E-Paper
Advertisement

LPG Alternatives: గ్యాస్ సమస్య వేధిస్తుందా? ఈ స్మార్ట్ పరికరాలతో.. నచ్చింది తినేయచ్చు!

LPG Alternatives: గ్యాస్ సమస్య వేధిస్తుందా? ఈ స్మార్ట్ పరికరాలతో.. నచ్చింది తినేయచ్చు!
Advertisement

LPG Alternatives: ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌లో ఎల్‌పీజీ (LPG) సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇలాంటి సమయంలో మీ వంటగది పనులు ఆగకుండా సాఫీగా సాగడానికి ఈ 6 సులభమైన మార్గాలు దోహదపడతాయి. ఇంతకి అవి ఏంటి? వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏవి? ఈ కథనంలో పరిశీలిద్దాం.

ఇండక్షన్ స్టవ్ (Induction Cooktop)

గ్యాస్ కు అత్యుత్తమమైన ప్రత్యామ్నయంగా ఇండక్షన్ స్టవ్ ను చెబుతుంటారు. ఇది గ్యాస్ స్టవ్ కంటే వేగంగా వంట చేసేస్తుంది. 90% శక్తిని వంటకే ఉపయోగిస్తుంది. కాబట్టి విద్యుత్ బిల్లు కూడా తక్కువే వస్తుంది.

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ (Electric Rice Cooker)

Advertisement

దీన్ని కేవలం అన్నం వండటానికే కాకుండా మల్టీ-టాస్కింగ్ కోసం వాడొచ్చు. ఇందులో పప్పు, కిచిడీ, ఉప్మా వంటివి సులభంగా చేసుకోవచ్చు. పైన ఉండే స్టీమర్ బాస్కెట్‌లో కూరగాయలు లేదా ఇడ్లీలను కూడా ఉడికించుకోవచ్చు.

మైక్రోవేవ్ ఓవెన్ (Microwave)

కేవలం ఆహారాన్ని వేడి చేయడానికే కాకుండా వంటకు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. బంగాళదుంపలు, కూరగాయలను త్వరగా ఉడికించడం, పప్పులను వండటం వంటివి మైక్రోవేవ్‌ సాయంతో చాలా వేగంగా చేసుకోవచ్చు. ఇది విద్యుత్ ద్వారా పనిచేస్తుంది కాబట్టి.. గ్యాస్ అవసరం ఉండదు.

ఎయిర్ ఫ్రైయర్ (Air Fryer)

Advertisement

వేపుళ్ళు (Fries/Roasts) ఎక్కువగా చేసుకునే వారికి ఈ సాధనాన్ని ఒక వరంగా చెప్పవచ్చు. దీని వల్ల నూనె వాడకం తగ్గడమే కాకుండా స్టవ్ మీద గంటల తరబడి వేయించే పని తప్పుతుంది. నాన్-వెజ్ వంటకాలు, చిరుతిళ్లకు ఇది ఉత్తమమైన సాధనంగా చెబుతారు.

ఎలక్ట్రిక్ కెటిల్ (Electric Kettle)

ఎలక్ట్రిక్ కెటిల్ సైతం గ్యాస్ మీద ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. చిన్న చిన్న పనులను వీటి సాయంతో చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. ఉదాహరణకు టీ, కాఫీ కోసం నీటిని మరిగించడం లేదా వంటలో వాడే వేడి నీటిని ఇందులో సిద్ధం చేసుకోవడం వల్ల గ్యాస్ వినియోగాన్ని 10-15 శాతం తగ్గించవచ్చు.

Also Read: Gas Alternatives: దేశంలో గ్యాస్ కొరత.. ఎయిర్ ఫ్రైయర్, మైక్రోవేవ్, ఇండక్షన్ స్టవ్.. వంటకు ఏది బెస్ట్?

గ్యాస్ ఆదా చిట్కాలు (Cooking Hacks)

సాంకేతిక పరికరాలతో పాటు కొన్ని చిట్కాల ద్వారా గ్యాస్‌ను పొదుపు చేయవచ్చు. పప్పులు, బియ్యం వండే ముందు కనీసం 30 నిమిషాలు నానబెడితే అవి త్వరగా ఉడికి గ్యాస్ ఆదా అవుతుంది. అలాగే ఏ వంట చేసినా పాత్రపై మూత పెట్టడం వల్ల ఆవిరి బయటకు పోకుండా ఆహారం త్వరగా ఉడుకుతుంది. కిచిడీ లేదా పులావ్ వంటివి చేయడం వల్ల ఒకేసారి పని పూర్తవుతుంది. ఎక్కువ బర్నర్లు వాడాల్సిన అవసరం కాదు.

Also Read: Food Adulteration: డేంజర్ బెల్స్.. తక్కువ ధరకు ఎక్కువ రుచి అని తెగ తినేస్తున్నారా..!

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×