E-Paper
Advertisement

Strait of Hormuz: ఇరాన్-అమెరికా యుద్ధం ఆగినా.. రెండు నెలల వరకు షిప్‌లు రావడం కష్టమే? అదే కారణం

Strait of Hormuz: ఇరాన్-అమెరికా యుద్ధం ఆగినా.. రెండు నెలల వరకు షిప్‌లు రావడం కష్టమే? అదే కారణం
Advertisement

Strait of Hormuz: ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో హర్మూజ్‌ జలసంధి నౌకలకు మృత్యు మార్గంగా మారింది. ఇరాన్‌పై దాడులు తీవ్రం చేసినకొద్దీ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకొనేందుకు కొత్త కొత్త ఎత్తులు వేస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే కేవలం హర్మూజ్‌ జలసంధి మాత్రమే ఇరాన్‌ని కాపాడుతోంది. లేకుంటే ఈపాటికి యుద్ధం ఎప్పుడో ముగిసేదని అంటున్నారు అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు.

ఇరాన్-అమెరికా యుద్ధం ఆగినా రెండు నెలల వరకు షిప్‌లు రావడం కష్టమే?

Advertisement

హర్మూజ్‌ జలసంధి ప్రాంతంలోకి అమెరికా-ఇజ్రాయెల్ నౌకలు అడుగు పెడితే పేలిపోయేలా ఇరాన్‌ భారీ స్కెచ్ వేసింది. సముద్రంలో ఎక్కడికక్కడ సముద్రపు మందుపాతరలు అమరుస్తోంది. ఇరాన్ చేస్తున్న వ్యవహారం ట్రంప్‌ సర్కారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నార్మల్‌గా అయితే శత్రువులు సరిహద్దులు దాటి తమ భూభాగంలోకి రాకుండా మందుపాతరలు అమర్చుతారు.

సముద్ర జలాల్లో అమర్చే వాటిని సీ మైన్స్‌ అంటారు. ముఖ్యంగా షిప్‌లు, సబ్ మెరైన్లను ధ్వంసం చేయడానికి ప్రయాణించే మార్గాల్లో ఏర్పాటు చేస్తారు.  యుద్ధాల నేపథ్యంలో కొన్ని దేశాలు ఇలాంటివి అవలంభిస్తాయి. హర్మూజ్‌ జలసంధిలో మందుపాతరలను ఉపయోగించి నౌకల రవాణా అడ్డుకోవడానికి ఇరాన్‌ చేసిన ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా దేశాల్లో గుబులు రేపుతున్నాయి.

Advertisement

రాత్రి పూట రహస్యంగా ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్ నేవీ వింగ్ వీటిని అమరుస్తుంది. అందుకోసం చిన్న బోట్ల ద్వారా వాటిని సముద్ర జలాల్లో వాటిని పడేస్తాయి. వీటిని రాడార్‌ వ్యవస్థ గుర్తించడం కష్టం. మందుపాతరలను అమర్చే ప్రదేశాలను ప్రత్యేక మ్యాపులతో ఐఆర్‌జీసీ ప్రత్యేక నిఘా ఉంచుతుంది. వాటి నుంచి తప్పించుకోవాలంటే కేవలం ఇరాన్‌ నౌకలకు మాత్రమే సాధ్యం.

హర్మూజ్‌ జలసంధి ప్రాంతంలో అడుగడుగునా సీ మైన్స్‌

సముద్రపు మందుపాతరలు రకరకాలుగా ఉన్నాయి. కాంటాక్ట్‌ మైన్స్‌ను ఎక్కువగా వినియోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. వీటికయ్యే ఖర్చు చాలా తక్కువని అంటున్నారు. నౌకలు వాటిని తాకినప్పుడు భారీ శబ్దంతో పేలుతాయి.

మార్పడ్ మైన్స్.. సముద్రగర్భంలో ఓ కేబుల్‌తో లంగరు వేసి ఉంటాయి. నీటి అడుగున ట్రిప్‌వైర్‌ల మాదిరిగా ఉంటాయి.

