E-Paper
Advertisement

8849 TANK X: స్మార్ట్‌ఫోన్‌లో ఫుల్ HD ప్రొజెక్టర్.. 32GB RAM, 17600mAh బ్యాటరీ, వాటర్‌ప్రూఫ్ ఫోన్.. ధర ఎంతో తెలుసా?

8849 TANK X: స్మార్ట్‌ఫోన్‌లో ఫుల్ HD ప్రొజెక్టర్.. 32GB RAM, 17600mAh బ్యాటరీ, వాటర్‌ప్రూఫ్ ఫోన్.. ధర ఎంతో తెలుసా?

8849 TANK X| చైనాకు చెందిన ప్రీమియం టెక్ కంపెనీ యూనిహెట్జ్ (Unihertz) సబ్ బ్రాండ్ 8849 తాజాగా కొత్త మిలిటరీ రగ్డ్ స్మార్ట్‌ఫోన్ 8849 ట్యాంక్ ఎక్స్ (TANK X)ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ బలమైన డ్యూరబిలిటీ, పవర్‌ఫుల్ బ్యాటరీ, ప్రొఫెషనల్ ఫీచర్లతో వస్తోంది. అవుట్‌డోర్ యూజర్లు, ఇంజినీర్లు, ఎమర్జెన్సీ వర్కర్లు, ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలనుకునే వారికి ఇది చాలా బాగుంటుంది. పెద్ద బ్యాటరీ, బిల్ట్-ఇన్ ప్రొజెక్టర్, బలమైన బిల్డ్ క్వాలిటీ దీని ప్రధాన హైలైట్లు.

8849 TANK X ధర, అందుబాటు

ఈ ఫోన్ అధికారిక ధర $1,049.99 (భారతదేశంలో సుమారు రూ.94,929). ప్రస్తుతం ప్రీ-బుకింగ్ ధర $549.99 (సుమారు రూ.49,724) మాత్రమే. మార్చి 1 నుంచి గ్లోబల్ షిప్పింగ్ ప్రారంభమవుతుంది. అంతర్జాతీయ వేర్‌హౌస్‌ల నుంచి షిప్ అవుతుంది.

డిస్‌ప్లే, డిజైన్ ఫీచర్లు

8849 TANK Xలో 6.78 ఇంచ్ LCD పంచ్-హోల్ డిస్‌ప్లే ఉంది. ఫుల్ HD+ రిజల్యూషన్ (1080 x 2460 పిక్సెల్స్), 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. గరిష్ట బ్రైట్‌నెస్ 750 నిట్స్ వరకు ఉంది. బయట ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.

ఇంటి గోడలను స్క్రీన్‌గా మార్చేసే బిల్ట్-ఇన్ ప్రొజెక్టర్

ఈ ఫోన్‌లో 220 లూమెన్స్ DLP ప్రొజెక్టర్ ఉంది. ఫుల్ HD 1920 x 1080 రిజల్యూషన్‌లో ప్రొజెక్ట్ చేస్తుంది. వీడియోలు, ప్రెజెంటేషన్లు ఏ గోడపైనా చూపవచ్చు. కీస్టోన్ కరెక్షన్, 4 మీటర్ల లేజర్ ఆటోఫోకస్‌తో స్పష్టత ఉంటుంది. ఏ చోటైనా మినీ సినిమా థియేటర్‌గా మారుస్తుంది.

Also Read: ఆన్‌లైన్‌లో మీ ఫొటోలకు ప్రమాదం.. యాప్‌స్టోర్‌లో పెరిగిపోతున్న బట్టలు తొలగించే ఏఐ యాప్స్

పర్‌ఫామెన్స్, సాఫ్ట్‌వేర్

మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్‌తో ఆక్టా-కోర్ పవర్ ఉంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ సులభంగా జరుగుతాయి. ఆండ్రాయిడ్ 15తో రన్ అవుతుంది. స్మూత్, ఆధునిక ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. థర్మల్ కంట్రోల్, పవర్ మేనేజ్‌మెంట్ మెరుగుపడ్డాయి.

పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్

17,600mAh భారీ బ్యాటరీ ఉంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 70 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. అవుట్‌డోర్, ప్రొఫెషనల్ ఉపయోగానికి చాలా సరిపోతుంది. డ్యూయల్-సెల్ డిజైన్ ఛార్జింగ్ స్పీడ్, సేఫ్టీ పెంచుతుంది.

మెమరీ, స్టోరేజ్

16GB ఫిజికల్ RAM + 16GB వర్చువల్ RAM ఉంది. 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. మైక్రో SD కార్డ్‌తో 2TB వరకు విస్తరించవచ్చు.

కెమెరా సెటప్

రియర్‌లో మూడు కెమెరాలు ఉన్నాయి. 50MP Sony ఆటోఫోకస్ ప్రైమరీ కెమెరా, 64MP నైట్ విజన్ కెమెరా, 8MP టెలిఫోటో (3x ఆప్టికల్ జూమ్) ఉన్నాయి. ఫ్రంట్‌లో 50MP ఫిక్స్‌డ్-ఫోకస్ సెన్సార్ ఉంది.

కనెక్టివిటీ, అవుట్‌డోర్ ఫీచర్లు

డ్యూయల్-ఫ్రీక్వెన్సీ GPS (L1 + L5)తో ఖచ్చితమైన లొకేషన్ ట్రాకింగ్ ఉంది. Wi-Fi 6, బ్లూటూత్ 5.4 సపోర్ట్ ఉన్నాయి. గ్లోబల్ నెట్‌వర్క్ క్యారియర్లు సపోర్ట్ చేస్తాయి. 1200 లూమెన్స్ క్యాంపింగ్ & ఎమర్జెన్సీ లైట్ కూడా ఉంది.

డ్యూరబిలిటీ, బిల్డ్ క్వాలిటీ

IP68, IP69K రేటింగ్‌లు ఉన్నాయి. దుమ్ము, నీరు, హై-ప్రెషర్ వాషింగ్‌ చేసినా ఫోన్ డ్యామెజ్ కాదు. కన్‌స్ట్రక్షన్ వర్కర్లు, అవుట్‌డోర్ ప్రొఫెషనల్స్, రెస్క్యూ ఆపరేషన్లకు ఇది బెస్ట్ ఆప్షన్. దీని డైమెన్షన్స్ 180.5 x 91.8 x 31.9 mm, బరువు సుమారు 750 గ్రాములు.

Related News

పాత ఫోన్ అమ్ముతున్నారా? ఈ 4 పనులు చెయ్యకుండా అమ్మితే.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

Big Stories

×