E-Paper
Advertisement

Gas Alternatives: దేశంలో గ్యాస్ కొరత.. ఎయిర్ ఫ్రైయర్, మైక్రోవేవ్, ఇండక్షన్ స్టవ్.. వంటకు ఏది బెస్ట్?

Gas Alternatives: దేశంలో గ్యాస్ కొరత.. ఎయిర్ ఫ్రైయర్, మైక్రోవేవ్, ఇండక్షన్ స్టవ్.. వంటకు ఏది బెస్ట్?
Advertisement

Gas Alternatives: గల్ఫ్ దేశాల్లో మెుదలైన యుద్ధం.. భారత్ లోని గ్యాస్ సరఫరా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో కమర్షిషియల్, డొమెస్టిక్ అవసరాలకు సంబంధించిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై అనిశ్చితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ పై అధికంగా ఆధారపడకుండా.. హ్యాపీగా వంట చేసుకునే మార్గాలను ప్రజలు అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న వివిధ సాధనాల్లో వంటకు ఏది సమర్థవంతమైనదో ఇప్పుడు చూద్దాం.

ఇండక్షన్ స్టవ్ (Induction Cooktop)

గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కుకింగ్ సాధనాల్లో ఇది అత్యుత్తమమైనది. గ్యాస్ అవసరం లేకుండానే విద్యుత్ తో ఇవి పనిచేస్తాయి. ఇది 90 శాతం వరకు శక్తిని నేరుగా గిన్నెకు అందిస్తుంది. దీనివల్ల వంట చాలా వేగంగా అవుతుంది. పైగా వేడి బయటకు పోదు. దీనిని వినియోగించడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయి. క్లీన్ చేయడం కూడా సులభం.

ఎయిర్ ఫ్రైయర్ (Air Fryer)

Advertisement

ఇది ఆయిల్ తో సంబంధం లేకుండా వంటను చకా చకా చేసేస్తుంది. విద్యుత్ తో పనిచేస్తుంది కాబట్టి.. గ్యాస్ అవసరం ఉండదు. నూనె లేకుండా లేదా చాలా తక్కువ నూనెతో వేయించడానికి ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తాయి. గ్యాస్ కొరత నేపథ్యంలో ఎల్పీజీపై పూర్తి స్థాయిలో ఆధారపడకుండా.. ఇలా ఎయిర్ ఫ్రైయర్ ద్వారా వేపుళ్లు వంటివి చేసుకుంటే గ్యాస్ ఎక్కువ కాలం వినియోగానికి వస్తుంది.

మైక్రోవేవ్ ఓవెన్ (Microwave)

సాధారణంగా మైక్రో వేవ్ లను వండిన ఆహార పదార్థాలను వేడి చేయడానికి ఉపయోగిస్తారు. అయితే కొన్ని ప్రీమియం మోడల్స్ లో మాత్రం.. గ్రిల్ చికెన్, తందూరి, చికెన్ కబాబ్స్ తదితర రుచికరమైన వంటకాలను వండుకునేందుకు దోహదం చేస్తున్నాయి. ప్రస్తుత గ్యాస్ కొరత నేపథ్యంలో మైక్రో వేవ్ ఓవెన్ కూడా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిని అతిగా వినియోగిస్తే.. విద్యుత్ బిల్లు అమాంతం పెరిగిపోయే అవకాశముంది.

Advertisement

Also Read: Celebrity couples: కృష్ణ నుంచీ విజయ్ వరకూ.. వెండితెరపై మెరిసి నిజజీవితంలో మురిసిన టాలీవుడ్ జంటలు!

ఏది కొంటే బెటర్?

మీరు తక్కువ ఖర్చు, వేగాన్ని బట్టి చూస్తే ఇండక్షన్ స్టవ్ మొదటి స్థానంలో ఉంటుంది. వంటకాల వేపుళ్ల కోసమైతే ఎయిర్ ఫ్రైయర్.. ఆహారాన్ని వేడి చేయడానికి మైక్రోవేవ్ ఉత్తమమైనవి. ఓవరాల్ మీ ఇంటి అవసరాలకు అనుగుణంగా ఉన్న దానిని మీరే ఎంపిక చేసుకోండి.

Also Read: Dhurandhar 2: రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ ప్రీ సేల్స్ సునామీ మామూలుగా లేదుగా.. ఆ రికార్డ్ ఖాయం!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×