ఇన్‌ఫ్లుయెన్సర్‌ మైన్స్‌ చాలా అత్యాధునికమైనవి. నౌక నేరుగా దాన్ని తాకాల్సిన పని లేదు. కేవలం సెన్సర్ల ఆధారంగా పని చేస్తాయి. మ్యాగ్నటిక్‌ సంకేతాలు సముద్రపు నీటిలో మార్పులు, ప్రకంపనల ఆధారంగా యాక్టివేట్ అవుతాయి. పై రెండింటిని కాంటాక్ట్, ఇన్‌ఫ్లుయెన్సర్‌ మైన్స్‌ను రిమోట్‌తో నియంత్రించొచ్చు. అలాగే రైజింగ్‌ మైన్స్‌ అనేవి ప్రొజెక్టైల్స్‌ వెళ్లి నౌకను నేరుగా తాకుతాయి.

ఐదోది బాటమ్ మైన్స్. లక్ష్యం దగ్గరయ్యే వరకు సముద్ర గర్భంలో దిగువన ఉంటాయి. ఒక్కసారి యాక్టివేట్ అయితే వాటిని ఆపడం కష్టం.

ఆరోది సెల్ప్ బైరింగ్ మైన్స్. వీటిని నీటిలో స్వయంగా పాతిపెట్టి ఉంచుతారు. వీటిని గుర్తించడం చాలా కష్టమవుతుంది.

ALSO READ: చేతులెత్తేసిన ట్రంప్.. చమురు ధరలు పెరిగితే ఆర్థిక వ్యవస్థకు లాభమని వ్యాఖ్య

టెక్నాలజీ ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉండేది రైజింగ్ టార్పెడో మైన్స్. అత్యంత అధునాతనమైనవి, ఓడ, సబ్ మెరైన్లను వంటి లక్ష్యాన్ని గుర్తించి టార్పెడోని ప్రయోగిస్తారు. శబ్దం లేకుండా పేల్చేస్తాయి. మందుపాతర స్థాయిని బట్టి 50 నుంచి 1000 కేజీల పేలుడు పదార్థాలు అందులో ఉంటాయి. అందుకే నౌకా గనులు అంత శక్తివంతమైనవి. ఇలాంటి పరిస్థితుల్లో ఓడలను ముంచాల్సిన అవసరం లేదు.

హర్మూజ్‌ జలసంధి ఇలాంటివి చాలానే ఉన్నాయట. అందుకే ఓడలు వెళ్లేందుకు భయపడుతున్నాయి. గతంలో వీటిని చైనా, రష్యా నుంచి కొనుగోలు చేసింది ఇరాన్. ఆ తర్వాత ఉత్పత్తి చేయడం మొదలుపెట్టింది. జలాంతర్గాముల సాయంతో సముద్రంలో అమర్చే మైన్స్‌ టెహ్రాన్‌ వద్ద ఉన్నాయన్నది నిపుణుల మాట.

మందుపాతరల వ్యవహారం అమెరికాను కలవర పెడుతోంది. ఈ క్రమంలో అమెరికా దళాలు మందుపాతరలను అమర్చే ఇరాన్‌ నౌకలను ధ్వంసం చేశాయి. ఇలాంటి నౌకలు పెద్దసంఖ్యలో ఇరాన్‌ వద్ద ఉన్నాయి. వీటిని తొలగించాలంటే దాదాపు ఆరు నుంచి ఎనిమిది వారాల వరకు పట్టవచ్చు.  ఈ లెక్కన యుద్ధం ముగిసినా రెండువారాల వరకు నౌకలు బయటకు రావడం కష్టమే. అమెరికా విప్లవ సమయంలో గన్‌ పౌడర్‌ నీటి అడుగున పేలుతుందని గుర్తించారు. వీటి తయారీ అప్పుడే బీజం పడింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వీటి వినియోగం విపరీతంగా పెరిగింది.

 

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×