్యా తరచూ ఇల్లు మారే వారికి విండో ఏసీలు ఒక వరం లాంటివి. స్ప్లిట్ ఏసీని ఒక ఇంటి నుండి మరో ఇంటికి మార్చడం చాలా కష్టం. పైగా డబ్బుతో కూడుకున్న పని. గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అదే విండో ఏసీ అయితే కిటికీలోంచి సులభంగా తీసేసి.. కొత్త ఇంటికి తీసుకెళ్లి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫిక్స్ చేసుకోవచ్చు.

మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ

Advertisement

ఏసీ కొనడం ఒక ఎత్తు అయితే.. ఆ తర్వాత దాని సర్వీసింగ్, రిపేర్ ఖర్చులు, విద్యుత్ బిల్లులు మరో ఎత్తు. స్ప్లిట్ ఏసీలలో ఇండోర్, అవుట్‌డోర్ యూనిట్లు వేరుగా ఉండటం వల్ల వాటి మెయింటెనెన్స్ కాస్త కష్టంగా, ఖర్చుతో కూడుకున్నదిగా ఉంటుంది. కానీ విండో ఏసీలలో అన్ని విడిభాగాలు ఒకే చోట అమర్చబడి ఉంటాయి. దీనివల్ల వీటిని క్లీన్ చేయడం, సర్వీసింగ్ చేయడం చాలా సులువు. రిపేర్ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి.

Also Read: Jio Plans: జియో మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. ఒక్క రీఛార్జ్‌తో 13 ఓటీటీ యాప్స్ ఫ్రీ!

చిన్న గదులకు పర్ఫెక్ట్ కూలింగ్

బెడ్‌రూమ్‌లు, స్టడీ రూమ్‌లు, చిన్న ఆఫీస్ క్యాబిన్‌ల వంటి తక్కువ స్థలం ఉన్న గదులకు విండో ఏసీలు అద్భుతంగా పనిచేస్తాయి. గది చిన్నదైనప్పుడు స్ప్లిట్ ఏసీల కంటే విండో ఏసీలే త్వరగా సమర్థవంతంగా చల్లదనాన్ని అందిస్తాయి. అనవసరమైన హంగులు లేకుండా తక్కువ స్థలంలోనే పర్ఫెక్ట్ కూలింగ్ ఇవ్వడంలో ఇవి బెస్ట్ గా నిలుస్తున్నాయి.

Also Read: జియో సూపర్ ఆఫర్.. సంవత్సరం పాటు.. రోజూ 2.5GB డేటా, నాన్ స్టాప్ వినోదం!

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×