E-Paper
Advertisement

Varanasi Movie: వారణాసి రేర్ రికార్డ్.. కలలో కూడా ఊహించని?

Varanasi Movie: వారణాసి రేర్ రికార్డ్.. కలలో కూడా ఊహించని?
Advertisement

Varanasi Movie: రాజమౌళి (Rajamouli) , సూపర్ స్టార్ మహేష్ బాబు(Maheshbabu ) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా నెలకొన్నాయి. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకి అదే క్రేజ్ కనిపిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే వారణాసికి ఓవర్సీస్ లో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని.. ఒక డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమా ఓవర్సీస్ హక్కులకు గానూ ఏకంగా రూ.160 కోట్ల భారీ ఆఫర్ ప్రకటించినట్లు ఇప్పుడు సినీ వర్గాలలో చర్చ మొదలయ్యింది.

విడుదలకు ముందే రేర్ రికార్డ్..

అసలు విషయంలోకి వెళ్తే.. భారతీయ భాషలకు సంబంధించి ఏకంగా 160 కోట్ల ఆఫర్ ప్రకటించగా.. దీనిపై చిత్ర బృందం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే గనుక ఓవర్సీస్ రైట్స్ కి.గాను ఇన్ని కోట్లు దక్కించుకున్న తొలి ఇండియన్ మూవీగా వారణాసి మరో రేర్ రికార్డును సొంతం చేసుకుంటుంది అనడంలో సందేహం లేదు. ఇకపోతే రొటీన్ కి భిన్నంగా.. టైటిల్ గ్లింప్స్ తోనే కథ దాని స్థాయి ఎలాంటిదో ఆడియన్స్ కి పరిచయం చేసిన రాజమౌళి ఈ సినిమాతో ఊహించని రికార్డ్స్ ను విడుదలకు ముందే క్రియేట్ చేస్తూ ఉండడం సంచలనంగా మారింది..

Advertisement

ALSO READ:Samyukta Menon: ది బ్లాక్ గోల్డ్ నుండి సంయుక్త పవర్ ఫుల్ లుక్.. పోస్ట్ వైరల్!

అంతర్జాతీయ హంగులతో..

ఫాంటసీ మైథాలజికల్ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు రాముడిగా కూడా కనిపించనున్నారు. మందాకినిగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కనిపించనుండగా.. కుంభ పాత్రలో మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న ఈ సినిమా విడుదల కానుంది. 120 కి పైగా దేశాలలో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా అత్యధిక దేశాలలో రిలీజ్ అయిన భారతీయ సినిమాగా కూడా వారణాసి నిలవనుంది. ఏది ఏమైనా అంతర్జాతీయ హంగులతో వరల్డ్ రికార్డును సొంతం చేసుకోవడానికి వారణాసి కోసం రాజమౌళి చేస్తున్న ప్రయత్నాలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి అనడంలో సందేహం లేదు.

పాన్ వరల్డ్ హీరోగా గుర్తింపు..

Advertisement

ఇక మహేష్ బాబు విషయానికి వస్తే.. ఇప్పటివరకు టాలీవుడ్ కే పరిమితమైన ఈయన టాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ ప్రాంతీయంగా సూపర్ స్టార్ గా పేరు దక్కించుకున్నారు. అయితే ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో కాకుండా ఏకంగా పాన్ వరల్డ్ హీరోగా పేరు దక్కించుకోవడానికి వారణాసితో మన ముందుకు రాబోతున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ సినిమా లో టైం ట్రావెల్ కూడా ఉంది అని ఇటీవల గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తెలిపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండగా..ఈ అప్డేట్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. అటు రాజమౌళి కూడా ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related News

రీతూ వర్మ – వైష్ణవ్ తేజ్ మధ్య బ్రేకప్?

జయకృష్ణ సీక్రెట్ లీక్ చేసిన రషా.. ‘శ్రీనివాస మంగాపురం’ సెట్స్‌లో ఏం జరిగిందంటే?

మరో కొత్త సినిమాతో ‘లెనిన్ ‘డైరెక్టర్.. ఒక హిట్.. క్రేజీ హీరోతో ఛాన్స్!

NBK 111:బాబాయ్ కోసం అబ్బాయ్ ఎమోషనల్ మెసేజ్.. జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నాడంటే?

జాన్ అబ్రహం కొత్త ఇల్లు ఎంతో తెలుసా ..రేటు చూస్తే మతి పోవాల్సిందే !

అమితాబ్ కి సర్జరీ.. ఎంత పెద్ద తోపైనా ఓటమి తప్పదంటూ పోస్ట్!

‘టాక్సిక్’ నుంచి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్.. రొమాంటిక్ మోడ్‌లోకి రాకింగ్ స్టార్!

“గెట్ వెల్ సూన్ బాబాయ్” – బాలయ్య ప్రమాదంపై కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్!

Big Stories

Advertisement
×